హైదరాబాద్ లో భారీ వర్షం…ఉస్మానియా ఆస్పత్రిలోకి చేరిన వర్షపు నీరు..రోగులు, వైద్యుల అవస్థలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హైదరాబాద్ లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఎడ తెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దైంది. దీంతో ఉస్మానియా ఆస్పత్రిలోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఆస్పత్రిలో డ్రైనేజీ, వర్షపు నీరు ప్రవహిస్తోంది. అక్కడి ప్రాంతమంతా జలమయం అయింది. వర్షపు నీటిలో డ్రైనేజీ నీరు కలిసి పోవడంతో డాక్టర్లు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

న్యూ బ్లాక్, ఓల్డ్ బ్లాక్ మధ్య ఉన్న దారిలో డ్రైనేజీ వాటర్ లీక్ అవ్వడంతో వైద్యులు, రోగులు కదల్లేని పరిస్థితి నెలకొంది. నిన్న ఆస్పత్రిలోని పలు వార్డుల్లోకి నీరు చేరుకోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. దీంతో రోగులను వేరే వార్డులను షిప్ట్ చేస్తున్నప్పటికీ ఇంకా వరద నీరు చేరుకోవడం ఇబ్బందికరంగా మారంది.

నడిచే మార్గంలో మురికి నీరుతో నిండిపోయింది. మురికి నీరు, వర్షపు కలిసిపోవడంతో మరింత దయనీయ పరిస్థితి నెలకొంది. రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓల్డ్ బ్లాక్ నుంచి న్యూ బ్లాక్ వెళ్లేందుకు వీళ్లేని పరిస్థితి ఉంది. ఆస్పత్రిలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో డాక్టర్లు, రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Posts