వైర‌స్‌తో నేను చ‌నిపోతానా? డాక్ట‌ర్ల‌ను అడిగిన ట్రంప్, వచ్చే 48 గంట‌లు చాలా క్రిటిక‌ల్..!

  • Published By: sreehari ,Published On : October 4, 2020 / 01:28 PM IST
వైర‌స్‌తో నేను చ‌నిపోతానా? డాక్ట‌ర్ల‌ను అడిగిన ట్రంప్, వచ్చే 48 గంట‌లు చాలా క్రిటిక‌ల్..!

Trump next 48 hours critical : కరోనాతో ఆస్పత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు ఆరోగ్య పరిస్థితి మరో 48 గంటలు చాలా క్రిటికల్ గా ఉండొచ్చునని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ కొన్నిరోజుల్లో కరోనా లక్షణాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి అనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ట్రంప్ తాను బాగానే ఉన్నానని.. వచ్చే కొన్ని రోజులే తనకు అసలైన పరీక్ష అంటూ ఓ వీడియోను కూడా ఆస్పత్రి నుంచి పోస్టు చేశారు ట్రంప్.. వైట్ హౌస్ డాక్టర్ సహా ఆస్పత్రి వైద్యులు ట్రంప్ కు ప్రయోగాత్మక డ్రగ్స్ ద్వారా కరోనా ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.



ప్రస్తుతానికి ట్రంప్ చికిత్సకు స్పందిస్తూనే ఉన్నారు.. గత 24 గంటల్లో ఆయనకు జ్వరం కూడా రాలేదు. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన వెంటనే హుటాహుటినా వాషింగ్టన్ డీసీలోని Walter Reed National Military Medical Centre ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ట్రంప్ స్వల్ప దగ్గుతో బాధపడుతున్నారు. ముక్కు దిబ్బడ, కొంచెం అలసట వంటి స్వల్ప లక్షణాలు కనిపించాయి.



కానీ, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని నేవీ కమాండర్ డాక్టర్ సీన్ కోన్లీ చెప్పారు. ట్రంప్ కు శ్వాసపరమైన ఇబ్బందులు ఏమిలేమని ఆయనకు ఆక్సిజన్ అవసరం లేదన్నారు వైద్యులు. కానీ, ఆస్పత్రికి వెళ్లడానికి ముందే ట్రంప్ సప్లిమెంటల్ ఆక్సిజన్ సపోర్టు తీసుకున్నారని సంబంధింత వర్గాలు వెల్లడించాయి.



ప్రయోగాత్మతక డ్రగ్స్ ద్వారా ట్రంప్ కు కరోనా చికిత్స అందిస్తున్నారు వైద్యులు.. తన ఆరోగ్యంపై ఆందోళన పెట్టుకున్న ట్రంప్.. ‘వైరస్ తో నేను చనిపోతానా అని అడిగారంట.. దాంతో డాక్టర్లు వచ్చే 48 గంటలు చాలా క్రిటికల్ అని అన్నారంట.. అప్పటివరకూ ట్రంప్‌లో ఎలాంటి శ్వాసకోస సమస్యలు రాకుండా ఉంటే మాత్రం ఆయన కరోనా నుంచి తొందరగా కోలుకునే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు.



ఇటీవలే ఏప్రిల్ నెలలో ఆయన చిన్ననాటి మిత్రులు Chera (77) కరోనాతో మరణించారు. రిపబ్లిక్ పొలిటిషియన్ అయిన ట్రంప్.. వయస్సు 74ఏళ్లు కావడంతో ఆయనకు కరోనా హైరిస్క్ ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు.



ఇటీవల పరీక్షించిన కొన్ని వైద్యపరీక్షల్లో ట్రంప్ ఊబకాయం ఉందనే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గత 24 గంటలుగా ట్రంప్ ఆరోగ్యం బాగానే ఉందని, మరో 48 గంటలు గడిస్తేగానీ చెప్పలేమంటున్నారు.. కరోనా నుంచి ట్రంప్ పూర్తిగా కోలుకుంటారా లేదో ఇప్పుడే చెప్పలేమన్నారు.