ట్రంప్‌‌‌ను కాపాడిన 9 ‘కాక్ టెయిల్’ Covid drugs ఇవే..

  • Published By: sreehari ,Published On : October 6, 2020 / 06:02 PM IST
ట్రంప్‌‌‌ను కాపాడిన 9 ‘కాక్ టెయిల్’ Covid drugs ఇవే..

కరోనా బారినపడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోలుకున్న 72 గంటల తర్వాత ఆస్పత్రి నుంచి వైట్ హౌస్ కు తిరిగి వచ్చారు. 74ఏళ్ల ట్రంప్.. కరోనా వైరస్ విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా లక్షణాలతో Walter Reed hospital లో నాలుగురోజుల పాటు ట్రంప్.. కొత్త పద్ధతిలో చికిత్స తీసుకున్నారు. జాతిని ఉద్దేశించి ట్రంప్ ఒక వీడియోను రిలీజ్ చేశారు. కోవిడ్ విషయంలో ఆందోళన చెందొద్దని సూచించారు.



అంతేకాదు.. తనలో కరోనా లక్షణాలు అభివృద్ధిచెందాయన్నారు.. ట్రంప్ పరిపాలనలో ఎన్నో మంచి డ్రగ్స్, విజ్ఞానం అందుబాటులో ఉందన్నారు. 20 ఏళ్ల క్రితం చేసినదానికంటే ఇప్పుడు బాగా చేసానని నమ్ముతున్నానని ట్రంప్ అభిప్రాయపడ్డారు. కరోనా సోకిన ట్రంప్‌కు మొత్తం 9 డ్రగ్స్ సాయంతో వేర్వేరు చికిత్సలు జరిగాయి. అధ్యక్షుడి హోదాలో ఆస్పత్రిలోనే అతి తక్కువ సమయంలో వివిధ రకాల 9 ట్రీట్ మెంట్స్ ఇచ్చారు. ఐదో రోజు వైద్యులు.. ట్రంప్‌కు remdesivir డ్రగ్ ఇచ్చారు.



ప్రస్తుతానికి ఈ డ్రగ్.. తీవ్ర అనారోగ్యానికి గురైనవారికి మాత్రమే ఇస్తున్నారు. అలాగే REGN-COV2 ప్రయోగాత్మక డ్రగ్ ను సింగిల్ డోస్ ఇచ్చారు. వైరస్ తో పోరాడే రోగ నిరోధతను పెంచేందుకు యాంటీబాడీల కోసం ఈ డ్రగ్ వాడుతారు. శక్తివంతమైన స్టెరాయిడ్ dexamethasone కూడా ట్రంప్ కు చికిత్సలో అందించారు.

కరోనా తీవ్ర లక్షణాల్లో శ్వాసపరమైన సమస్యలతో బాధపడేవారికి మాత్రమే ఈ డ్రగ్ ఇవ్వడం జరుగుతుంది. వైట్ హౌస్‌లో కూడా ట్రంప్‌కు అదే తరహా ట్రీట్ మెంట్ కొనసాగుతుందని నేవీ కమాండర్, డాక్టర్ Sean Conley పేర్కొన్నారు. కరోనాతో పోరాడుతున్న ట్రంప్ త్వరగా కోలుకునేందుకు ఆస్పత్రి వైద్యులు మొత్తం 9 వేర్వేరు డ్రగ్స్ (కాక్ టయిల్) కలిపి ఇచ్చారు. అవేంటో ఓసారి చూద్దాం..



1. Dexamethasone :
Dexamethasone డ్రగ్.. కోవిడ్ -19 నుంచి ప్రాణాలతో బయటపడేందుకు మొదటి ట్రీట్ మెంట్ గా చెప్పవచ్చు.. ప్రాణాలను నిలబెట్టే ఈ డ్రగ్ ఖరీదు 5 పౌండ్లు ఉంటుంది. త్రీవమైన కరోనా లక్షణాలు ఉన్నవారికి మాత్రమే ఈ డ్రగ్ ఇవ్వడం జరుగుతుంది. 1957లో ఈ డ్రగ్ కనిపెట్టారు.. 1961లో దీనికి ఆమోదం లభించింది. WHO అత్యవసరమైన ఔషధాల జాబితాలో Dexamethasone డ్రగ్ కూడా ఒకటి. కరోనా ప్రారంభంలోనే ఈ డ్రగ్ అందుబాటులో ఉంటే.. 5వేల మంది బ్రిటన్ల మరణాలను నివారించడం సాధ్యపడేది.



