లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

తమిళనాడులో భారీ వర్షాలు : జలదిగ్బంధంలో 10 జిల్లాలు

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూర్, నీలగిరి, దిండిగల్, కన్యాకుమారి జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

Published

on

Heavy rains in Tamil Nadu

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూర్, నీలగిరి, దిండిగల్, కన్యాకుమారి జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూర్, నీలగిరి, దిండిగల్, కన్యాకుమారి జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో 10 జిల్లాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. భారీ వర్షాలతో కోయంబత్తూర్, తిరువళ్లూరు జలమయం అయ్యాయి. అదేవిధంగా చెన్నై, తిరునలివేలి, ఊటీతోపాటు మరికొన్ని జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూర్ లో జనజీవనం అస్తవ్యస్తమైంది.

వరదకు గంధయూరు వంతెన పూర్తిగా మునిగిపోయింది. భవాని సాగర్ డ్యామ్ పూర్తిస్థాయిలో నిండటంతో నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో నది పరివాహక ప్రాంతాలు జలమయం అయ్యాయి. గంధయూరు, పులియూర్, గంధవాయిల్, ఆలూరు గ్రామాలు నీట మునిగాయి. గ్రామస్తులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. అకాల వర్షాలు రైతన్నలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలతో పంట నష్టం వాటిల్లింది. వందల ఎకరాల్లో అరటి తోటలు నీట మునిగాయి.

నీలగిరి జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రవాణా స్థంభించిపోయింది. ఊటీ కొండల్లో భారీ వర్షం కారణంగా మూడు రోజులపాటు పర్యాటక రైళ్లు రద్దు అయ్యాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉండటంతో ప్రభుత్వం  హైలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు పడుతున్న పలు ప్రాంతాల్లో సెలవులు ప్రకటించింది.
 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *