లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Hyderabad

గణేష్ మండపంలో భారీ అగ్నిప్రమాదం

Published

on

Heavy fire in Ganesh Mandapam

హైదరాబాద్ మల్కాజిగిరిలోని గణేష్ మండపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు, 10 ద్విచక్ర వాహనాలు దగ్ధం అయ్యాయి. విష్ణుపురి కాలనీలోని మైత్రి నివాస్ అనే అపార్ట్‌మెంట్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో బుధవారం (ఆగస్టు 4, 2019) తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంబంవించింది. గణేష్ మండపంలో ఏర్పాటు చేసిన అఖండ దీపాన్ని వెలిగిస్తుండగా అనుకోకుండా మంటలు ఎగిసి మండపమంతా వ్యాపించాయి. గణేష్ మండపాన్ని అందంగా అలంకరించిన డెకరేషన్ వస్త్రాలకు మంటలు అంటుకున్నాయి.

వెంటనే అపార్ట్‌మెంట్ వాసులు అప్రమత్తతతో ప్రాణ నష్టం తప్పింది. మంటలు ఎగిసి పడటంతో స్థానికులు మంటలు ఆపే ప్రయత్నం చేయగా ఫలితం లేకుండా పోయింది. రెండు కార్లు, పది బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మండపం మొత్తం కాలిపోయింది. 

అపార్ట్‌మెంట్ లో పార్క్ చేసిన ఇతర వాహనాలను స్థానికుల సహాయంతో బయటకు తీసుకొచ్చారు. సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *