కరోనా వ్యాక్సిన్లు వాడకపోతే ఏమౌతుంది? బయటకు తీసిన టీకాలు పనిచేయవా? ఎంత సమయంలో ఇవ్వాలి?

కరోనా వ్యాక్సిన్లు వాడకపోతే ఏమౌతుంది? బయటకు తీసిన టీకాలు పనిచేయవా? ఎంత సమయంలో ఇవ్వాలి?

What Happens To COVID-19 Vaccines : ప్రపంచమంతా సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్ కోసం ఏడాదికిపైగా ఎదురుచూస్తోంది. డిసెంబర్ 2019లో చైనాలోని వుహాన్ సిటీలో ఉద్భవించిన కరోనావైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపించింది. మిలియన్లకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. కరోనా మరణాలు కూడా అదే స్థాయిలో నమోదయ్యాయి. అతి తక్కువ సమయంలోనే కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. కొన్ని కరోనా వ్యాక్సిన్లు వచ్చేశాయి.

కానీ, అవి ఎంత సమర్థవంతగా పనిచేస్తాయి అనేదానిపై ప్రజల్లో అనేక సందేహాలు, అపోహలు కమ్ముకున్నాయి. వ్యాక్సిన్ వేయించుకోవాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి.  ఏది ఏమైనా.. వ్యాక్సిన్లు సకాలంలో వేయకపోతే. అవి పనిచేయవా? వృథా అయినట్టేనా? అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. ఐదు రాష్ట్రాల్లో మాత్రం వ్యాక్సినేషన్ డ్రైవ్ లో 5వేల డోస్ ల కరోనా టీకా వృథా అయినట్టే ఒక డేటా వెల్లడించింది. అందులో త్రిపురాలో 10శాతానికి పైగా టీకాలు వృథా అయినట్టుగా డేటాలో గుర్తించారు.

ఎందుకిలా జరిగిందంటే.. కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యాక.. టీకా కోసం వచ్చేవారికి వేసేందుకు వ్యాక్సిన్ సీసాలను ఓపెన్ చేశారు. ఒకసారి టీకా సీల్ తీశాక 4 గంటల్లోగా వ్యాక్సిన్ ఇవ్వాలి. లేదంటే.. ఆ టీకా పనిచేయదు.. అసలు సమస్య ఏమిటంటే.. వ్యాక్సిన్ వేయించుకునే వారిని గుర్తించడం.. టీకాపై అపోహలతో చాలామంది వ్యాక్సిన్ కోసం ముందుకు రావడం లేదు. వ్యాక్సినేషన్ కోసం బయటకు తీసిన టీకాలు ఎవరికి వేయకపోవడంతో వృథా అయినట్టు డేటాలో వెల్లడైంది. భారతదేశంలో రెండే రెండు కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు అత్యవసర వినియోగానికి ఆమోదం పొందాయి.

అందులో 10 లేదా 20 డోస్ ల వరకు సరిపోయే సీసాలకు మాత్రమే ఆమోదం ఉంది. అందులోనూ మన దగ్గర కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలకు అల్ట్రా కోల్డ్ టెంపరేచర్ వద్ద స్టోర్ చేయాల్సి ఉంటుంది. స్టోరేజీ నుంచి సీల్ ఓపెన్ చేసిన నాలుగు గంటల్లోనే టీకా వేయాల్సి ఉంటుంది. అదనంగా కరోనా వ్యాక్సిన్ డోస్ లను హెల్త్ కేర్ అధికారులకు పంపడం జరుగుతోంది. కానీ, ఊహించినదానికంటే తక్కువగానే టీకాలను తరలిస్తున్నారు. కరోనా టీకా వేయించుకోవాల్సిన వారు షెడ్యూల్ డోస్ మిస్ కావడంతో వారికోసం అదనంగా తరలించిన వ్యాక్సిన్ డోస్ లు అలాగే మిగిలిపోయాయి. ఇదే అసలైన కారణమంటున్నారు.

వ్యాక్సినేషన్ షెడ్యూల్ సమయానికి టీకా లబ్దిదారులు రాకపోవడంతో ఇప్పటివరకూ 1,623 లేదా (11శాతం) టీకా డోస్ లు వ్యర్థమైపోయాయి. నాలుగు గంటల్లోగా వ్యాక్సిన్ వేయకపోతే.. ఆ డోస్ సమర్థవంతగా పనిచేయదు. స్టోరేజీ వాతావరణంలో ఉంటేనే టీకా సమర్థతవంతంగా పనిచేయగలదు. సాధారణ ఉష్ణోగ్రతలో ఉంటే వ్యాక్సిన్ పనిచేయదు.. మరి.. దీనికి ఏదైనా పరిష్కారం ఉందా అంటే.. ఎవరైతే టీకా షెడ్యూల్ మిస్ అయ్యారో వారిని పిలిపించి ఆ టీకాను వెంటనే ఇవ్వడం ద్వారా డోస్ ల వ్యర్థమయ్యే సమస్యను అధిగమించవచ్చునని అధికారులు చెబుతున్నారు. కానీ, జనవరి 16 నుంచి ప్రతి 100 మందిలో వ్యాక్సినేషన్ కోసం కొందరిని ఎంపిక చేస్తే.. వారిలో 55 మందికి మాత్రమే షెడ్యూల్ తప్పింది. రెండు రోజుల క్రితం సగటున ప్రతి 100 మందిలో 49 మందికి వ్యాక్సిన్ వేయగా.. దాదాపు 5 లక్షల మందికి టీకా అందించారు.