విశాఖలో డ్రగ్స్ రాకెట్ కలకలం..నలుగురు అరెస్టు..భారీగా మాదక ద్రవ్యాలు స్వాధీనం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

విశాఖలో డ్రగ్స్ రాకెట్ కలకలం రేపుతోంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు. డ్రగ్స్ అమ్ముతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. సత్యనారాయణ, అజయ్, రవికుమార్, మనోజ్ స్వరూప్ ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని నుంచి భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నుంచి 61 ఎల్ ఎస్ డీ స్టిక్కర్లు, 2.5 గ్రాముల ఎండీఎంఏ, 60 గ్రాముల గంజాయి, రూ.9,500 నగదు, నాలుగు మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

గతంలో రేవ్ పార్టీలో వాడిన మత్తు పదార్థాలు మరోసారి ప్రత్యక్షం అయ్యాయి. ఎల్ ఎస్ డీ స్టిక్కర్లు, ఎండీఎంఏ పౌడర్ అనేది అత్యంత ఖరీదైనవి. ముఖ్యంగా ఎల్ ఎస్ డీ స్టిక్కర్లు, ఎండీఎంఏ పౌడర్ సేవించనట్లైతే దాదాపు 9 గంటలు 12 గంటల వరకు మత్తు ఎక్కువ వస్తుంది. మత్తు అనేది 12 గంటల వరకు ఉంటుంది. ఈ మత్తు కోసం అనేక మంది యువత, యువతులు వీరిని ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే గోవాకు వెళ్లి డ్రగ్స్ కు సంబంధించిన వారితో సంబంధాలు కొనసాగించే వాడు. ఈ క్రమంలోనే అతను డ్రగ్స్ ను సేకరించి విశాఖకు తీసుకొచ్చి విక్రయిస్తూ ఉంటాడు.

గతంలో రుషికొండలోని ఒక ప్రైవేట్ రిసార్ట్ లో డ్రగ్స్, ఎల్ ఎస్ డీ స్టిక్కర్లు, ఎండీఎంఏ భారీ ఎత్తున లభ్యమయ్యాయి. అక్కడ దాదాపు వంద మంది యువత కలిసి పార్టీ చేసుకున్నప్పుడు ఏదైతే డ్రగ్స్ లభ్యమయ్యాయో అదే డ్రగ్స్ మళ్లీ విశాఖలో కలకలం సృష్టించాయి. విశాఖలో ఎలాంటి డ్రగ్స్ సంస్కృతి తీసుకురాకుండా ఉండేందుకు చర్యలు చేపడతాం, దీనిపై ఉక్కుపాదం మోపుతామని గతంలో చెప్పారు. కానీ గతంలో రుషికొండ పార్టీలో ఎవరైతే మాణికొండ సత్యనారాయణ అనే వ్యక్తి సరఫరా చేశారో మళ్లీ అదే వ్యక్తి లాక్ డౌన్ సడలింపుల తర్వాత ఇక్కడకు తీసుకొచ్చి డ్రగ్స్ ను విక్రయిస్తూ రెడ్ హ్యాండెడ్ గా టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డాడు.

నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. కైలాసపురంలోని పోర్టు స్కూల్ వద్ద ఈ డ్రగ్స్ అమ్ముతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. అతనితోపాటు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. భారీ మోతాదులో విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నిందితులను నుంచి మరిన్ని వివరాలను రాబడుతున్నారు.

Related Posts