లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

అందరికి ఆరోగ్యాన్నిచ్చే అద్భుతమైన డైట్.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Updated On - 4:59 pm, Wed, 20 January 21

Mediterranean diet beneficial : ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు… ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉన్నవారిలో అనారోగ్య సమస్యలు దరిచేరవంటారు.. అది నిజమే.. ఎందుకంటే.. మనం తినే ఆహారం సరిగా లేకుంటేనే అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.. హెల్తీ డైట్ పాటించేవారు ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు. ఆరోగ్యకరమైన జీవితం కోసం మధ్యధరా ఆహారాన్నే (మెడిటేరియన్ డైట్) ఎంచుకోవాలని సూచిస్తోంది కొత్త అధ్యయనం. హృద్రోగ సంబంధిత సమస్యల బారినపడకుండా ఉండాలంటే కొవ్వులేని ఆహారాన్ని తమ ఆహారంలో భాగంగా చేసుకోవాలని పోషక నిపుణులు సూచిస్తున్నారు. గుండె ఆరోగ్యంతో పాటు వయస్సు తగ్గినట్టుగా కనిపిస్తారు.. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారినుంచి కూడా రక్షణ పొందవచ్చు. ప్రతిఒక్కరికి ఈ మెడిటేరియన్ డైట్ మరెన్నో ప్రయోజనాలను అందిస్తోందని పోషక నిపుణులు సూచిస్తున్నారు.

స్పెయిన్, ఇటలీ, గ్రీస్ వంటి దేశాల్లో ఇప్పటికే అక్కడి వంటకాల్లో మెడిటేరియన్ డైట్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు. వరుసగా నాల్గో ఏడాది కూడా ఈ మధ్యధరా ఆహారానికి పెద్దపీట వేస్తున్నారని తేలిందని వరల్డ్ రిపోర్టు పేర్కొంది. ముఖ్యంగా చేపలు, ఆరోగ్యకర కొవ్వులు, ప్రాసెస్ చేయని ధాన్యాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. దీర్ఘకాలం ఆరోగ్యకర జీవితానికి ఈ మధ్యధరా డైట్ ఎంతో ఆరోగ్యకరమని అంటున్నారు. అదే అందరూ ఫాలో కావాలని సూచిస్తున్నారు. మెడిటేరియన్ డైట్ అనగానే.. ముందుగా అందరికి గుర్తొచ్చేది.. హార్ట్ హెల్తీ డైట్.. కానీ, వాస్తవానికి మెడిటేరియల్ డైట్ ద్వారా అల్జీమర్స్ వ్యాధిని నివారించగలదని అధ్యయనాల్లో వెల్లడైంది. చర్మంపై మచ్చలు, క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి రక్షణ అందిస్తుందని తేలింది.

అంతేకాదు.. రక్తపోటును తగ్గించడంతో పాటు కొవ్వు స్థాయిలను మెరుగుపర్చడంలో సాయపడుతుంది. తద్వారా గుండె సంబంధిత అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గించుకోవడం కోసం ఈ మెడిటేరియన్ డైట్ ఫాలో అయితే.. వెయిట్ లాస్ అవుతుమన్నా గ్యారెంటీ లేదని నిపుణులు ఒకరు అభిప్రాయపడ్డారు. అధిక ఫైబర్ ఆహార పదార్థాలతోనే సహజంగా కేలరీలను తగ్గించుకోవచ్చునని సూచిస్తున్నారు. మధ్యధరా డైట్ పై ఎన్నోఏళ్లుగా అధ్యయనాలు జరిగాయి. ఈ డైట్ ద్వారా గ్రీస్, ఇటలీ వంటి దేశాల్లో గుండెజబ్బులు, క్యాన్సర్లు తక్కువ స్థాయిలో ఉన్నాయని, అదే పశ్చిమ దేశాల్లో వీటి స్థాయి అధికంగా ఉందని కార్డియాలిజిస్ట్ జోయెల్ ఖన్ పేర్కొన్నారు.

గతంలో గుండెజబ్బులు ఉన్న బాధితులు కూడా ఈ మెడిటేరియన్ డైట్ కు స్విచ్ అయ్యాక వారిలో 50శాతం నుంచి 70 శాతం గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు తగ్గినట్టు అధ్యయనంలో తేలింది. కొన్ని అధ్యయనాల్లో మధ్యధరా ఆహారం సెల్యులార్ స్థాయిలో ప్రయోజనాలు ఉన్నాయని సూచిస్తున్నాయి. వీటిలో వృద్ధాప్యంతో ముడిపడి ఉన్న ఫ్రీ రాడికల్ నష్టాన్ని తగ్గిస్తుందని తద్వారా శరీరంలో యాంటీ ఇన్ ఫ్లేమెంటరీ రెస్పాన్స్ తగ్గించినట్టు అధ్యయనాల్లో వెల్లడైంది.