కొందరు మహిళలు భర్తలను బాగా ప్రేమిస్తారు, కానీ సెక్స్ చేసేందుకు ఇష్టపడరు.. ఎందుకంటే?

  • Published By: vamsi ,Published On : September 28, 2020 / 01:26 AM IST
కొందరు మహిళలు భర్తలను బాగా ప్రేమిస్తారు, కానీ సెక్స్ చేసేందుకు ఇష్టపడరు.. ఎందుకంటే?

Sex Education: శృంగారం దగ్గరికి వచ్చేసరికి.. పురుషులు, మహిళలు అనుభవించే శృంగార సుఖంలో చాలా తేడాలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికే ఈ విషయాన్ని అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. పురుషులు తృప్తి పొందినంత త్వరగా, అంత ఎక్కువగా మహిళలు సెక్స్‌లో అనుభూతిని త్వరగా పొందలేకపోతున్నారనేది కొన్ని అధ్యయనాలు చెబుతున్న అంశాలు. అయితే కొంతమంది మహిళలు కూడా సెక్స్ విషయంలో మగవాళ్లను సంతృప్తి పరచలేకపోతున్నారట.

ప్రేమపూర్వక సంబంధాలలో మహిళలు మెరుగ్గా ఉన్నప్పటికీ భాగస్వాములతో సెక్స్ విషయంలో ఎక్కువగా ఇష్టపడరు అట. ఎందుకు అనే విషయంపై ఒక కొత్త అధ్యయనం జర్నల్ ఆఫ్ సెక్స్ రీసెర్చ్‌లో ప్రచురించబడింది. ఇజ్రాయెల్‌లోని టెల్ హై కాలేజీలో అవిగైల్ మూర్ మరియు ఆమె సహచరులు ఇంటర్వ్యూలు చెయ్యగా.. దీర్ఘకాలిక సంబంధాలు ఉండి భర్తలను ప్రేమిస్తున్నట్లు స్వయంగా గుర్తించిన మహిళలను ఇంటర్వ్యూ చేశారు.



అయితే ఈ అధ్యయనంలో లైంగిక కోరిక తగ్గుదల గురించి, మహిళలు తమ తగ్గిన కోరికల గురించి వివరించారు. భాగస్వామి కోరిక కంటే గణనీయంగా తక్కువగా ఉందని గుర్తించడం జరిగింది. తగ్గిన లైంగిక కోరికను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నవారిని పర్యవేక్షించే ఓ నిపుణురాలు.. సెక్స్‌పై కోరిక అకస్మాత్తుగా మలుపు తిరిగిందా, లేదా సంవత్సరాలుగా క్రమంగా మార్పు వచ్చిందా? అనేదానిపై అధ్యయనం చేశారు.

పిల్లలను పెంచే క్రమంలో ఆసక్తి లేకపోవడం కావచ్చు? వివిధ సాంస్కృతిక, సామాజిక, లేదా మతపరమైన సందేశాల ప్రభావం.. వివిధ జీవిత ఒత్తిళ్లు.. పని సవాళ్లు? ఆరోగ్య స్థితిలో మార్పుకు కారణం అయినట్లుగా గుర్తించారు.

జీవితంతో సమస్యలు ఖచ్చితంగా శృంగార సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. తక్కువ లైంగిక కోరిక ఉన్నప్పటికీ, వారు వారి భాగస్వాములతో ప్రేమలో ఉన్నారని నిపుణులు వెల్లడించారు. శృంగారంలో పాల్గొనడానికి ఇష్టపడనప్పుడు ప్రేమపూర్వక సంబంధాలు కూడా ప్రభావితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

25 మరియు 59 సంవత్సరాల మధ్య మహిళలను ఇంటర్వ్యూ చేయగా.. మహిళలందరూ కనీసం 1 సంవత్సరపు కాలంలో మాత్రం బాగా శృంగారంలో పాల్గొన్నారు. అయితే 3.5 సంవత్సరాలు నుంచి, పిల్లలు పుట్టిన తర్వాత దాదాపు సంంబంధాలను కోల్పోతూ వస్తున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత బాధ్యతలు పెరగడం అందులో ఒక కారణంగా కొందరు చెప్పుకొచ్చారు.

భర్తలపై ఎక్కువగా ప్రేమ ఉన్నప్పటికీ, మహిళలు తమ భాగస్వామి కోరికను తీర్చలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తమ భర్తలు దానిని వ్యక్తిగతంగా తీసుకున్నారని, ఆకర్షణ మరియు భావాలను ప్రశ్నించేంత వరకు తమ భర్తలు ఆందోళన చెందుతున్నట్లుగా చెప్పారు.



ఈ అధ్యయనంలో మహిళలు తమ భాగస్వామి అవసరాలను తీర్చే ప్రయత్నంలో ఉత్సాహంగా లేకపోయినా.. కొన్నిసార్లు శృంగారంలో పాల్గొనడానికి అంగీకరిస్తామని చెప్పారు. కొంతమంది మహిళలు మాత్రం తమ భాగస్వామి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తే మాత్రం నిద్రపోతున్నట్లు నటించినట్లు చెప్పారు. మహిళలందరూ తమ సంబంధాల కాలంలో లైంగిక కోరిక తగ్గుతున్నట్లు వివరించినప్పటికీ, వారి లైంగిక కోరిక పూర్తిగా లేదని చెప్పలేదు.

ముఖ్యంగా భార్యాభర్తల మధ్య లైంగిక కోరిక తగ్గడానికి, మహిళలకు అనేక కారణాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం.. తరచూ గొడవలు పడడం కారణాలుగా చెబుతున్నారు. ఇక ఈ సర్వేలో కీలక అంశం ఏంటంటే.. పురుషుడు భావప్రాప్తి పొందిన తర్వాత మహిళ కూడా ఆ సుఖం పొందిందా? లేదా? మగాడు పట్టించుకోవడం లేదని హెచ్చరిస్తోంది.



పురుషులు భావప్రాప్తి పొందేందుకు పరిమిత వనరులను ఉపయోగించుకుంటే సరిపోతుందని, కానీ.. మహిళల వరకు వచ్చే సరికి వారిలో భావప్రాప్తి కలిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వాస్తవానికి పడకగదిలో ఎక్కువశాతం మగాడిదే పైచేయి ఉంటుంది. ఒకవేళ మహిళలు పైచేయి సాధించాలనుకున్నా.. వారు పెరిగిన వాతావరణం, సంస్కృతి వారిని కాస్త తగ్గేలా చేస్తోంది.

నాలుగు గోడల మధ్య మహిళల పెత్తనాన్ని భవిష్యత్తులో పురుషుడు ఎత్తి చూపే అవకాశం ఉందని, మానసికంగా వేధించే అవకాశం ఉందన్న కారణంతో చాలా మంది మహిళలు తమను తాము తగ్గించుకున్నట్లుగా అధ్యయనంలో చెప్పారు.