కాలో, చెయ్యో విరగ్గొడతారని అనుకున్నా.. హేమంత్‌ని శాశ్వతంగా దూరం చేస్తారని కలలో కూడా అనుకోలేదు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Hemanth Murder Case తెలంగాణలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు మరువక ముందే.. సంగారెడ్డిలో మరో పరువు హత్య కలకలం రేపుతోంది. హైదరాబాద్‌‌కు చెందిన ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో.. వాళ్లపై కక్ష పెంచుకున్న యువతి తండ్రి యువకుడ్ని కిరాతకంగా హత్య చేయించాడు. గతంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్‌ను అమృత తండ్రి మారుతీరావు హత్య చేయించాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది.

హైదరాబాద్‌ చందానగర్‌లో నివాసం ఉంటున్న హేమంత్, అదే ప్రాంతానికి చెందిన అవంతి రెడ్డిని ప్రేమించాడు. ఇద్దరు పరస్ఫర అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే, ఈ పెళ్లి అవంతి తండ్రి లక్ష్మారెడ్డికి ఏ మాత్రం నచ్చలేదు. తనను వ్యతిరేకించి పెళ్లి చేసుకోవడంతో ఆయన కోపంతో రగిలిపోయాడు. పరువు పోయిందని తెగ బాధపడ్డాడు. కిరాయి మనుషులతో హేమంత్ ని కిడ్నాప్ చేయించాడు. అనంతరం సంగారెడ్డిలో హత్య చేయించాడు.

వివాహానంతరం యువ జంట చందానగర్ నుంచి వచ్చి గచ్చిబౌలి టీఎన్జీఓస్ కాలనీలో నివాసం ఉంటోంది. నిన్న(సెప్టెంబర్ 24,2020) మధ్యాహ్నం ప్రేమ జంటను గచ్చిబౌలిలో కిడ్నాప్ చేయగా యువతి కారులో నుంచి పారిపోయి 100కి సమాచారం ఇచ్చింది. అయితే సకాలంలో గచ్చిబౌలి పోలీసులు స్పందించ లేదని ఆమె ఆరోపిస్తోంది. ప్రస్తుతం హేమంత్ మృతదేహం ఉస్మానియాలో ఉన్నట్టు తెలుస్తోంది.

భర్తను కోల్పోయిన అవంతి రెడ్డి తీవ్ర ఆవేదనలో ఉంది. కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. హేమంత్ కాలో, చెయ్యో విరగ్గొడతారు అని అనుకున్నా.. కానీ, ఇలా హేమంత్ ను నాకు శాశ్వతంగా దూరం చేస్తారని అస్సలు ఊహించలేదని అవంతి రెడ్డి వాపోయింది. హేమంత్, నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని అవంతి చెప్పింది. తాను 4వ క్లాస్ లో, హేమంత్ 9వ క్లాస్ ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని తెలిపింది. నేను రెడ్డి, అతడు వైశ్యాస్ అని చెప్పింది. హేమంత్ హత్యకు కులం కారణం కాకపోవచ్చని అవంతి రెడ్డి అంది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్నవారందరిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేసింది.

* నేను 4వ క్లాస్, అతడు 9వ క్లాస్.. అప్పటి నుంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం
* ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నాం
* నా పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవు
* పెళ్లి అయిన 7వ రోజే నా పేరు మీదున్న ఆస్తులన్నీ ట్రాన్సఫర్ చేశాను
* నా దగ్గర గోల్డ్ చైన్, ఈయర్ రింగ్స్, రింగ్స్ తప్ప ఏవీ నా దగ్గర లేవు
* మరొకరు ఇలాంటి పని చేయాలంటే భయపడేలా శిక్షించాలి
* ఎన్ కౌంటర్ చేసినా తప్పు లేదు

* నా మీద అంత ప్రేమ ఉంటే నేను ప్రేమించి వాడిని చంపుతారా
* హేమంత్ తో నేను చాలా ఆనందంగా ఉన్నా
* కాలో చెయ్యో విరగ్గొడతారు అని అనుకున్నా, కానీ చంపుతారని అస్సలు ఊహించలేదు
* పెళ్లయిన 4 నెలల తర్వాత ఈ దారుణం
* అక్కడున్న జనాలు మమ్మల్ని పట్టుకుని మా పేరెంట్స్ కు అప్పజెప్పారు
* మేము రెడ్డిస్, అతడు వైశ్యాస్..

* హేమంత్ హత్యకు క్యాస్ట్ కారణం కాదని అనుకుంటా
* హేమంత్ మర్డర్ లో ప్రమేయం ఉన్న వారందరికి శిక్ష పడాలి
* నా తండ్రి వ్యాపార పనుల్లో చాలా బిజీగా ఉంటారు
* పెళ్లి చేసుకున్నాక సీపీ ఆఫీస్ కి వెళ్లి సజ్జనార్ సార్ ని కలిశాము
* చందానగర్ సీఐ మోసం చేశారు

* ఇప్పటి నుంచి నా తల్లిదండ్రులు కూడా చచ్చిపోయినట్లే
* ఆస్తి లేకపోవడంతోనే హేమంత్ మా వాళ్లకు నచ్చలేదు
* మేము ఎప్పుడు బయటికి వెళ్లినా ఇద్దరం కలిసే వెళ్తాం
* మమ్మల్ని చాలా రోజులు ఫాలో చేశారు
* నిన్న(సెప్టెంబర్ 24,2020) మధ్యాహ్నం 2గంటలకు బలవంతంగా ఇంట్లోకి వచ్చారు
* గుర్తు తెలియని వ్యక్తులు మమ్మల్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు
* కారులో నుంచి దూకి నేను పారిపోయాను
* నా భర్తను తీసుకెళ్లి చంపేశారు


Related Posts