కరోనా వైరస్‌తో ఎక్కువ రిస్క్ ఏ వయస్సు వాళ్లకో తెలుసా?

  • Published By: venkaiahnaidu ,Published On : March 5, 2020 / 12:02 PM IST
కరోనా వైరస్‌తో ఎక్కువ రిస్క్ ఏ వయస్సు వాళ్లకో తెలుసా?

ప్రపంచదేశాలను గజగజ వణికిస్తున్న ఒకే ఒక్క పదం కరోనా వైరస్. కరోనా అంటే లాటిన్ బాషలో కిరీటం అని అర్థం. కిరీటంలా ఉంటుంది కాబట్టి దీనిని ఈ వైరస్ కు కరోనా అని మొదట నామకరణం చేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత ప్రపంచ ఆరోగ్య సంఖ్య కరోనా పేరును కోవిడ్-19గా మార్చింది. కోవిడ్-19గా పేరు మార్చినప్పటికీ ఎక్కువగా కరోనా అనే అ వైరస్ ను పిలుస్తున్నారు నెటిజన్లు.

ఏది ఏమైనప్పటికీ ఈ వైరస్ దెబ్బకు ఇప్పటివరకు దాదాపు 3వేల200మంది ప్రాణాలు కోల్పోగా…ఇందులో 3వేలమందికి పైగా చైనాకు చెందినవారే. అందులోనూ ముఖ్యం వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన వూహాన్ సిటీలోనే అధికస్థాయిలో మరణాలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 90వేలమంది ఈ వైరస్ సోకి ఇప్పుడు హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. భారత్ లో కూడా ఈ వైరస్ సోకినవారి సంఖ్య 30కి చేరుకుంది. అయితే ఈ 30మందిలో అధికభాగం ఇటలీ టూరిస్గులే. భారత్ లో మొదటి కరోనా పాజిటివ్ కేసు కేరళలో నమోదైంది. వూహాన్ నుంచి త్రిసూర్ కు వచ్చిన ఓ మెడికల్ విద్యార్థిని మొదటి భారత కరోనా పేషెంట్. 

అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వల్ల రోజురోజుకి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతున్న సమయంలో కేరళకు చెందిన మొదటి భారత కరోనా పేషెంట్ మాత్రం వైరస్ తో పోరాడి కోలుకోవడం విశేషం. అంతేకాకుండా ఈ యువతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయింది. అయితే ఈ కరోనా వైరస్ ఎవరికైనా సోకవచ్చు. కానీ కొద్దిమంది జనాభాకు మాత్రమే అది ఎక్కువ హాని కలిగిస్తుందట.

అమెరికాలో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకి 11మంది చనిపోయారు. ఇందులో 10మంది వాషింగ్టన్ రాష్ట్రానికి చెందినవారు కాగా,ఒకరు కాలిఫోర్నియా రాష్ట్రంలోని ప్లేసర్ కౌంటీ సిటీకి చెందిన వ్యక్తి. కాలిఫోర్నియాలోని ప్లేసర్ కౌంటీలో మరణించిన వ్యక్తిని అధికారులు “అంతర్లీన ఆరోగ్య పరిస్థితులతో ఉన్న వృద్ధుడు” అని అభివర్ణించారు. వాషింగ్టన్ లో మరణించిన వారిలో ఎక్కువ మంది కిర్క్‌ల్యాండ్‌లోని నర్సింగ్ సదుపాయమైన లైఫ్ కేర్ సెంటర్‌లో నివసించేవారు.

వాషింగ్టన్ లోని బాధితుల్లో ముగ్గురు మినహా అందరూ 70 ఏళ్లు పైబడిన వారు. ఈ సమయంలో ఒక అంతర్లీన పరిస్థితి…మరొకదాని కంటే ప్రమాద కారకం కాదా అని ప్రత్యేకంగా చెప్పడానికి చాలా తక్కువ మంది రోగులు ఉన్నారని వాషింగ్టన్ లోని ప్రజాఆరోగ్య అధికారి డాక్టర్ జెఫ్ డుచిన్ అన్నారు. రెండు నెలల క్రితం ఈ వ్యాధి గురించి తమకు తెలియదని. కాబట్టి ఇంకా వ్యాధికి నిర్దిష్ట ప్రమాద కారకాల గురించి చాలా నేర్చుకుంటున్నామని అతను చెప్పాడు.(దుబాయ్‌లో 16ఏళ్ల భారతీయ విద్యార్ధికి కరోనా పాజిటీవ్)

చైనా నుండి రిపోర్ట్ చేయబడినది నుండి మరియు స్థానికంగా చూస్తున్న దాని నుండి స్పష్టంగా ఒకటి తెలుస్తుందని, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు చాలా వృధ్దాప్యంలో ఉన్నవారు లేదా తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్నవారు, వయస్సు కారణంగా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగి ఉన్నవారు లేదా దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నట్లు డుచిన్ చెప్పారు. ఆ జబ్బులలో దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి,క్రానిక్ కార్డియాక్ డీసీస్,డయాబెటిస్ కూడా ఉన్నట్టు ఆయన తెలిపారు.

చైనాలో పిల్లలు మరియు యువకులు తక్కువస్థాయిలో వైరస్ సోకిన వారు ఉన్నారని, చైనా నుండి వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం…1 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 9మంది ఆసుపత్రిలో చేరారని,అయితే ఇందులో ఎవరికీ ఇంటెన్సివ్ కేర్ అవసరం లేదని లేదా తీవ్రమైన సమస్యలు లేవని డాక్టర్లు కనుగొన్నారు.

చైనా నుంచి వచ్చిన మరో రిపోర్ట్ ప్రకారం… 44,672 కన్ఫర్మ్ కేసులలో 0.9శాతం మంది మాత్రమే 9 సంవత్సరాల మరియు అంతకన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉన్నారు. 1.2శాతం మంది 10 నుండి 19 సంవత్సరాల వయస్సులో ఉన్న యువకులలో ఉన్నారని తేలింది. చాలా వరకు ధృవీకరించబడిన కేసులు 30 నుండి 79 సంవత్సరాల వయస్సులో ఉన్నావాళ్లే. కాబట్టి యువకులు,పిల్లలపై కన్నా వృద్ధులు అందులోనూ ముఖ్యం 60ఏళ్లు పైబడి దీర్థకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిపైనే ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉంటుంది.