లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

జార్ఖండ్ సీఎంగా సోరెన్ ప్రమాణస్వీకారం… విపక్షాల ఐక్యత షో

Published

on

At Hemant Soren's Oath Ceremony In Jharkhand, A Show Of Opposition Unity

ఒకప్పటి జార్ఖండ్ యువ సీఎం,జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్(44)ఇవాళ జార్ఖండ్ 11వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశాడు.  రాష్ట్ర గవర్నర్‌ ద్రౌపది ముర్మా ఆయనచే ప్రమాణం చేయించారు. రాంచీలోని మోరాబడి మైదానంలో ఆదివారం(డిసెంబర్-29,2019) ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ముఖ్యమంత్రులు కమల్‌నాథ్‌ (మధ్యప్రదేశ్‌), భూపేశ్‌ బఘేల్‌ (ఛత్తీస్‌గఢ్‌), అశోక్‌ గెహ్లోత్‌ (రాజస్తాన్‌), మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్‌), డీఎంకే అధినేతి ఎంకే స్టాలిన్‌, ఎస్పీ చీఫ్ అఖిలేష్‌​ యాదవ్‌, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌,సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా సోరెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు అలమ్‌గీర్ ఆలం, రామేశ్వర్ ఒరాన్, ఆర్జేడీ శాసనసభ్యుడు సత్యానంద్ భోక్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్,మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ,కేరళ సీఎం పిన్నరయి విజయన్ సోరెన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రతిపక్ష ఐక్యతను ప్రదర్శించే అవకాశాన్ని ఇచ్చింది. గత ఏడాది మేలో కర్ణాటకలో హెచ్ డి కుమారస్వామి చేసిన ప్రమాణం వలె సోరెన్ ప్రమాణస్వీకారానికి చాలా మంది  ప్రతిపక్ష నాయకులు హాజరయ్యారు. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి కూడా విపక్ష నేతలు పెద్ద ఎత్తున హాజరైన విషయం తెలిసిందే.

ఇటీవల వెలవడిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో జేఎంఎం 30 స్థానాలు గెలుపొందగా, కాంగ్రెస్‌ 16, ఆర్జేడీ 1 స్థానం గెలుచుకున్నాయి. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముంది. జేఎంఎం నుంచి ఆరుగురికి, కాంగ్రెస్‌ నుంచి నలుగురికి, ఆర్జేడీ నుంచి ఒకరికి మంత్రి పదవులు దక్కనున్నాయి. జేఎంఎం,కాంగ్రెస్,ఆర్జేడీ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *