కరోనా మరణాల రేటు నిజంగా తగ్గుతోందా? నిపుణులు ఏమంటున్నారు?

10TV Telugu News

COVID death rates : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగానే నమోదైనప్పటికీ.. కరోనా మరణాలు రేటు తక్కువగానే నమోదవుతున్నాయి.

అక్టోబర్ మధ్య నుంచి కరోనా మరణాల రేటు క్రమంగా తగ్గుముఖం పట్టిందని అపోలో ప్రధాన ఆస్పత్రిలో ఐసీయూలోని పనిచేసే Bharath Kumar Tirupakuzhi Vijayaraghavan ఒక ప్రకటనలో వెల్లడించారు.అక్టోబర్ 20 నుంచి పండుగ సీజన్‌ ప్రారంభం కావడంతో మళ్లీ కరోనా విజృంభించే అవకాశం ఉందనే ఆందోళన నెలకొంది. అయినప్పటికీ కరోనాతో ఐసీయూలో చేరిన కరోనా బాధితుల్లో ఏప్రిల్ నెలలో ఐసీయూలో 35శాతం వరకు మరణాలు పెరగగా.. 70 శాతం మంది వెంటిలేటర్ పై కరోనాతో మరణించారు. కానీ, ఇప్పుడు ఐసీయూలో కరోనా మరణాల రేటు 30 శాతానికి తగ్గింది.

అలాగే వెంటిలేటర్ పై చేరిన వారిలో 45 శాతం నుంచి 50శాతం వరకు కరోనా మరణాలు తగ్గాయని Vijayaraghavan తెలిపారు. ప్రపంచవ్యాప్తంగానూ కరోనా కేసుల కంటే మరణాల రేటు చాలా తక్కువగా ఉందనే చెప్పాలి. కరోనా మరణాలు తగ్గడానికి స్పష్టమైన కారణాలు లేవనే చెప్పాలి. ఎందుకంటే.. కరోనాను నివారించగల డ్రగ్స్, కొత్త టెక్నాలజీలు, అడ్డాన్స్ ట్రీట్ మెంట్ లేవు.అయినప్పటికీ కరోనా ప్రపంచవ్యాప్తంగా 50మిలియన్ల మందికి పైగా సోకితే.. అందులో 1.2 మిలియన్ల మంది మాత్రమే మరణించారు. ఇందులో కరోనా ట్రీట్‌మెంట్ తీసుకున్న విధానంతో ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారనేది తెలుస్తుంది.

మరోవైపు కరోనా పేషెంట్లలో స్టెరాయిడ్స్ వినియోగం కూడా మరణాల రేటు తగ్గడానికి దోహదపడిందని విజయరాఘవన్ అభిప్రాయపడ్డారు. నిరూపితం కానీ ఔషధాలు, ప్రక్రియల ద్వారా కరోనాకు చికిత్సగా వాడుతున్నారని ఆయన వెల్లడించారు.

వాస్తవానికి కరోనా మరణాలు తగ్గుతున్నాయా లేదా అనే విషయంలో పరిశోధకులు సైతం చెప్పలేకపోతున్నారు. గణాంకాలను అంచనా వేయడం కష్టమనే చెప్పాలి.కరోనా టెస్టింగ్ చేయడం ఆధారంగా మరణాల రేటును అంచనా వేయొచ్చు. కరోనా లక్షణాలు ఉన్నవారికంటే లక్షణ రహిత బాధితుల ద్వారానే వ్యాప్తి ఎక్కువగా ఉందనే అంటున్నారు.

ఆస్పత్రుల్లో చేరే కరోనా బాధితుల్లో ఎక్కువగా యువకులే ఐసీయూలో చేరిన పరిస్థితులు ఉన్నాయి. యువకుల కంటే వృద్ధుల్లోనే కరోనా మరణాల రేటు వాస్తవంగా తగ్గిందా? అనే నిర్ధారణ కావాల్సి ఉందని ఎపిడిమోలాజిస్ట్ అలీ మోక్దాద్ తెలిపారు. కరోనా గ్లోబల్ డేటాను పరిశోధక బృందం అధ్యయనం చేస్తోందని ఆయన అన్నారు.అమెరికా హాస్పిటల్ అసోసియేషన్ డేటాను పరిశీలిస్తే.. కరోనా కేసుల్లో మరణాల రేటు 20 శాతానికి పడిపోయి ఉండొచ్చునని అంచనా వేశారు. ఐసీయూల్లో ట్రీట్ మెంట్ మెరుగుపడిందని చెప్పారు.

మరో కోణంలో పరిశీలిస్తే.. hydroxychloroquine మలేరియా డ్రగ్.. కరోనా ట్రీట్ మెంట్ లో అద్భుతంగా పనిచేసిందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.కరోనాతో ఆస్పత్రిలో చేరిన బాధితులకు ఈ hydroxychloroquineతో పెద్దగా ప్రయోజనం లేదని యూకేలోని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఎందుకంటే కొంతమంది పేషెంట్లలో ఈ డ్రగ్ అనేక అనారోగ్య సమస్యలకు కారణమైందని, గుండె దెబ్బతినడం వంటి అనేక సమస్యలకు దారితీసిందని సూచించాయి.

10TV Telugu News