2. Remdesivir :
ఈ యాంటీ వైరల్ డ్రగ్ చాలా ఖరీదైనది.. తీవ్ర కరోనా కేసుల్లో మాత్రమే ఈ డ్రగ్ వాడుతుంటారు. ప్రయోగాత్మక యాంటీ వైరల్ డ్రగ్.. యూఎస్ ఫార్మాసిటికల్ కంపెనీ Gilead ఉత్పత్తి చేసింది. ప్రారంభంలో ఈ డ్రగ్‌ను Ebola వైరస్ చికిత్స కోసం వాడేవారు. అత్యవసరంగా ఈ డ్రగ్ వాడొచ్చునని FDA ఆమోదం తెలిపడంతో ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు.

3. REGN-COV2 :
ఈ డ్రగ్ కూడా ప్రయోగాత్మక యాటీబాడీ ఔషధం.. దీన్ని కాక్ టైల్ డ్రగ్ అని కూడా పిలుస్తారు.. దీన్ని Regeneron Pharmaceuticals అనే కంపెనీ అభివృద్ధి చేసింది. కృత్రిమంగా తయారైన రెండు యాంటీబాడీలను ఇంజెక్షన్ ద్వారా సింగిల్ డోస్ ఇస్తారు. మొట్టమొదటగా ఎలుకలపై ఈ ఔషధాన్ని పరీక్షించారు.



40 శాతం స్థూలకాయత్వం కలిగిన 275 మందికి ఈ డ్రగ్ ఇవ్వడం ద్వారా వారిలో వ్యాధినిరోధకత పెరిగినట్టు గుర్తించారు. అమెరికా బయట ఎక్కడ కూడా క్లినికల్ ట్రయల్స్ కోసం వాడేందుకు అనుమతి లేదు. కరోనా చికిత్సలో ట్రంప్ కూడా 8mg డోస్ తీసుకున్నారు.. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ నేషనల్ రికవరీ ట్రయల్ లో భాగంగా గత వారంలోనే REGN-COV2 క్లినికల్ ట్రయల్స్ పై బ్రిటన్లపై ప్రారంభమైంది.



4. Vitamin D :
కరోనా ప్రారంభం నుంచి వ్యాధినిరోధకతను పెంచడంలో విటమిన్ D ఎంత సమర్థవంతగా పనిచేస్తుందో నిపుణులు టెస్టింగ్ చేస్తూనే ఉన్నారు. కరోనా సోకిన వారిలో విటమన్ డి లోపం అధికంగా ఉంటే వారు వైరస్ తో మరణించే అవకాశాలు అధికంగా ఉన్నాయని అధ్యయనాలు వెల్లడించాయి. విటమిన్ D ఖరీదు ఒక పిల్ పై 6p వరకు ఉండొచ్చు. కానీ, ఆక్స్ ఫర్డ్ పరిశోధకులు మాత్రం కరోనాలో విటమిన్ Dకి సంబంధించి ఎలాంటి క్లినికల్ ఆధారాలేమి లేవు.

5. Melatonin :
ఈ డ్రగ్.. ఒక విధమైన సప్లిమెంట్ గా చెప్పవచ్చు.. సాధారణంగా నిద్రలేమి సమస్య నివారణిగా వాడుతుంటారు. మంటగా అనిపించే అనేక సమస్యలపై పోరాడేందుకు ఈ డ్రగ్ వాడుతుంటారు. కరోనా బాధితుల్లో ఊపిరితిత్తుల బయట రోగ నిరోధకత అధికంగా స్పందించేలా ప్రేరేపిస్తుందని నిపుణులు నమ్ముతున్నారు.



