కొవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత తీసుకోవాల్సిన ఏకైక ఫుడ్ ఇదే..

కొవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత తీసుకోవాల్సిన ఏకైక ఫుడ్ ఇదే..

Corona-Vaccination

Food after COVID-19 Vaccination: కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారా.. అపోహల నడుమ ఫుడ్ తీసుకోకపోతే 100శాతం కంఫర్ట్ కోల్పోతాం. మనం బెటర్ గా ఫీల్ అవడానికి తీసుకునే ఫుడ్స్ లో ఒక గ్లాసు నిండా టీ, లేదా చికెన్ సూప్ ఏదైనా బెటర్ అంటున్నారు. దాదాపు చికెన్ సూప్ తీసుకోవడమే బెటర్ అంటున్నారు. ఎక్కువమంది ఇష్టపడే చికెన్ సూప్.. హెల్త్ పరంగా కూడా మంచిదని అంటున్నారు నిపుణులు.

వ్యాక్సిన్ తర్వాత కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఉండొచ్చు. ప్రతి ఒక్కరికీ అలా జరగకపోవచ్చు కూడా. కొందరు వ్యాక్సిన్ పేషెంట్లు గంటల పాటు సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవచ్చు. జ్వరం, చిల్స్, అలసిపోవడం, తలనొప్పి రావడం వంటివి కనిపిస్తుంటాయి. ఇవన్నీ శరీరంలో జరిగే మార్పుల వల్ల కలగొచ్చు.

మీ శరీరం స్పైక్ ప్రొటీన్ కు రియాక్ట్ అవడం మొదలుపెడితే అలా జరుగుతాయి. ఇమ్యూన్ సిస్టమ్ తో పోరాడుతున్నప్పుడు మోచేతుల్లో నొప్పి, జ్వరం, కండరాల నొప్పులు వంటివి కలగడం సహజం.

అందుకే ఇమ్యూన్ బూస్టింగ్ ఫుడ్స్ తినడం రికవరీ అవడంలో ఎంత ఇంపార్టెంట్ టో తెలుస్తుంది. ప్రత్యేకించి ఎక్కువ వాటర్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడమే మంచిది. కొవిడ్ 19 వ్యాక్సిన్ తర్వాత పెద్ద మొత్తంలో ద్రావణాలు తీసుకోవాల్సిందే. ఆ రికవరీ కోసం ఏదైనా యాంటీ ఇన్‌ఫ్లమ్మేటరీ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది.

ఉడకబెట్టిన పులుసు లాంటివి తినడం బెటర్. చికెన్ నూడిల్, ఎముకల సూప్ తినొచ్చు. వాటిల్లో బీన్స్, లెంటిల్స్, పొటాటో, బ్రకోలీ లాంటి పదార్థాల సూప్ చేసుకుని తాగొచ్చు. UCLA సెంటర్ ఫర్ ఈస్ట్-వెస్ట్ మెడిసిన్ వివరాల ప్రకారం.. చికెన్, ఉల్లిపాయలు, కారెట్స్, సెలెరీ, పార్‌స్లీ, ఉప్పు, మిరియాలు వంటివి ఇన్ఫెక్షన్ తో ఫైట్ చేయడానికి హెల్ప్ అవుతాయి.