చైనాలో కరోనాపై రోబోల ఫైట్: వైరస్‌ను తరిమికొడుతున్నాయి చూడండి!

  • Published By: sreehari ,Published On : March 6, 2020 / 03:26 PM IST
చైనాలో కరోనాపై రోబోల ఫైట్: వైరస్‌ను తరిమికొడుతున్నాయి చూడండి!

చైనాను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు రోబోలు రంగంలోకి దిగాయి. COVID-19 వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తమ వంతు సాయాన్ని అందిస్తున్నాయి. కరోనా నుంచి మేం కాపాడుతామంటూ రోబోలే అన్ని పనులు చేసేస్తున్నాయి. ఆస్పత్రులన్ని క్లీన్ చేస్తున్నాయి.

మనుషుల నుంచి మనుషులకు వైరస్ సోకుతుండటంతో రోబోలే వంటలు వండేస్తున్నాయి. ఆహార పదార్థాలను కూడా వైరస్ బాధితులకు వడ్డిస్తున్నాయి. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా పాకడంతో ఇప్పటివరకూ 3వేలకు పైగా మృతిచెందారు. 97వేలమందికి వైరస్ సోకింది. 

జనవరి 30న ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. వైరస్ ప్రభావంతో విదేశాలకు వెళ్లే అన్ని విమాన సర్వీసులు నిలిచిపోయాయి. వాణిజ్య రవాణాకు అంతరాయం ఏర్పడింది. అంటార్కిటికా మినహా అన్ని ఖండాల్లో కరోనా వ్యాప్తి చెందుతోంది.

భవిష్యత్తులో అమెరికాలో మరిన్ని కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని సీడీసీ అంచనా వేస్తోంది. చైనా వ్యాప్తంగా కరోనా తీవ్రతను తగ్గించేందుకు రోబోలు ఎలా సమయస్ఫూర్తితో తెలివిగా పనిచేస్తున్నాయో ఓసారి చూడండి.. 
Robots caronaవుహాన్ సిటీలో, క్రిమిసంహారక స్ప్రే చేసే రోబోట్ నగరం నివాస ప్రాంతం నుంచి కదులుతోందిలా..
robotsవాలంటీర్లు మార్చి 3 న రోబోట్‌ను క్రిమిసంహారక మందులతో నింపుతారు.
volenters
వాలంటీర్లంతా రోబోను ఈ మాదిరిగా నియంత్రిస్తారు.
robtsos
చైనాలోని షెన్యాంగ్‌లోని పెట్రోలింగ్ రోబోట్ ఆసుపత్రి ఉష్ణోగ్రతను తనిఖీ చేస్తుంది.. నివాసితుల ప్రదేశాలను కెమెకిల్స్ స్ప్రే చేస్తోంది.
robtos
వైద్య సిబ్బందిపై డిమాండ్లను తగ్గించడానికి ఈ రోబోట్లను ఆసుపత్రులలో ఉపయోగిస్తారు.
caronava
చైనాలోని హాంగ్‌జౌ పెద్ద ప్రాంతాలను కెమికల్స్ స్ర్పే చేయడానికి రోబోలను ఉపయోగించే మరో ప్రాంతం..
robot refiles
రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రిస్తున్నారు.. ఇక్కడ రీఫిల్ చేయబడటం చూడవచ్చు.
robots
ఈ హ్యాండ్ శానిటైజర్-పంపిణీ రోబోట్ మార్చి 4 న షాంఘైలో ఫోటో తీశారు.
robots cook
ఇక్కడి రోబో గంటకు 100 కుండల బియ్యాన్ని ఉత్పత్తి చేయగలదు.
cooking robots
ఈ రోబోట్ హాంగ్జౌలోని డైనర్లకు ఆహారాన్ని పంపిణీ చేసింది.
cook robots
కరోనావైరస్ ఉన్న ప్రాంతాలను క్రిమిసంహారక మందులను జల్లేందుకు రోబోట్లను ఉపయోగిస్తున్నారు. ఎజౌలోని ఒక ఆసుపత్రి రోబోట్ చెఫ్‌ను తన వంటగదిలో చేర్చింది.