బయట తినేటప్పుడు మాస్క్‌‌ ఇలానే ధరించాలి.. సర్దుకోవాలంట!

  • Published By: sreehari ,Published On : October 8, 2020 / 05:10 PM IST
బయట తినేటప్పుడు మాస్క్‌‌ ఇలానే ధరించాలి.. సర్దుకోవాలంట!

Mask While Eating : కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయాలంటే కచ్చితంగా ముఖానికి మాస్క్ ధరించాలి.. సామాజిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. అప్పుడే కరోనా వ్యాప్తిని కొంతవరకు కట్టడి చేయగలం.. కొన్ని సందర్భాల్లో కరోనాను కంట్రోల్ చేయడం కష్టమనే చెప్పాలి.

ప్రత్యేకించి బార్లు, రెస్టారెంట్లలో కరోనా వ్యాప్తిని నియంత్రించడం ఒక సవాల్ లాంటిది. కస్టమర్ల డైనింగ్ టేబుళ్ల మధ్య కనీసం 6 అడుగుల దూరం పాటించినా కూడా కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యపడదు. ముఖానికి తప్పక మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. మాములు సమయంలో అయితే ఓకే.. మరి తినేటప్పుడు తాగేటప్పుడు ముఖానికి మాస్క్ ఎలా ధరించడం? అంటే ఇబ్బందే మరి.. ఔట్ డోర్ డైనింగ్ ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.



ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చేసింది. ఇండోర్ డైనింగే గతి.. మరి రెస్టారెంట్లలో డైనింగ్ సమయంలో మాస్క్ ధరించి ఎలా తినాలో డాక్టర్ MD Anthony Fauci కొన్ని సూచనలు ఇచ్చారు.
What You Should Do With Your Mask While Eating, Dr. Fauci Says

తినేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలా? వద్దా? దీనికి ఫాసీ సమాధనమిచ్చారు.. సేఫ్ గా మాస్క్ ఎలా ధరించాలి? ఎలా తొలగించాలి? అనే విషయంలో ఫాసీ కొన్ని జాగ్రత్తలు సూచించారు.



అన్నివేళలా మాస్క్ ధరించడం కుదరకపోవచ్చు.. అందులోనూ తినే సమయంలో అసలే కుదరదు.. తినాలంటే మాస్క్ పక్కన పెట్టాల్సిందే.. మరి మాస్క్ తో తినడమేలా? అంటే.. ఆరు అడుగుల దూరంలో లోపు ఉంటే మాస్క్ ధరించాల్సిందే.. తినేటప్పుడు మాత్రం మాస్క్ మెడ కిందికి సర్దుకోవాలంటున్నారు. అప్పుడు తినొచ్చు.. తాగొచ్చు.. ఎవరైనా వచ్చినప్పుడు వెంటనే మాస్క్ తిరిగి ధరించడమే అని చెబుతున్నారు.



National Institute of Allergy and Infectious Diseases (NIAID) డైరెక్టర్ Gavin Newsom కూడా ఇదే అంశంపై పలు సూచనలు చేశారు. తినే సమయంలో చాలామంది మాస్క్ కిందికి అనేక సార్లు సర్దుకుంటారని వివరించారు. పీపీఈ కిట్లతో ఎలా తింటారు అనేది కూడా ప్రశ్న.. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం తినడం లేదా తాగేటప్పుడు ప్రతిసారి చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించింది.



అందులోనూ మాస్క్ పైభాగాన్ని తాకినప్పుడు తప్పనిసరిగా చేతులు శానిటైజ్ చేసుకోవాలని సూచించింది. కానీ, డాక్టర్ ఫాసీ మాత్రం.. తినేటప్పుడు మాస్క్ సులభంగా ఎలా ధరించాలి? ఎలా తొలగించాలో సూచించారు. మాస్క్ ఎప్పుడైనా పైకి కిందికి సర్దుకోవచ్చు.. మాస్క్ పైకి కిందికి కదిలించేటప్పుడు కేవలం దాని చివరలో ఉన్న స్ట్రాప్స్ మాత్రమే టచ్ చేయాలని సూచిస్తున్నారు.