నివారణ మార్గాలివే: మీ చేతులు కడుక్కోండి.. వైరస్ వస్తోంది జాగ్రత్త!

  • Published By: sreehari ,Published On : January 30, 2020 / 05:19 AM IST
నివారణ మార్గాలివే: మీ చేతులు కడుక్కోండి.. వైరస్ వస్తోంది జాగ్రత్త!

చైనా నుంచి కరోనా ప్రపంచ దేశాలకు పాకుతోంది. ఎప్పుడు ఏ సిటీలో ఏయే ప్రాంతంలో వ్యాపిస్తుందో చెప్పలేం. ఈ ప్రాణాంతక వైరస్ మీరు ఉండే ప్రాంతంలో ఒకరికి వ్యాపించిన అది ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వేగంగా వ్యాపిస్తుంది. ఇంతకీ ఈ వైరస్ ఎవరికి సోకిందో తెలియడం కష్టమే మరి. ఎందుకంటే.. ప్రారంభంలో దీని లక్షణాలు పెద్దగా కనిపించవు. సాధారణ వ్యాధుల మాదిరిగానే లక్షణాలు ఉంటాయి.

నిజంగా ఇది కరోనా వైరస్ లక్షణాలో కాదో గుర్తించడం చాలా కష్టం. సరైన పరీక్షలు చేయిచుకుంటే తప్ప.. అందుకే ప్రతిఒక్కరూ మందు జాగ్రత్తగా నివారణ చర్యలు చేపట్టాలి. అప్పుడే వైరస్ బారిన పడకుండా తమను తాము రక్షించుకోవచ్చు. సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో లేదా ప్రయాణ సమయంలో ఎవరైనా దగ్గడం, తుమ్మడం వంటి చేస్తుంటారు. ఆ సమయంలో వారు అదే చేతులతో అక్కడి వస్తువులను తాకుతుంటారు. వారు తాకిన వస్తువులను ఇతరులు కూడా తాకితే ఆ వైరస్ వారికి కూడా వచ్చే అవకాశం ఉంది.

మ్యాజికల్ సొల్యుషన్ ఇదిగో :
ఎలాంటి మందు లేని కరోనా వైరస్ బారి నుంచి రక్షించుకోవాలంటే నివారణ చర్యలు ఒకటే మార్గం. గాలిద్వారా వ్యాపించే వైరస్‌లైన ఈ-కోలి, నోరోవైరస్, రోటావైరస్ లేదా కరోనా వైరస్ ల్లో ముందుగా జ్వరం, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వైరస్ కారణంగా అనారోగ్యానికి గురికాకుండా ఉండాలంటే సులభమైన పరిష్కార మార్గం ఉంది. ఇంతకీ ఆ మ్యాజికల్ సొల్యుషన్ ఏంటి అనుకుంటున్నారా? ఏమి లేదండీ.. మీకు తెలిసిందే.. చేతులు శుభ్రం చేసుకోవడం. హా.. ఇంతేనా అని కొట్టిపారేయకండీ.. ఈ మాత్రం మాకు తెలియదా? విసుక్కోకండి. వైరస్ ఇన్ఫెక్షన్ నివారణకు చేతులు కడుక్కోవడం అనేది రెండో ఉత్తమ మార్గంగా చెప్పవచ్చునని మిచిగాన్ లోని గ్రాండ్ రాపిడ్స్ లో హెలెన్ డెవోస్ చిల్డ్రన్స్ హాస్పటిల్ వైద్యులు డాన్ మెక్గీ తెలిపారు.

చేతులు కడిగితే వైరస్ సోకదా? :
మొదటి నివారణ మార్గం ఏంటంటే? ఒకవేళ అందుబాటులో ఉంటే.. వ్యాక్సీస్ వేయించుకోవడమని ఆయన అంటున్నారు. ఇలా చేస్తే సరిపోతుందా? వైరస్ సోకకుండా ఉంటుందా? కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీనిపై ట్రేవర్ నోహ్ అనే నిపుణులు ఒకరు చక్కని ఉదాహరణ ఇచ్చారు. ‘సైన్స్ అనేది ఎప్పుడు అందరిని హెచ్చరిస్తూనే ఉంటుంది. ఎవరినా వైరస్ సోకి మరణించిన సందర్భాల్లో ఎక్కువగా ఉంటుంది. వైరస్ వ్యాప్తిని ఎలా నివారించాలి అంటే.. వెంటనే వచ్చే సమాధానం.. మీ చేతులు శుభ్రం చేసుకోండి. నిజానికి ఒక ప్రణాళిక కానేకాదు’ అని ఆయన అన్నారు. మూవీల్లో మాదిరిగా జాంబీల నుంచి తప్పించుకోవాలంటే కేవలం చేతులు కడుక్కుంటే సరిపోదు కదా? అని చమత్కరించారు.

