కరోనా మైల్డ్‌గా వచ్చి వెళ్తోంది. ఏడునెలల తర్వాత అసలు ఎఫెక్ట్ చూపిస్తోంది 

  • Published By: sreehari ,Published On : October 15, 2020 / 06:59 PM IST
కరోనా మైల్డ్‌గా వచ్చి వెళ్తోంది. ఏడునెలల తర్వాత అసలు ఎఫెక్ట్ చూపిస్తోంది 

Long Covid: కరోనా వచ్చింది…వెళ్లింది. అంతా బాగానే ఉందనుకొనే సమయంలో అప్పుడు కరోనా ఎఫెక్ట్ తెలుస్తోంది. కరోనా వచ్చిన ఏడునెలల తర్వాత, అసలు రోగం బైటపడుతోంది. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. పోస్ట్ కోవిడ్ లక్షణాలతో అమెరికా,బ్రిటన్‌లతో పాటు ఇండియాలోనూ మళ్లీ హాస్పటిల్‌లో చేరుతున్నావాళ్ల సంఖ్య లక్షల్లోనే ఉంది.

పోస్ట్ కోవిడ్ రోగాలకు వైద్యనిపుణులుపెట్టిన పేరు “long Covid”. ఇది ఒక రోగంకాదు. నిజానికి నాలుగు రకాల రోగలక్షణాలు. ఊపిరి అందకపోవడం, దీర్ఘకాలం అలసట. బ్రెయిన్ ఫాగ్. మానసిక ఒత్తిడి.

ఇంకొంతమందికి కొన్ని అవయవాలను సరిచేయలేనంతా దెబ్బతింటున్నాయి.



కొందరికైతే ఒక పార్టులోనే అంటే లంగ్స్, లేదంటే బ్రెయిన్‌లో కరోనా ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇవి వెళ్లగానే, మరో అవయం పనితీరు దెబ్బతింటోంది. మిగిలిన పార్టుల్లో కొత్త రోగాలు కనిపిస్తున్నాయి. వీళ్లను హాస్పటల్ చేర్చి చికిత్స చేసినంత మాత్రానా సరిపోవట్లేదు. ఇవన్నీ దీర్ఘకాలిక వైద్యసమస్యలు.

కరోనా వచ్చింది. అది చాలా మైల్డ్. తగ్గిపోయింది. కరోనాను జయించామని అనుకొంటే కొన్ని నెలల తర్వాత కొత్తగా మరికొన్ని రోగాలు వస్తున్నాయి. ఇదేంటి? కరోనా జయించాంకదా? మళ్లీ కొత్త రోగాలేంటి? బాధితుల ప్రశ్న. డాక్టర్ల దగ్గర సమాధానం అంత క్లియర్‌గా లేదు. వాళ్లూ ఇప్పుడిప్పుడే సమస్యను అర్ధంచేసుకొంటున్నారు.



https://10tv.in/covid-reinfection-man-gets-covid-twice-and-second-hit-more-severe/
కొత్త రోగాలతో హాస్పటిల్ కి వచ్చిన వాళ్లను ఇది లాంగ్ కోవిడ్ ఎఫెక్ట్ అనిచెప్పినా, వాళ్లునమ్మడంలేదు.

ఇప్పుడు లాంగ్ కోవిడ్ లక్షణాలను నాలుగురకాలుగా post intensive care syndrome, post viral fatigue syndrome, permanent organ damage, long term Covid syndromeగా విడగొట్టారు. ఈ లెక్కన కరోనా వచ్చివెళ్తూ గట్టి దెబ్బవేసింది.

ఈ రోగాలు ఒక్కొక్కటి రావచ్చు. అన్నీఒకేసారీ రావచ్చు. అప్పుడు సిట్యుయేషన్ వెరీ క్రిటికల్.
ఈ రోగలక్షణాలన్నీ ఒకదానిమీద మరొకటి ఆధారపడ్డాయి. అందుకే లాంగ్ కోవిడ్ అంటే డాక్టర్లకు అంత టెన్షన్.