hens lay eggs with green yolks in kerala secret revealed

ఆకుపచ్చ సొనలతో గుడ్లు పెడుతున్న ఆరు కోళ్లు..ఎందుకంటే.. 

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కేరళలోని మలప్పురంలో ఓతుక్కుంగల్‌కు చెందిన ఎకె శిహాబుధీన్ అనే పౌల్ట్రీ ఫామ్‌లో ఆరు కోళ్ళు, పచ్చసొనలతో గుడ్లు పెట్టడం. వింతగా విశేషంగా మారింది.  దీని గురించి ఎంతో విడ్డూరంగా చెప్పుకున్నారు స్థానికులు.  అనే రైతు వద్ద ఉన్న కోళ్లలో ఆరు కోళ్లు కొంతకాలంగా ఆకుపచ్చ సొన ఉన్న గుడ్లు పెడుతున్నాయి. 

సాధారణంగా కోళ్లు పెట్టే గుడ్లలోపల ఉండే సొన పసుపుపచ్చ రంగులో ఉంటుంది.  శిహాబుధీన్ అనే పౌల్ట్రీ ఫామ్‌లో ఆరు కోళ్ళు పెట్టే గుడ్లలో పైన సొన తెల్లగానే ఉంటోంది కానీ లోపల ఉండే సొన మాత్రం ఆకుపచ్చరంగులో ఉంటోంది. దీన్ని  శిహాబుధీన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారి  రాష్ట్రంలోని కేవీఏఎస్‌యూ శాస్త్రవేత్తల దృష్టికి రావటంతో వారు ఈ గుడ్లను పరిశీలించారు.

దీంతో ఈ ఆకుపచ్చ కోడిగుడ్ల వెనుక ఉన్న మిస్టరీ వీడింది. కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్స్ యూనివర్సిటీ (కేవీఏఎస్‌యూ) నిపుణులు అధ్యయనం చేయగా..కోళ్లకు పెట్టిన ఆహారం వల్ల గానీ లేదా సహజసిద్ధమైన రంగునిచ్చే మొక్కలను తినడం వల్ల గానీ గుడ్లలోని చందమామకు ఈ రంగు వచ్చినట్టు తేల్చారు.

దీని వెనుక ఎలాంటి జన్యుపరమైన సమస్యలు లేవని పౌల్ట్రీ నిపుణులు చెబుతున్నారు. తమ అధ్యనంలో భాగంగా వాటికి పెట్టే ఆహారం మార్చగా.. రెండు వారాల్లో మళ్లీ సహజమైన పసుపు రంగు చందమామతోనే గుడ్లు పెట్టడం పెట్టాయని తెలిపారు. వాస్తవానికి ఇటువంటి కోడిగుడ్లను తొమ్మిది నెలలుగా చూస్తున్నామనీ.. అయితే ఫేస్‌బుక్‌లో పెట్టిన తర్వాత వీటిపై విస్తృత ప్రచారం జరిగిందని వారు చెప్పుకొచ్చారు. కానీ ఆ ఆరుకోళ్లు..ఇప్పుడు మామూలు రంగులోనే గుడ్లు పెడుతున్నారనీ తెలిపారు. 

Read: వంటలు చేసేస్తున్న ఏడాది బుడ్డోడు..ఫిదా అవుతున్న నెటిజన్లు

Related Posts