లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Life Style

మీ గుండెను సురక్షితంగా ఉంచే ఫుడ్

Published

on

Healthy Foods That Can Save Your Heart

ప్రస్తుత ప్రపంచంలో అనేక మంది గుండె జబ్బుల బారిన పడి హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. అందుకు అనేక కారణాలుంటున్నాయి. అయితే హార్ట్ ఎటాక్స్ రావడానికి ప్రధాన కారణం.. రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడమే. దీని కారణంగా గుండెకు రక్తం సరిగ్గా సరఫరా అవదు దాంతో హార్ట్ ఎటాక్ వస్తుంది. అలా హార్ట్ ఎటాక్స్ రాకుండా, ఇతర గుండె సమస్యల బారిన పడకుండా ఉండాలంటే నిత్యం ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా..? 

* చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కనుక చేపలను బాగా తింటే గుండెకు మంచిది.

* ఓట్స్‌లో ఉండే ఫైబర్ మన శరీరంలో కొలెస్ట్రాల్ నుంచి తయారయ్యే ప్రమాదకర బైల్ యాసిడ్స్‌ను శరీరం నుంచి బయటకు పంపుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కనుక ఓట్స్‌ను తరచూ తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. 

* జీడిపప్పు, బాదం, పిస్తా పప్పులను రోజూ తింటూ ఉంటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వాటిల్లో ఉండే అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. 

* రక్తంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించివేయడంలో పెసలు అమోఘమైన పాత్ర పోషిస్తాయి. నిత్యం పెసలను నానబెట్టుకుని, మొలకెత్తించి లేదా ఉడకబెట్టి గుగ్గిళ్ల రూపంలో తింటుంటే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. 

* నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున రెండు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను న‌లిపి అలాగే తినేయాలి. ఘాటుగా ఉన్నాయ‌నుకుంటే తేనెతో క‌లిపి తిన‌వ‌చ్చు. వెల్లుల్లిని తీసుకుంటే ర‌క్త నాళాల్లో పేరుకుపోయే కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *