Tea consumption-type 2 diabetes: టీ తాగితే టైప్-2 మధుమేహం వచ్చే ముప్పు తక్కువ

మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల వల్ చాలా మంది టైప్-2 మధుమేహం బారినపడుతున్నారు. మధుమేహం వచ్చే ముప్పును తగ్గించుకోవడానికి ముందునుంచే అప్రమత్తంగా ఉంటే దాని బారినపడకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. టీ తాగితే టైప్-2 మధుమేహం వచ్చే ముప్పు తగ్గుతుందని తాజాగా పరిశోధకులు గుర్తించారు. ఎనిమిది దేశాల్లో దాదాపు 10 లక్షల మంది ఆరోగ్యంపై చేసిన అధ్యయనం అనంతరం ఈ వివరాలు తెలిపారు. మోతాదుకు మించకుండా బ్లాక్, గ్రీన్, ఊలాంగ్ టీ తాగేవారికి టైప్-2 మధుమేహం వచ్చే ముప్పు 17 శాతం తగ్గుతుందని తేల్చారు. రోజుకి నాలుగు కప్పుల టీ తాగేవారిలో ఈ ప్రయోజనాలను గుర్తించినట్లు వివరించారు.

Tea consumption-type 2 diabetes: టీ తాగితే టైప్-2 మధుమేహం వచ్చే ముప్పు తక్కువ

Tea consumption-type 2 diabetes

Tea consumption-type 2 diabetes: మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల వల్ చాలా మంది టైప్-2 మధుమేహం బారినపడుతున్నారు. మధుమేహం వచ్చే ముప్పును తగ్గించుకోవడానికి ముందునుంచే అప్రమత్తంగా ఉంటే దాని బారినపడకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. టీ తాగితే టైప్-2 మధుమేహం వచ్చే ముప్పు తగ్గుతుందని తాజాగా పరిశోధకులు గుర్తించారు. ఎనిమిది దేశాల్లో దాదాపు 10 లక్షల మంది ఆరోగ్యంపై చేసిన అధ్యయనం అనంతరం ఈ వివరాలు తెలిపారు.

మోతాదుకు మించకుండా బ్లాక్, గ్రీన్, ఊలాంగ్ టీ తాగేవారికి టైప్-2 మధుమేహం వచ్చే ముప్పు 17 శాతం తగ్గుతుందని తేల్చారు. రోజుకి నాలుగు కప్పుల టీ తాగేవారిలో ఈ ప్రయోజనాలను గుర్తించినట్లు వివరించారు. స్వీడన్ లోని స్టాక్ హోంలో ఈ నెల 19 నుంచి 23 వరకు యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ సమావేశంలో పరిశోధకులు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

ప్రజలు తమకు ఇష్టమైన టీని తాగుతూ టైప్-2 మధుమేహ ముప్పు నుంచి దూరంగా ఉండొచ్చని చెప్పారు. ప్రతిరోజు టీ తాగితే పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఇంకుముందే పలు పరిశోధనల్లో తేలింది. అయితే, మధుమేహ ముప్పు తగ్గడానికి-టీకి ఉన్న సంబంధాన్ని తెలిపే స్పష్టమైన ఆధారాలు లేవు. పరిశోధకులు ఇప్పుడు ఈ విషయాన్ని కూడా తేల్చారు. ఈ పరిశోధనను 1997 నుంచి చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు.

Hyderabad T20 Match: 4 వేల కార్లు, 5 వేల బైకుల పార్కింగుకు స్థలం కేటాయింపు.. ట్రాఫిక్ ఆంక్షలు