Covid-19 చికిత్స కోసం ఏయే డ్రగ్స్‌తో ప్రయోగాలు జరుగుతున్నాయో తెలుసా?

Covid-19 చికిత్స కోసం ఏయే డ్రగ్స్‌తో ప్రయోగాలు జరుగుతున్నాయో తెలుసా?

కరోనా వైరస్ నియంత్రణకు ప్రస్తుతానికి ఎలాంటి వ్యాక్సీన్ అందుబాటులో లేదు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను కట్టడి చేయాలంటే ప్రపంచ దేశాల ముందు ఉన్న ప్రధాన ఆయుధం.. లాక్‌డౌన్ ఒకటే.. సామాజిక దూరంతో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రపంచమంతా పోరాడుతోంది. ఇవన్నీ తాత్కాలిక నిరోధకాలే.. కరోనాను పూర్తిగా నిర్మూలించాలంటే తప్పనిసరిగా వ్యాక్సీన్ ఉండాల్సిందే. అప్పుడు కరోనా పూర్తి స్థాయిలో నియంత్రణలోకి వస్తుంది.

భవిష్యత్తులో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే వ్యాక్సీన్ల కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు విస్తృత స్థాయిలో కొనసాగుతున్నాయి. వైద్యులు, సైంటిస్టులు కరోనా వ్యాక్సీన్ కనిపెట్టేందుకు పరిశోధనలు, అధ్యయనాలు చేస్తున్నారు. ఇదివరకే అందుబాటులో ఉన్న కొన్ని మందులు లేదా ట్రీట్ మెంట్ ప్రోటోకాల్స్ ద్వారా కరోనాపై ప్రయోగాలు చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఏయే డ్రగ్స్‌తో కొవిడ్-19 వ్యాక్సీన్ కోసం ప్రయోగాలు జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

* ఆస్ట్రేలియాలో SARS-Cov-2 వైరస్ నిర్మూలన కోసం రీసెర్చర్లు తలలో పేలను చంపేందుకు వాడే  ivermectin మందుతో కరోనాను చంపే అవకాశం ఉందని గుర్తించారు. ఈ యాంటీ లైస్ డ్రగ్.. ఆరోగ్యకరమైన మనిషి రక్త కణాల్లోకి ప్రవేశించకుండా వైరస్ RNA ఎంట్రీని బ్లాక్ చేస్తుంది. దీని కారణంగా శరీరంలోని వ్యాధినిరోధక వ్యవస్థ.. వైరస్‌తో పోరాడే సామర్థ్యాన్ని క్రమంగా పెంచుతుంది.

* ICMR ఆమోదించిన మరో డ్రగ్.. remdesivir ఇదొకటి. ఈ డ్రగ్‌ను సాధారణంగా ఎబోలా చికిత్స కోసం క్లినికల్ ట్రయల్స్ లో వాడారు. ఇందులో కొంత విజయాన్ని సాధించారు. అమెరికా, యూరోప్ , ఆసియా దేశాల్లో కొవిడ్-19 వైరస్‌పై remdesivir మందుతో  ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇదే మందు వాడకంతో చాలా సత్పలితాలను ఇచ్చింది. చికిత్స అనంతరం కొందరు కొవిడ్ రోగులు కోలుకున్నారు. దీనిపై WHO ఆమోదం కోసం ICMR ఎదురుచూస్తోంది.

* AIDS చికిత్సకు వాడే రెండు HIVయాంటైర్ ట్రోవైరల్ డ్రగ్స్ lopinavir, ritonavir కాంబినేషన్‌తో కొవిడ్-19 చికిత్సకు పనిచేస్తుందని గుర్తించారు. కొవిడ్-19 పాజిటివ్ పేషెంట్లకు చికిత్స కోసం ICMR కూడా ఇప్పటికే ఆమోదం తెలిపింది. వాస్తవానికి WHO దీని వాడకంపై కొన్ని సూచనలను కూడా చేసింది.

* మలేరియాకు వాడే ముందుగా hydroxychloroquine (HCQ) ఎంతో పాపులర్ అయింది. అతిపెద్ద HCQ ఉత్పత్తి చేసే భారతదేశంలో కొవిడ్-19 పేషెంట్లకు అత్యవసర సమయాల్లో చికిత్స అందించేందుకు US FDA ఈ మందుకు ఆమోదం తెలిపింది. ఇప్పటివరకూ ఈ HCQ మందును 20కి పైగా దేశాలకు సరఫరా చేయాలని భారత్ నిర్ణయించింది.

* కొవిడ్-19 పాజిటివ్ పేషెంట్లకు plasma therapyతో చికిత్స అందించేందుకు మరో రెండు వారాల్లో ICMR క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనుంది. అమెరికాలో కరోనాతో తీవ్ర అనారోగ్యం పాలైనవారు కూడా కోలుకున్నారు. కరోనా సోకినా కోలుకున్నవారిలో యాంటీబాడీస్ తయారవుతాయి.

వారి రక్తంలోని ప్లాస్మాతో చికిత్స చేస్తారు. అత్యవసర కేసుల్లో మాత్రమే ఒక పేషెంట్ నుంచి ప్లాస్మాను వాడేందుకు US FDA ఆమోదం తెలిపింది. అలాగే భారతదేశంలో కూడా కొవిడ్-19 రోగుల్లో తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి చికిత్స అందించే ఈ ప్లాస్మా థెరపీకి ఢిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.