కరోనా వైరస్ అంతమవుతుందా? మరింత ముదురుతుందా?

  • Published By: murthy ,Published On : September 21, 2020 / 07:53 PM IST
కరోనా వైరస్ అంతమవుతుందా? మరింత ముదురుతుందా?

Will coronavirus end: 1918నాటి స్పానిష్ ఫ్లూ ఎంతగా భయపెట్టిందో ఇంకా ప్రపంచానికి గుర్తుంది. ఈ coronavirus స్పానిష్ ఫ్లూ కన్నా తక్కువకాలంలోనే అంటే రెండేళ్లలోనే కట్టడి అవుతుందని ఆశిస్తోంది World Health Organisation అంటోంది.




మైక్రోసాఫ్ట్ కో‌ఫౌండర్ Bill Gates ఐతే, వచ్చే యేడాది చివరినాటికి కరోనాను పూర్తిగా తరిమికొట్టగలమని నమ్ముతున్నారు.

కరోనా అంతమవుతుందా?

కరోనా ఇంకా లక్షల సంఖ్యలోనే రోజూ పాజిటీవ్ కేసులు నమోదువుతున్నాయి. ఇంకా ఇండియాలాంటి దేశాల్లో పీక్‌కు వెళ్లలేదు. ఇంతలో రెండో వేవ్ వస్తోందంటూ ఇజ్రాయిల్, బ్రిటన్ లాక్‌డౌన్ చేస్తున్నాయి. ఈ సమయంలో ఎక్స్‌పర్ట్స్ నుంచి గుడ్‌న్యూస్ వినిపిస్తోంది.



త్వరలోనే మహమ్మారి పోతుంది. కాకపోతే తూడిచిపెట్టలేకపోవచ్చు.

వైట్ హౌస్ కరోనావైరస్ సలహాదారుడు Dr Anthony Fauci దృష్టిలో ఈ మూడు చేస్తే కరోనాను అడ్డుకట్టవేయొచ్చు.
1. ప్రభుత్వం తీసుకొనే ఆరోగ్య చర్యలు
2. ప్రపంచవ్యాప్తంగా herd immunity
3. మంచి వ్యాక్సిన్



ఈ మూడింటిని కలగలపితేనే కరోనాను నిర్మూలించగలమని డాక్టర్ ఫాసీ నమ్మతున్నారు. ఆయన ఉద్ధేశంలోనే వచ్చేయేడుకూడా కరోనాను పూర్తిగా తరిమికొట్టలేకపోవచ్చు. బహుశా 2023 వరకు టైం పట్టొచ్చు.