విజయవాడలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కృష్ణాజిల్లా గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామికవాడలో జయరాజు ఎంటర్ ప్రైజెస్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో స్క్రాబ్ కొనుగోలుకు వచ్చిన తండ్రీకొడుకులు కోటేశ్వరరావు, చిన్నారావు అక్కడికక్కడే చనిపోయారు. పేలుడు దాటికి కొడుకు మృతదేహం రేకుల పైన పడగా.. తండ్రి మృతదేహం పక్క కంపెనీ వైపు ఎగిరిపడింది.ఈ ఘటనపై పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు విచారణ చేపట్టారు. పేలుడు తీవ్రతకు మృతదేహాలు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడగా.. విచారణలో ప్రాధమికంగా కెమికల్స్ కారణంగా పేలుడు జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి NDRF బృందం చేరుకుంది. మృతదేహాలు మార్చురీకి తరలించగా ఘటనా స్థలంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. భారీ శబ్ధం రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

కెమికల్స్‌తో ఇక్కడ డోర్లు తయారు చేస్తారని, పేలుడు తీవ్రత ఎక్కువుగా ఉందని, విచారణ పూర్తయితే కానీ, ఏం జరిగందనేది నిర్ధారించలేమని, పేలుడే తప్ప.. మంటలు వ్యాపించలేదని, ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

Related Posts