54 శాతం తగ్గిన ఇన్ఫెక్షన్లు :
కానీ, వాస్తవానికి చేతులు శుభ్రం చేసుకోవడం ద్వారా వైరస్ నివారించవచ్చునని శాస్త్రీయంగా కూడా రుజువైంది. కోక్రాన్ డేటాబేస్ ఆఫ్ సిస్టమాటిక్ రివ్యూస్‌లో ఒక కొత్త అధ్యయనాన్ని ప్రచురించడం జరిగింది. ఈ అధ్యయనంలో చేతులు కడుక్కోవడం ద్వారా అనారోగ్యానికి గురికాకుండా సాయపడుతుందని వెల్లడించింది. నిజానికి ఇది శ్వాసకోశ వ్యాధి బారిన పడే అవకాశాలను 54 శాతం మేర తగ్గించింది. చేతులు శుభ్రపరుచుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లు వ్యాప్తిని చాలా వరకు తగ్గిస్తుందని 1850లోనే లూయిస్ పాశ్చర్, జోసెఫ్ లిస్టర్ అప్పట్లోనే నిరూపించారు అనే విషయం గుర్తు తెచ్చుకోండి.

ఏ బ్యాక్టీరియా.. ఏ సమయంలో:
కోల్డ్, ఫ్లూ వైరస్ లు ఆరు నుంచి 8 గంటల మధ్య ఎక్కువగా వస్తువుల ఉపరితలంపై ఉంటాయి. అందులో నోరోవైరస్ అయితే 24 గంటల పాటు ఏదైనా వస్తువు ఉపరితలంపై ఉంటాయి. అందుకే పబ్లిక్ బాత్ రూంల్లో చేతులు కడుక్కునే సమయంలో పేపర్ టవల్ వాడటం మంచిదని మెక్గీ సూచిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా వాడిన టవల్ మీరు వాడితే వారి నుంచి ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్మీకూ సోకే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు.

తెలియకుండా కొన్నిసార్లు మీ కంటిని చేతులతో రుద్దినా కూడా వైరస్ మీ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందని మెక్గీ అంటున్నారు. అందుకే ఎప్పుడూ మీ చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇప్పటినుంచి ఎప్పుడు గుర్తు వస్తే అప్పుడు చేతులు కడుక్కోండి.. ముఖ్యంగా ఏదైనా ఆహారా పదార్థాలు తినేటప్పుడు ముందు చేతులను శుభ్రంగా కడుక్కుని పొడిబారాక అప్పుడే తీసుకోవాలని సూచిస్తున్నారు.

soap clean hands

చేతులు శుభ్రపరిచే సరైన విధానం ఇదిగో :
* చేతులను స్వచ్ఛమైన ఎక్కువ నీటితో శుభ్రపరుచుకోవాలి. పైపై నీళ్లతో కడగరాదు.
* చేతులు శుభ్రంగా కడిగినా తర్వాత టవల్ తో పొడిగా మారే వరకు తుడవాలి.
* చేతుల్లోని బ్యాక్టిరీయా పోవాలంటే కనీసం 20 సెకన్ల పాటు నీళ్లతో శుభ్రపరుచుకోవాలి.
* వేడి నీళ్లు, సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
* నీళ్లు ఎంత వేడిగా ఉన్నాయనేది ముఖ్యం కాదు.
* వేడి ఎక్కువగా ఉన్న నీళ్లతోనే బ్యాక్టిరీయా పోతుందని కాదు అర్థం.
* సబ్బు నురగ బాగా వచ్చే వరకు చేతులు బాగా రుద్దండి
* అరచేతులు, హస్తం వెనుక భాగం, వ్రేళ్ల మధ్యన, గోర్ల క్రింద రుద్దండి.
* పంపు నుంచి వచ్చే వెచ్చని నీటితో చేతులు కడుక్కోంటే ఇంకా మంచిది.
* నీళ్లలోని బ్యాక్టీరియా చావాలంటే ఆ నీటిని వేడి చేయాల్సి ఉంటుంది.
* వేడి నీళ్లతో సబ్బు వాడటం ద్వారా మరింత ప్రయోజనం ఉంటుంది.
* యాంటి బ్యాక్టిరీయల్ సబ్బు మంచిదని చాలామంది చెబుతుంటారు. 
* కానీ, అన్ని సమయాల్లో ఇలాంటి సబ్బులను వాడటం మంచిదికాదు.
* ప్రతిఒక్కరూ ఈ సబ్బులు వాడితే డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టిరీయా డెవలప్ అవుతుంది.
* సాధారణ సబ్బు లేదా ఏదైనా నీళ్లతో చేతులు శుభ్రపరుచుకోవచ్చు.
* చేతులపై తడి పొడిబారేందుకు పేపర్ టవల్ లేదా హ్యాండ్ డ్రయర్ వాడొచ్చు.
* తరచూ వాడే హ్యాండ్ టవల్ వాడొద్దు.. దాని మురికి, బ్యాక్టిరీయా అంటుకోవచ్చు.
* చేతులు కడుక్కున్నాక తప్పనిసరిగా పొడిబారేలా చేసుకోవడం ఎంతో ముఖ్యం
* తడి చేతులతో బయట తిరిగితే మాత్రం గాలిలోని బ్యాక్టిరీయాతో ఇన్ఫెక్షన్లు రావొచ్చు.