Hera Gold Case: hire Murder gang

హీరా గోల్డ్‌ కేసు : కిరాయి హంతక ముఠా 

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హీరా గోల్డ్‌ కేసులో కిరాయి హంతక ముఠా రంగంలోకి దిగింది.

హైదరాబాద్ : హీరా గోల్డ్‌ కేసులో కిరాయి హంతక ముఠా రంగంలోకి దిగింది. నౌహీరాపై ఫిర్యాదు చేసినా, ఈ కేసులో సాక్ష్యం చెప్పినా.. చంపేస్తామంటూ బెదిరిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోను బాధితులు పోలీసులకు అందించారు. దీంతో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ బెదిరింపుల నేపథ్యంలో బాధితులు పోలీస్‌ స్టేషన్‌, కోర్టుకు వెళ్ళాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. హీరా గోల్డ్‌ కేసులో ఉగ్రవాదులు సైతం పెట్టుబడులు పెట్టారన్న సీఐడీ  కూడా తేల్చడం గమనార్హం. 

హీరా గోల్డు చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని చిత్తూరు జైలులో ఉన్న షేక్ నౌహీరాను సీఐడీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతివ్వడంతో నౌహీరాను సీఐడీ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నౌహీరాను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. 

ఆరు వేల కోట్ల రూపాయలు ప్రజల నుంచి అక్రమంగా వసూలు చేశారని నౌహీరాపై ఆరోపణలు ఉన్నాయి. 15 పైగా కంపెనీలు ప్రారంభించి, హీరా గ్రూప్ పేరిట నగలు దుకాణం మొదలుకొని టెక్స్ టైల్స్, స్వీట్స్, నగలు, వాటర్ బాటిల్స్ తోసహా 15 పైగా వ్యాపారాలను నిర్వహిస్తూ ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు. మనీ ల్యాండరింగ్ కు పాల్పడినట్లు కూడా ఆరోపలణలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆమెపై కేసు నమోదు చేసింది. కొన్ని ఉగ్రవాద సంస్థలకు చెందిన డబ్బులు కూడా హీరా గ్రూప్ కు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి.
 

Related Posts