Home » హైదరాబాద్ లో భారీ వర్షం
Published
1 year agoon
By
veegamteamతెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం (అక్టోబర్ 20, 2019) హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, ఆసిఫ్ నగర్, లక్డీకపూల్, అమీర్ పేట్, మాసబ్ ట్యాంక్ తోపాటు వివిధ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడ్డది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. పలు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ రాకపోకలకు ఆంతరాయం ఏర్పడింది.
గడిచిన 24 గంటల్లో వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఏకంగా 19 సెం.మీ. కుండపోత వర్షం కురిసింది. నర్సంపేటలో 15 సెం.మీ. అతి భారీ వర్షం నమోదైంది. రానున్న 5 రోజులు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉందని వెల్లడించింది. ఇవాళ, రేపు కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.