అమెరికాలోని టెక్సాస్ లో 400 మంది వైరస్ బాధితులకు ఈ డ్రగ్ వాడామని వైద్యులు ఒకరు చెప్పారు. తీవ్రమైన లక్షణాలతో ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉన్న కొంతమందికి ఈ డ్రగ్ ఇచ్చినట్టు తెలిపారు. కరోనా బాధితులపై అధికారిక ట్రయల్స్ ఇప్పటివరకూ జరగలేదు.

6. Oxygen :
కరోనా బాధితులు ఆస్పత్రి చేరాల్సి వచ్చినప్పుడు సప్లిమెంటరీ ఆక్సిజన్ ఇవ్వడానికి ఇదొకటి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ముక్కు లోపల ప్లాస్టిక్ ట్యూబ్ ద్వారా లేదా లూజ్ ఫేస్ మాస్క్ ద్వారా ఆక్సిజన్ అందిస్తారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా సోకిన సమయంలో ఆయనకు ఆక్సిజన్ ట్రీట్ మెంట్ ఇవ్వాల్సి వచ్చింది.



తనకు ఫేస్ మాస్క్ ద్వారా ఆక్సిజన్ అందించారని, లీటర్ల కొద్ది ఆక్సిజన్ సుదీర్ఘ సమయం వరకు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ట్రంప్ డాక్టర్లు కూడా.. ఆయన సాచురేషన్ లెవల్స్ శుక్రవారం, శనివారం రెండుసార్లు 94 శాతం కంటే తక్కువగా ఉన్నాయని చెప్పారు. సాధారణంగా 95 శాతం నుంచి 100 శాతం మధ్య ఉండాలి.

7. Zinc :

జింక్ అనేది ఒక మినరల్.. యాంటీ వైరల్ ఇమ్యూనిటీ పెంచేందుకు వాడతారు. అలాగే మంటను కూడా తగ్గిస్తుంది. సాధారణ జలుబుపై ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని గత అధ్యయనాల్లో తేలింది. మూడు ట్రయల్స్‌లో zinc acetate లేదా placebo ఇచ్చారు.

జలుబు వ్యవధిని 40 శాతం వరకు తగ్గించింది. మరో నాలుగు ట్రయల్స్ లో కూడా zinc gluconate, లేదా placebo ఇవ్వగా.. zinc gluconate తీసుకున్నవారిలో జలుబు వ్యవధి 28 శాతం మేర తగ్గింది. కరోనా చికిత్సలో ఈ డ్రగ్ వాడొచ్చునని సూచించినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవు.



8. Famotidine :
గుండెలో మంటను తగ్గించడంలో ఈ Famotidine డ్రగ్ అద్భుతంగా పనిచేస్తుంది. Pepcid అనే బ్రాండ్ పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. కడుపులో యాసిడ్ ఉత్పత్తిని తగ్గించడంలో ఈ డ్రగ్ బాగా పనిచేస్తుంది. కరోనా వైరస్ కు అవసరమైన ప్రతిరూప ఎంజైమ్‌ను కూడా బ్లాక్ చేయగలదని పరిశోధకులు తెలిపారు.

కరోనా ప్రారంభ లక్షణాల్లో ఈ డ్రగ్ వాడొచ్చునని చైనాలోని ప్రాథమిక అధ్యయనాలు తెలిపాయి. కరోనాతో మరణించే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనం పేర్కొంది. అమెరికాలో దీనిపై ఒక క్లినికల్ ట్రయల్ జరుగుతోంది.



9. Aspirin :
కరోనా సోకిన వారిలో చాలా కేసుల్లో ఊపిరితిత్తుల్లోని రక్త కణాలు గడ్డకట్టుక పోవడం జరుగుతుంది.. ఇలాంటి సందర్భాల్లో ఆస్ర్ర్పిన్ వాడుతుంటారు.. దీనివల్ల రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు సాయపడుతుంది. రక్తం గడ్డకడితే హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది.. ఫలితంగా మరణం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. ఈ డ్రగ్ తీసుకోవడం ద్వారా రక్తం గడ్డకుండా నివారిస్తుంది.