కోవిడ్ చికిత్సకు కలిసివచ్చిన ‘వీరాఫిన్’

కోవిడ్ -19 చికిత్సకు మరో ఔషధం కలిసి వచ్చింది. అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ డ్రగ్ సంస్థ జైడస్ కాడిలా.. కరోనా చికిత్స కోసం మెడిసిన్ ను తయారుచేసింది..

కోవిడ్ చికిత్సకు కలిసివచ్చిన ‘వీరాఫిన్’

Zydus Cadilas Virafin

Zydus Cadila’s Virafin : కోవిడ్ -19 చికిత్సకు మరో ఔషధం కలిసి వచ్చింది. అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ డ్రగ్ సంస్థ జైడస్ కాడిలా.. కరోనా చికిత్స కోసం మెడిసిన్ ను తయారుచేసింది. క్లినికల్ ట్రయల్స్‌లో ఈ ఔషధం 91 శాతం వరకు ప్రభావవంతంగా పనిచేస్తుందని జైడస్ కాడిలా తెలిపింది. ఈ కారణంగా, ఆక్సిజన్ అందించాల్సిన అవసరం కూడా తగ్గుతుందని పేర్కొంది. డ్రగ్ రెగ్యులేటర్ నుండి కంపెనీ శుక్రవారం అనుమతి కూడా పొందింది. ఈ ఔషదానికి ‘వీరాఫిన్’ అని పేరు పెట్టారు.

కాగా భారత్ లో గత 24 గంటలలో 3.32 లక్షల కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో, క్రియాశీల కేసులు 24 లక్షలను దాటాయి. అటువంటి పరిస్థితిలో, అహ్మదాబాద్ సంస్థ తయారు చేసిన ఈ మెడిసిన్ ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.