Weather
మధ్యాహ్నమే చీకట్లు : హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ ని వరుణుడు వెంటాడుతున్నాడు. కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు పడుతున్నాయి. గురువారం(అక్టోబర్ 10,2019) హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ ని వరుణుడు వెంటాడుతున్నాడు. కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు పడుతున్నాయి. గురువారం(అక్టోబర్ 10,2019) హైదరాబాద్ లో భారీ వర్షం
Published
1 year agoon
By
veegamteamహైదరాబాద్ ని వరుణుడు వెంటాడుతున్నాడు. కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు పడుతున్నాయి. గురువారం(అక్టోబర్ 10,2019) హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ ని వరుణుడు వెంటాడుతున్నాడు. కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు పడుతున్నాయి. గురువారం(అక్టోబర్ 10,2019) హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశాన్ని మబ్బులు కమ్మేశాయి. మధ్యాహ్నం 2 గంటలకే చీకట్లు అలుముకున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. నగరంలోని పలు చోట్ల వాన కురుస్తోంది. వర్షంతో రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరంలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. ఉదయం, సాయంత్రం వేళల్లో కుంభవృష్టిగా వర్షం కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోతోంది. ముందుకు వెళ్లలేక గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నారు వాహనదారులు.
కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించడంతో జనాలు నరకయాతన పడుతున్నారు. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో నగర వాసులు భయపడుతున్నారు. గడిచిన 48 గంటల్లో రాజధానిలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం ఉప్పల్‌లో అత్యధికంగా 60.3 మిల్లీమీటర్ల వర్షం పడింది. క్యుములో నింబస్ మేఘాల కారణంగా అలకాపురి, నాగోల్‌లో 46.8, రాక్ టౌన్లో 43.5, రామంతాపూర్‌లో 40, ఫిర్జాదీగూడలో 36.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
పంజాబ్, హరియానా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమైంది. రానున్న రెండు రోజుల్లో వాయువ్య భారత్‌లోని మరికొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు నిష్క్రమిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి కోమెరిన్ ప్రాంతం వరకు రాయలసీమ, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్ లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు..టెండర్ దక్కించుకున్న అశోక్ లేలాండ్
మంత్రి కేటీఆర్‌కు ఎంపీ రేవంత్ రెడ్డి సవాల్
కరెంట్ కోతలపై జీహెచ్ఎంసీ కమిషనర్‌కు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి లేఖ
రూ.5లక్షలకే రైల్వే ఉద్యోగం… ఘరానా మోసం
హైదరాబాద్‌లో ఉంటున్నారా? కరోనా వచ్చినట్లే!
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు సీరియస్..అధికారుల నియంత్రణ కొరవడిందని వ్యాఖ్య