Speak out : మెనోపాజ్ : లక్షణాలు..దుష్ప్రభావాలు

  • Published By: nagamani ,Published On : October 3, 2020 / 06:19 PM IST
Speak out : మెనోపాజ్ : లక్షణాలు..దుష్ప్రభావాలు

Women Menopause side effects that people usually don’t talk about : మోనో పాజ్ అనేది ప్రతి మహిళ జీవితంలో ఎదుర్కొనే సమస్య. రుతుక్రమం గతి తప్పుతుంది. రజస్వల అయినప్పటి నుంచి ప్రతీ నెలా వచ్చే రుతుక్రమం ఆగిపోతుంది. దీన్ని మెనోపాజ్ అంటారు. లైంగికాసక్తి సన్నగిల్లుతుంది. చిన్న చిన్న విషయాలకే చిరాకు..కోపం..ఇరిటేషన్, మతిమరుపు, జుట్టు రాలటం, తలనొప్పి, నిద్రపట్టకపోవటం, శరీరంలో వేడి ఆవిర్లు రావటం లాంటి చాలా జరుగుతుంటాయి. చివరికి రుతు చక్రాలు పూర్తిగా నిలిచిపోతాయి. స్త్రీలలో ఈ దశనే మెనోపాజ్ గా చెబుతారు.  ఈ సమయంలో వచ్చే సమస్యల పట్ల మహిళలు పైకి చెప్పుకోలేరు. అలాగని సమస్యలను భరించలేక సతమతమవుతుంటారు. హార్మోన్ల ఉత్పత్తి గజిబిజిగా మారి రుతుక్రమం నిలిచిపోయే ఈ దశలో స్త్రీలు మానసిక ఒత్తిడికి గురవుతుంటారు.

ఏమిటి మెనోపాజ్ దశ
12 నెలలుగా నెలసరి రావడం ఆగిపోతే దాన్ని మెనోపాజ్ గా అంటారు. పూర్వకాలంలో 50 నుంచి 55 సంవత్సరాలకు వచ్చేది. అది క్రమేమీ 45-50 సంవత్సరాలకు తగ్గిపోయింది. దీనికి కారణం ఆహారంలోను జీవనశైలిలోను వచ్చే మార్పులే కారణం. రుతుచక్రం ఆగిపోవడం అంటే వారిలోని ఓవరీలు పనిచేయడం పూర్తిగా నిలిచిపోయినట్టుగా అర్థం చేసుకోవాలి. ఇది శరీరంలో క్రమంగా జరుగుతుంది. ఇలా క్రమంగా జరిగే దశను పెరిమెనోపాజ్ ట్రాన్సిషన్ పీరియడ్ (మెనోపాజ్ ప్రారంభ దశ) గా చెబుతారు. ప్రతీ మహిళకు ఈ సమయంలో మానసిన ఒత్తిడికి గురవుతారు. చిరాకు కోపం, విసుగు, అలసట ఇలా అన్నీ ఇబ్బంది పెడుతుంటాయి.

మోనోపాజ్ మహిళల్లో కొన్ని సంవత్సరాల తర్వాత మోనోపాజ్ దశలో రుతి విరతి,( ముట్లు ఆగిపోడం లేదా పీరియడ్స్ నిలిచిపోడం) జరుగుతుంది. మోనోపాజ్ కు ఇది ఒక ప్రధాన లక్షణం.మోనోపాజ్ దశ చేరుకొన్న తర్వాత అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మోనోపాజ్ దశ చేరగానే గర్భం రావటం కష్టం. అందుకే మహిళ్లలో ఒక వయస్సు రాగానే పెళ్ళిళ్లు చేస్తుంటారు. సరైన సమయంలో పిల్లలు కలగాలని, భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఎదుర్కోకూడదని పురాతకాలం నుండి పెద్దలు అనుసరిస్తున్న పద్దతి ఇది.

మోనోపాజ్ దశలో మీరు తినకూడని కొన్ని ఆహారాలు స్త్రీలలో మోనోపాజ్ వల్ల వచ్చే సమస్యలు అందరిలో ఒకేలాగా ఉండకపోవచ్చు. కానీ 50 శాతం మహిళల్లో మోనోపాజ్ సైతం ఎలాంటి ఇబ్బందుల్ని కలిగించదు. మిగిలిన వారిలో మాత్రం మోనోపాజ్ దశలోకి ప్రవేశించగానే పలు రకాల మానసిక, శారీరక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మెనోపాజ్ లక్షణాలు అనేక విధాలుగా కనపడతాయి.దీనిలో ఎక్కువగా గుర్తించదగిన లక్షణం రుతుస్రావం కొద్దికొద్దిగా అవుతూ ఆగిపోతుంది.

జుట్టు పల్చబడుతుంది:
మోనోపాజ్ దశలో హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ వల్ల జుట్టు పల్చబడుతుంది.ఎక్కువగా జుట్టు రాలిపోతుంది. అలాగే అవాంచిత రోమాల సమస్య పెరుగుతుంది. అంటే అప్పర్ లిప్ మీద హెయిర్ వస్తుంది.

శరీరం నుండి వేడి ఆవిర్లు:
మెనోపాజ్ లో ఇది చాలా సాధారణ లక్షణం, ఈ వేడి ఆవిర్లు రుతుక్రమం ఆగిపోవటానికి ఒక లక్షణం. ఈ వేడి ఆవిర్లు హఠాత్తుగా రక్తం ముఖంలోకి లేదా ఛాతీ వేడి వచ్చేనట్లుగా ఉంటుంది. ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి. మొఖం ఎర్రగా మారుతుంది. శరీరాన్ని తాకితే చాలా వేడిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇంతంతా హార్మోన్లు చేసే మాయాజాలం. హార్మోన్లు పెరగటం తగ్గటం వల్ల ఇలా జరుగుతుంది.

తలనొప్పి
హార్మోనల్ హెచ్చుతగ్గులు ఈ కొత్తరకమైన తలనొప్పులకు కారణంగా ఉంటుంది. అందువలన మెనోపాజ్ దశలో మీరు తలనొప్పితో కూడా బాధపడతారు. కాగా..సదరు స్త్రీలకు గతంలో తలనొప్పితో బాధపడేవారు అది మెనోపాజ్ దశలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. తరచూ వస్తూంటుంది. ఇబ్బంది పెడుతుంది. అదేంటో తెలీక మరింత ఒత్తిడికి గురి కావటంత తలనొప్పి గతంలో కంటే ఎక్కువగా వస్తోందని కంగారుపడుతుంటారు.

నిద్రపట్టదు ..
శరీరంలోంచి వేడి ఆవిర్లు, రాత్రి చెమటలు పట్టడం మరియు హార్మోన్ స్థాయిలు అసమతుల్యత వల్ల నిద్రపట్టదు. దీంతో మరిన్ని సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యను అధిగమించాలంటే ప్రతి రోజూ నిద్రపోవడానికి ఒకే టైమ్ లో నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. నిద్రపోవడానికి ముందు టీవీ చూడటం లేదా భోజనం చేయకూడదు. నిద్రిపోవాలనుకునే రెండు గంటల ముందుగానే భోజనం చేసేసి..ప్రశాంతంగా ఉండాలి.లేదంటే అలర్జీలు, థైరాయిడ్ సమస్యలు, నిద్రసమస్యలు మరియు ఇతర సమస్యలకు దారి తీస్తుంది. మెడిటేషన్, యోగాలాంటివి చేస్తే కొంత బాగుంటుంది.

జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది…
మెనోపాజ్ దశలో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. మెదడు చురుకు పనిచేయదే. చాలా విషయాలు ముఖ్యమైనవి కూడా మర్చిపోతుంటాం.అన్నింటికీ విపరీతంగా ఆలోచించటంతో తలనొప్పి వస్తుంది. ఇది నిద్రలేమి వల్ల కూడా కావచ్చు. ఒకవేళ నిద్రపట్టిన సడెన్ గా మెలుక వచ్చేస్తుంది. దీంతో తలనొప్పి వస్తుంది.

మనాసిక స్థితిలో మార్పులు మానసిక మార్పులు తరచుగా తో పాటు ఉంటాయి, ఇవి మెనోపాజ్ తో సంబంధం కలిగి ఉంటాయి. మీరు ఈ సమయంలో చిరాకు, అమితసంతోషం లేదా మానసికంగా క్రుంగిపోవటం వంటి అనుభూతులను పొందుతారు. మీ మానసిక స్థితి ఏదైనప్పటికీ, ఈ మెనోపాజ్ సమయంలో స్పెక్ట్రం యొక్క ఒక చివరి నుండి మరొక చివరికి కదలుతున్నట్లుగా, ఈ అనుభూతులు ఉంటాయి.

వైజినల్ డ్రైనెస్ కు కారణం కావచ్చు:
మెనోపాజ్ దశలో హార్మోన్లు హెచ్చుతగ్గులతో యోని ఎండిపోయినట్లుగా పొడిబారిపోతుంది. హార్మోన్ స్థాయిల మార్పులు ..ఈస్ట్రొజెన్ పరిమాణం శరీరంలో తగ్గటం, యోని పొడిగా అవటం వంటి లక్షణాలతో అసౌకర్యంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మంటగా అనిపిస్తుంది.

లైంగికాస్తక్తి తగ్గిపోతుంది..యూరినరీ ఇన్ఫెక్షన్స్ సమస్యలు
మెనోపాజ్ దశలో లైంగిక వాంఛ లేకపోవడం హార్మోన్ స్థాయిలు పడిపోయినప్పుడు కామాతురత తగ్గుతుంది. సెక్స్ యొక్క ఆలోచనలు తక్కువగా ఉంటాయి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తో ఇబ్బలొస్తాయి. అంటే మోనోపాజ్ దశలో మహిళ్లో యూరిన్ ట్రాక్ మీద కంట్రోల్ తప్పుతుంది. అది శరీరంలో ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల యురెత్రా లైనింగ్ వల్ల వల్ల అలా జరగుతుంది.

చర్మంలో మార్పులు:
మెనోపాజ్ దశలో చర్మంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా చర్మం ఎలాసిటి తగ్గిపోతుంది..ముడుతలు వస్తాయి. గతంలో కంటే, మోనోపాజ్ దశలో చర్మం మరింత డ్రైగా మారుతుంది. దీంతో పగుళ్లు.. వస్తాయి. చర్మంలో కాంతి తగ్గిపోతుంది. తక్కువ ఈస్ట్రోజన్ వల్ల చర్మం యొక్క మందం మరియు చర్మలోపలి కొల్లాజెన్ తగ్గుతుంది.

బరువు పెరటం..
మెనోపాజ్ సమయంలో బరువు పెరుగటం కూడా జరుగుతుంది. ఈ సమయంలో మహిళలు సగటున ఐదు పౌండ్లు బరువు పెరుగుతారు. కానీ కొంతమంది మహిళల్లో ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశాలున్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం మెనోపాజ్ సమయంలో మహిళలు హార్మోన్ల మార్పులతో ఊబకాయానికి కారణమవుతారు. బరువు పెరగడం వల్ల రొమ్ము క్యాన్సర్, నిరాశ, గుండె జబ్బులు,టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మెనోపాజ్ సమయంలో ప్రతీ మహిళా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

గైనకాలజిస్టుల సలహాలు తీసుకోవాలి. వారి సలహాలతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మెనోపాజ్ సమస్యలను చాలా వరకూ ఎదుర్కోవచ్చు.