ప్రణయ్‌ని చంపినట్టే నా కొడుకుని చంపుతారని ప్రేమ పెళ్లి వద్దన్నా..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Hemanth Murder Case.. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు మా అబ్బాయిని అన్యాయంగా చంపేశారని హేమంత్ తల్లి కన్నీరుమున్నీరయ్యింది. గతంలో ప్రణయ్‌ను హత్య చేసినట్లే తన కొడుకును కూడా హత్య చేస్తారన్న భయంతోనే ప్రేమ వివాహం వద్దని చెప్పానని తెలిపింది. అవంతి వాళ్ల ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ బయటికెళ్లి పెళ్లి చేసుకున్నారంది. గత నాలుగు రోజులుగా మా అబ్బాయిని చంపేందుకు ప్రయత్నించారని.. నిన్న(సెప్టెంబర్ 24,2020) సాయంత్రం 10 మంది వచ్చి బలవంతంగా తీసుకెళ్లారని చెప్పింది.

హేమంత్‌ హత్య కేసులో 13 మంది అరెస్ట్‌:
హేమంత్‌ హత్య కేసులో 13 మంది నిందితుల్ని సంగారెడ్డి పోలీసులు అరెస్ట్‌ చేశారు. హేమంత్‌ హత్యలో అవంతి బంధువులే కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, తల్లి అర్చన, మేనమామ యుగంధర్‌రెడ్డితో పాటు బంధువులు రాకేశ్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, విజేందర్‌రెడ్డి, సంతోశ్‌రెడ్డి, సందీప్ రెడ్డి, డ్రైవర్ సాహెబ్ పటేల్, స్పందన, స్వప్న, రజిత, అర్చనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

తెలంగాణలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు మరువక ముందే.. సంగారెడ్డిలో మరో పరువు హత్య కలకలం రేపుతోంది. హైదరాబాద్‌‌కు చెందిన ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో.. వాళ్లపై కక్ష పెంచుకున్న యువతి తండ్రి యువకుడ్ని కిరాతకంగా హత్య చేయించాడు. గతంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్‌ను అమృత తండ్రి మారుతీరావు హత్య చేయించాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది.

హైదరాబాద్‌ చందానగర్‌లో నివాసం ఉంటున్న హేమంత్, అదే ప్రాంతానికి చెందిన అవంతి రెడ్డిని ప్రేమించాడు. ఇద్దరు పరస్ఫర అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే, ఈ పెళ్లి అవంతి తండ్రి లక్ష్మారెడ్డికి ఏ మాత్రం నచ్చలేదు. తనను వ్యతిరేకించి పెళ్లి చేసుకోవడంతో ఆయన కోపంతో రగిలిపోయాడు. పరువు పోయిందని తెగ బాధపడ్డాడు. కిరాయి మనుషులతో హేమంత్ ని కిడ్నాప్ చేయించాడు. అనంతరం సంగారెడ్డిలో హత్య చేయించాడు.

వివాహానంతరం యువ జంట చందానగర్ నుంచి వచ్చి గచ్చిబౌలి టీఎన్జీఓస్ కాలనీలో నివాసం ఉంటోంది. నిన్న(సెప్టెంబర్ 24,2020) మధ్యాహ్నం ప్రేమ జంటను గచ్చిబౌలిలో కిడ్నాప్ చేయగా యువతి కారులో నుంచి పారిపోయి 100కి సమాచారం ఇచ్చింది. అయితే సకాలంలో గచ్చిబౌలి పోలీసులు స్పందించ లేదని ఆమె ఆరోపిస్తోంది. ప్రస్తుతం హేమంత్ మృతదేహం ఉస్మానియాలో ఉన్నట్టు తెలుస్తోంది.

 - Sakshi Post

ఆస్తి లేకపోవడంతోనే హేమంత్‌ మా వాళ్లకు నచ్చలేదు:
హేమంత్‌కు ఆస్తి లేకపోవడమే తమ తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారిందన్నారు హేమంత్ భార్య అవంతి. గత కొన్ని రోజులుగా మమ్మల్ని వాళ్లు ఫాలో చేస్తున్నారని.. అప్పటికీ మేము చాలా జాగ్రత్తగా ఉన్నామన్నారు. కానీ బయటి వ్యక్తులతో మమ్మల్ని చంపించే ప్రయత్నం చేశారన్నారు. నిన్న మధ్యాహ్నం 2గంటల సమయంలో బలవంతంగా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని తీసుకెళ్లారని చెప్పింది.

* హేమంత్ తల్లి కంటతడి
* హేమంత్, అవంతి ఇద్దరూ ప్రేమించుకున్నారు
* విషయం తెలిసి అమ్మాయిని 7 నెలలు హౌస్ అరెస్ట్ చేశారు
* జూన్ 10 మధ్యాహ్నం 2.40కి బయటికి వచ్చి హేమంత్‌కి కాల్ చేసింది
* అదే రోజు రిజిస్ట్రర్ మ్యారేజీ చేసుకున్నారు
* అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు అనుకున్నాం
* నాకు ఆ అమ్మాయి చెప్పి రెండేళ్లు అయ్యింది

* వాళ్ల తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఇలా చేశారు
* సీపీ ఆఫీస్‌కి వెళ్లి అందరం మాట్లాడుకున్నాం
* నాలుగు రోజుల నుంచి ఫాలో చేస్తున్నారు
* కారులో నుంచి అవంతి దూకేసింది
* రంజిత్, రాకేశ్, రజితలే ప్రధాన సూత్రధారులు
* మా అబ్బాయిని చంపి అమ్మాయికి రెండో పెళ్లి చేద్దామనుకున్నారుRelated Posts