పూర్తి Visual Guide మీకోసం: ‘కరోనా’ వ్యాప్తికి అసలు కారణాలు ఇవే!

  • Published By: sreehari ,Published On : January 29, 2020 / 03:56 AM IST
పూర్తి Visual Guide మీకోసం: ‘కరోనా’ వ్యాప్తికి అసలు కారణాలు ఇవే!

ప్రాణాంతక #coronavirus వేగంగా వ్యాపిస్తోంది. చైనాలో ఇప్పటికే వందలామంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందికి ఈ వైరస్ సోకినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియాలో అప్రమత్తమైన భారత అధికార యంత్రాంగం దేశంలో వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది.

మహమ్మారి #coronaతో హై గ్లోబల్ రిస్క్ : WHO
2019 నోవెల్ #corona వైరస్ (2019-nCoV) అని పిలిచే ఈ డెడ్లీ వైరస్ సోకినట్టు పాజిటీవ్ కేసులు ఇప్పటివరకూ నమోదు కాలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కరోనా కొత్త వైరస్ మహమ్మారితో హై గ్లోబల్ రిస్క్ అంటోంది. కానీ, ఇప్పటివరకూ పబ్లిక్ హెల్త్ ఎమర్జెనీ ఆఫ్ ఇంటర్నెషనల్ కన్సర్న్ (PHEIC)ని సంస్థ ప్రకటించలేదు. కరోనా వైరస్ గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకించి 2019-nCov అంటే ఏంటో తెలియనవారు లేకపోలేదు. ఈ వైరస్ వ్యాప్తికి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

కరోనా వైరస్ అంటే ఏంటి?
కరోనా వైరస్ అనేది.. 2019-nCov ఒక రకమైన ఆకారం నుంచి పుట్టింది. ఇది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఉపయోగించి పరీక్షించినప్పుడు.. కిరీటం లేదా సౌర కరోనాను పోలి ఉంటుంది. కిరీటం ఆకారం నిర్మాణ వివరాల ఆధారంగా కరోనావైరస్ పేరు పెట్టారు.
coronaviruses

ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్ ఫొటో.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (NIAID), మిడిల్ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనావైరస్ (#MERS-CoV)లో నిర్ధారించారు. కరోనా వైరస్.. గాలి ద్వారా వ్యాప్తిస్తుంది. ప్రధానంగా క్షీరదాలు, పక్షుల ఎగువ శ్వాసకోశ, జీర్ణశయాంతర ప్రేగులకు సోకుతుంది. కరోనావైరస్ సోకినవారిలో ప్రారంభంలో తేలికపాటి ఫ్లూ లాంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి.

గబ్బిలాల నుంచి సంక్రమణ :
SARS-CoV , #MERS-CoV అనే ఈ రెండు వైరస్ లు.. గాలి ద్వారా శ్వాసనాళల్లోకి వేగంగా వ్యాప్తి చెందుతాయి. తద్వారా మానువుల్లో తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యానికి దారితీస్తుంది. ఈ కొత్త #2019-nCov కారణంగా SARS-CoV , MERS-CoV ఒకే రకమైన లక్షణాలు కనిపిస్తాయి. దురదృష్టవశాత్తూ.. కరోనావైరస్ సంక్రమణను నిరోధించే వ్యాక్సిన్ లేదా యాంటీవైరల్ ట్రీట్ మెంట్ అందుబాటులో లేదు.
corona virus

#SARS, #MERS అనే ఈ రెండు వైరస్ లు జంతువుల నుంచి సంక్రమించే అంటువ్యాధులుగా చెబుతారు. అంటే.. జంతువుల నుంచి నేరుగా ఈ వైరస్ మనుషులకు సోకుతాయి. తద్వారా ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.కొన్నిఅధ్యయనాల ప్రకారం.. పరిశీలిస్తే.. ఈ #SARS, #MERS అనే రెండు వైరస్ లకు మూలం గబ్బిలాలుగా చెబుతున్నాయి.

