పవన్ బయోపిక్: ఆర్జీవీ పవర్ స్టార్‌ని చూశారా!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వివాదం ఆయనకి వోడ్కాతో పెట్టిన విద్య.. బయోపిక్స్ తీయడం ఆయనకు టూత్ పిక్‌తో పళ్లు గుచ్చుకున్నంత తేలిక.. నేనుండే సిటీ ఏదైనా కావొచ్చుకానీ నాకు పబ్లిసిటీ అంటే పిచ్చి అంటాడు.. నా సినిమాలు ఆడకపోయినా నేను తీయడం మాత్రం మానను అంటాడు.. కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ.. రిలీజ్ సంగతి పక్కన పెడితే ఆయన సినిమా తీయడానికి బోలెడన్ని పాయింట్స్ తగులుతూనే ఉంటాయి. మైండ్‌లో పురుగు అలా కదలగానే.. ఇదే నా నెక్స్ట్ సినిమా అని అనౌన్స్ చేసేస్తుంటాడు.

ఇప్పుడు వర్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయోపిక్ తెరకెక్కించనున్నాడు. తాజాగా ట్విట్టర్ ద్వారా ఇందుకు సంబంధించిన వివరాలు ప్రేక్షకులతో పంచుకున్నాడు ఆర్జీవీ. ‘‘బ్రేకింగ్‌ న్యూస్‌: ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌ కొత్త సినిమాకు ‘పవర్‌ స్టార్‌’ అనే పేరు పెట్టాం. పీకే, ఎమ్‌ఎస్‌, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్‌ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీతో సినిమా తీయబోతున్నాం. ఈ సినిమాలోని పాత్రలు ఎవరో అర్థం చేసుకోవటానికి ఎటువంటి బహుమతులు ఇవ్వబడవు’’ అని పేర్కొన్నారు.

అక్కడితో ఆగితే ఆయన ఆర్జీవీ ఎందుకవుతాడు? పనిలో పనిగా ‘పవర్ స్టార్’లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ చేస్తున్న ఆర్టిస్ట్‌కి సంబంధించిన ఓ వీడియో కూడా విడుదల చేశాడు.
‘‘నా కొత్త సినిమా ‘పవర్ స్టార్’లో హీరో ఇతనే . అతను మా ఆఫీస్‌కి వచ్చినప్పుడ ఈ వీడియో షూట్ చేశాం. సాధారణంగా వ్యక్తిని పోలిన వ్యక్తులు ఉండడం అన్నది యాదృచ్ఛికం కాని యాదృచ్ఛికం.. ఉద్దేశపూర్వకం కాని ఉద్దేశపూర్వకం’’ అంటూ తన స్టైల్లో ట్వీటాడు వర్మ. ‘అమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాతో కాంట్రవర్సీ పీక్స్‌కి తీసుకెళ్లిన ఆర్జీవీ ఇప్పుడు పవన్ బయోపిక్‌తో ఏ స్థాయి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి మరి.

Related Posts