hemanth-murder-case

హేమంత్ హత్య కేసు.. అవంతి తండ్రి, తల్లి, మేనమామ సహా 13మంది అరెస్ట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Hemanth Murder Case.. హేమంత్‌ హత్య కేసులో 13 మంది నిందితుల్ని సంగారెడ్డి పోలీసులు అరెస్ట్‌ చేశారు. హేమంత్‌ హత్యలో అవంతి బంధువులే కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, తల్లి అర్చన, మేనమామ యుగంధర్‌రెడ్డితో పాటు బంధువులు రాకేశ్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, విజేందర్‌రెడ్డి, సంతోశ్‌రెడ్డి, సందీప్ రెడ్డి, డ్రైవర్ సాహెబ్ పటేల్, స్పందన, స్వప్న, రజిత, అర్చనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

హేమంత్ ను తీసుకెళ్లి మర్డర్:
తమను బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్తున్న సమయంలో హేమంత్ చింతా, అవంతి రెడ్డి కారు దిగిపోయారు. ఓఆర్‌ఆర్‌ సమీపంలో కారు దిగి ఇతరులను సాయం కోసం బతిమిలాడారు. ఆ సమయంలో హేమంత్‌ను కొట్టి రోడ్డుపై ఈడ్చుకుంటూ కారులోకి ఎక్కించారు. అక్కడి నుంచి పారిపోయిన అవంతి పోలీస్ స్టేషన్ కు పరిగెత్తింది. అయితే అక్కడి నుంచి హేమంత్‌ను తీసుకెళ్లిన వ్యక్తులు.. అతడిని హత్య చేసి.. కిష్టాయగూడెం సమీపంలోని చెట్ల పొదల్లో మృతదేహాన్ని వదిలి పరారయ్యారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు అర్థరాత్రి సమయంలో హేమంత్ మృతదేహాన్ని గుర్తించారు.

ముఖంపై తీవ్ర గాయాలు, మెడకు గట్టిగా బిగించిన తాడు:
హేమంత్‌ను కిడ్నాప్‌ చేసిన కిరాయి గూండాలు అతడ్ని అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. హేమంత్‌ మొహం, మెడపై తీవ్ర గాయాలు, రక్తపు మరకలు ఉన్నాయి. హేమంత్‌ చేతుల్ని వెనక్కి కట్టేసి ముఖంపై పిడి గుద్దులు గుద్ది అతను స్పృహ తప్పిన తర్వాత .. మెడకు తాడుతో గట్టిగా ఉరి వేసి చంపినట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. హేమంత్‌ను కారులోనే ఉరివేసి కిరాతకంగా చంపి మృతదేహాన్ని ముళ్ల పొదల్లో పడేసి వెళ్లారు కిరాయి హంతకులు.

నిన్న(సెప్టెంబర్ 25,2020) ఉదయం బయటికెళ్లిన హేమంత్, అవంతి… మధ్యాహ్నం 12 గంటలకు గచ్చిబౌలి చేరుకున్నారు. ఇద్దర్నీ ఫాలో చేస్తూ వస్తున్న కిరాయి గుండాలు మధ్యాహ్నం 2గంటలకు కారులో వచ్చి హేమంత్, అవంతిని కారులో బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కిరాయి గుండాల నుంచి తప్పించుకొని కారు నుంచి దిగి పారిపోయింది అవంతి. మధ్యాహ్నం 3 గంటలకు హేమంత్‌ను కారులో తీసుకెళ్లిపోయారు కిరాయి గూండాలు. కారులోంచి దిగి పారిపోయిన అవంతి పోలీసులకు ఫోన్‌ చేసినా సకాలంలో స్పందించలేనట్లు తెలుస్తోంది. నిన్న సాయంత్రం కిడ్నాపైన హేమంత్‌.. అర్థరాత్రి కిష్టాయగూడెం సమీపంలో మృతదేహమై కనిపించాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సంగారెడ్డి క్లూస్ టీం రంగంలోకి దిగి పలు ఆధారాలు సేకరించారు.

తెలంగాణలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు మరువక ముందే.. సంగారెడ్డిలో మరో పరువు హత్య కలకలం రేపుతోంది. హైదరాబాద్‌‌కు చెందిన ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో.. వాళ్లపై కక్ష పెంచుకున్న యువతి తండ్రి యువకుడ్ని కిరాతకంగా హత్య చేయించాడు. గతంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్‌ను అమృత తండ్రి మారుతీరావు హత్య చేయించాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది.

హైదరాబాద్‌ చందానగర్‌లో నివాసం ఉంటున్న హేమంత్, అదే ప్రాంతానికి చెందిన అవంతి రెడ్డిని ప్రేమించాడు. ఇద్దరు పరస్ఫర అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే, ఈ పెళ్లి అవంతి తండ్రి లక్ష్మారెడ్డికి ఏ మాత్రం నచ్చలేదు. తనను వ్యతిరేకించి పెళ్లి చేసుకోవడంతో ఆయన కోపంతో రగిలిపోయాడు. పరువు పోయిందని తెగ బాధపడ్డాడు. కిరాయి మనుషులతో హేమంత్ ని కిడ్నాప్ చేయించాడు. అనంతరం సంగారెడ్డిలో హత్య చేయించాడు.

వివాహానంతరం యువ జంట చందానగర్ నుంచి వచ్చి గచ్చిబౌలి టీఎన్జీఓస్ కాలనీలో నివాసం ఉంటోంది. నిన్న(సెప్టెంబర్ 24,2020) మధ్యాహ్నం ప్రేమ జంటను గచ్చిబౌలిలో కిడ్నాప్ చేయగా యువతి కారులో నుంచి పారిపోయి 100కి సమాచారం ఇచ్చింది. అయితే సకాలంలో గచ్చిబౌలి పోలీసులు స్పందించ లేదని ఆమె ఆరోపిస్తోంది. ప్రస్తుతం హేమంత్ మృతదేహం ఉస్మానియాలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఆస్తి లేకపోవడంతోనే హేమంత్‌ మా వాళ్లకు నచ్చలేదు:
హేమంత్‌కు ఆస్తి లేకపోవడమే తమ తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారిందన్నారు హేమంత్ భార్య అవంతి. గత కొన్ని రోజులుగా మమ్మల్ని వాళ్లు ఫాలో చేస్తున్నారని.. అప్పటికీ మేము చాలా జాగ్రత్తగా ఉన్నామన్నారు. కానీ బయటి వ్యక్తులతో మమ్మల్ని చంపించే ప్రయత్నం చేశారన్నారు. నిన్న మధ్యాహ్నం 2గంటల సమయంలో బలవంతంగా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని తీసుకెళ్లారని చెప్పింది.



Related Posts