కరోనా పుట్టుక ఇక్కడే :
ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది ప్రాణాంతక #coronavirus.. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ రోజురోజుకీ ప్రపంచ దేశాలను చుట్టుముడుతోంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తిస్తోంది. ఇప్పటివరకూ 82 మంది ప్రాణాలు కోల్పోగా.. 2700కు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. చివరికి ఇండియాలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే చైనాకు వెళ్లొచ్చిన కొంతమందికి ఈ వైరస్ సోకినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచం మొత్తం కరోనా భయం పట్టుకుంది.
caronavirus

బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. జంతువులు, పాముల మాంసం నుంచి సంక్రమించే ఈ వైరస్ మనుషుల్లోకి పాకింది. ఈ విషపూరితమైన పాములకు చైనా మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ పాములను ఎంతో ఇష్టంగా తింటుంటుంటారు. అత్యంత ప్రమాదకరమైన ఈ విషపూరిత పాములు #ChinaSnakes తమ ఆహారంగా అడవుల్లో #Bats గబ్బిలాలను వేటాడి తిని జీవిస్తుంటాయి. గబ్బిలాల్లో ఉండే ఈ ప్రాణాంతక వైరస్.. పాములు వాటిని తినడం ద్వారా సంక్రమించి.. ఆ పాముల మాంసాన్ని తిన్న మనుషుల్లోకి కూడా వైరస్ పాకినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చైనా క్రాయిట్, కోబ్రా పాముల్లోనూ ఇదే వైరస్ :
చైనాలో ఎక్కువగా కనిపించే పాముల్లో క్రాయిట్ , చైనీస్ కోబ్రాల నుంచే కరోనా వైరస్ పుట్టుకొచ్చినట్టు కొత్త అధ్యయనం చెబుతోంది. వాస్తవానికి ఈ పాముల నుంచే వైరస్ మనుషుల్లోకి సంక్రమించినట్టు తెలిపింది. ఇది వింటర్ సీజన్ కావడంతో వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోందని పరిశోధకులు అంటున్నారు.

snake virus corona

తైవానీస్ క్రైట్ లేదా చైనీస్ క్రైట్ అని కూడా పిలిచే అనేక పాము జాతుల్లో బ్యాండెడ్ క్రైట్ (Bungarus multicinctus), మధ్య దక్షిణ చైనా, ఆగ్నేయాసియాలో చాలావరకు కనిపించే ఎలాపిడ్ పాముల జాతులు ఎంతో విషపూరితమైనవి.

నో వ్యాక్సీన్.. నో యాంటీ ట్రీట్ మెంట్ :
వాస్తవానికి ఈ కొత్త కరోనా వైరస్ కు ప్రస్తుతానికి ఎలాంటి వ్యాక్సీన్ గానీ, యాంటి ట్రీట్ మెంట్ అనేది ఏది అందుబాటులో లేదు. నివారణ ఒక్కటే మార్గం.. ఈ వైరస్ బారిన పడివారు ఎంతకాలం జీవిస్తారో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. వ్యాక్సీన్ కనిపెట్టేంత వరకు ప్రాణాలు నిలబడవు కదా? అందుకే ముందు జాగ్రత్త చర్యగా ప్రీకాషన్స్ తీసుకోవాలని అంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా సహా థాయిలాండ్, దక్షిణ కొరియా, తైవాన్, మాకౌ, హాంగ్ కాంగ్, సింగపూర్, వియత్నాం, ఫ్రాన్స్, అమెరికా, సౌదీ దేశాలకు పర్యాటనకు వెళ్లకపోవడమే మంచిదని చెబుతున్నారు.
countries

#2019-nCoV గురించి చాలా తక్కువగా తెలుసు. చైనా మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి సంక్రమించినట్టు ధృవీకరించింది. వైరస్ 1-14 రోజుల వ్యవధిలో సంక్రమించే అంటువ్యాధి. మరో మాటలో చెప్పాలంటే.. మొదటి లక్షణాలు కనిపించే ముందు దీని ప్రభావం సాధారణ వ్యాధి లక్షణాలు మాదిరిగానే ఉంటుంది. ప్రస్తుతానికి, 2019-nCoV లో SARS వైరస్ కంటే తక్కువ మరణాల రేటు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచ దేశాలన్నీ భయాందోళనలో ఉన్నాయి.

కరోనా వైరస్ లక్షణాలు ఇవే :
#coronavirus సోకినట్టు ఇతర జ్వరాల మాదిరిగానే సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. శ్వాసపరమైన సమస్యలు తలెత్తుతాయి. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోలేరు. కొన్ని తీవ్రమైన కేసుల్లో సోకిన ఇన్ఫిక్షన్ న్యూమోనియాకు దారితీసే ప్రమాదం ఉంది. తీవ్ర శ్వాసకోశ సమస్యలు, కిడ్నీ ఫెల్యూర్ కావడం .. చివరికి మరణానికి కూడా దారి తీస్తుంది.
china virus sym

నివారణ చర్యలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
* జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నాయా?
* ఛాతిలో నొప్పి మొదలైన లక్షణాలు ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
* చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.
* జనాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వీలైనంత వరకు వెళ్లకుండ ఉండేందుకు ప్రయత్నించాలి.
* దూర ప్రాంతాల ప్రయాణాలు వాయిదా వేసుకుంటేనే బెటర్.
* పెంపుడు జంతువులు ఉంటే..వారికి దూరంగా ఉండాలి.
* ఇక గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు..చలి ప్రదేశాల్లో తిరగకూడదు.
* ఇతరలకు, అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఇంటి పరిసరాలు, ఇంట్లో పరిశుభ్రత పాటించాలి.
* దగ్గిన సమయంలో, తుమ్మిన్నప్పుడు చేతి రుమాలు లేదా టవల్‌లను ముక్కు, నోటికి అడ్డంగా పెట్టుకోవాలి. మాస్క్ కట్టుకోవాలి.

కరోనా వ్యాప్తిపై ఇండియా ఎలాంటి చర్యలు చేపడుతోంది? :
భారత దేశంలో మాత్రం ఇప్పటివరకూ కచ్చితమైన కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి పాజిటీవ్ కేసులు ఇంకా నమోదు కాలేదు. భారత ప్రభుత్వం #coronavirus వ్యాప్తిపై పూర్తి స్థాయిలో రివ్యూ ఆపరేషన్లు ప్రారంభించింది. ఎప్పటికప్పుడూ #coronavirus వ్యాప్తికి సంబంధించి మానిటర్ చేస్తోంది.

వుహాన్ సిటీ నుంచి భారత్ కు వచ్చే అన్ని విమానాల్లోని ప్రయాణికులు ఒక్కొక్కరికి స్ర్కీనింగ్ టెస్టులు నిర్వహిస్తోంది. 2019-nCov వైరస్ ప్రభావం అధికంగా ఉన్న #Wuhancity లో చిక్కుకున్న దేశీయులను తరలించేందుకు విదేశాంగశాఖ రెడీ అయింది. వారందర్నీ తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లను బీజింగ్‌లోని భారతీయ రాయబార కార్యాలయం చేపట్టింది.

స్వదేశీయుల కోసం ప్రత్యేక విమానం :
చైనాలోని వుహాన్‌లో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానం పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చైనా ప్రభుత్వంతో బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లపై పర్యవేక్షిస్తున్నారు. వుహాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

చైనాలో ఉన్న భారతీయులు తమ పాస్‌పోర్టు వివరాలను బీజింగ్‌లో ఉన్న భారత ఎంబసీ అధికారులకు అందజేయాల్సిందిగా కేంద్రం కోరింది. కేంద్రం ఆదేశాలు జారీ చేస్తే వుహాన్‌లో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రకటించింది. ఎయిర్ ఇండియా జెంబో విమానాన్ని సిద్ధంగా ఉంచినట్టు సమాచారం.