Here’s All the Ridiculous Things India Is Doing Ahead of Donald Trump’s Visit to Ahmedabad

ట్రంప్ కోసం ఇంత ఆర్భాటం అవసరమా? భారత్‌పై అమెరికా మీడియా వ్యంగ్యాస్త్రాలు!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

డొనాల్డ్ ట్రంప్.. అసలే ఆయన అమెరికా అధ్యక్షుడు.. రాకరాక భారత్ వస్తున్నాడు. ఏర్పాట్లు మాములుగా ఉంటే సరిపోదుగా.. అదిరిపోవాలి. ట్రంప్ దృష్టిని ఆకర్షించేలా ఉండాలి. అందుకే ట్రంప్ పర్యటనకు ముందే ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ట్రంప్ పర్యటించే రోడ్లు.. ప్రాంతాలన్నీ అద్దంలా మెరిసిపోతున్నాయి.. మొన్నటివరకు అతుకుల రోడ్లు కాస్తా కొత్త రోడ్లలా మెరిసిపోతున్నాయి. ట్రంప్ హైప్రొఫైల్ కు తగినట్టుగా ఏర్పాట్లు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గోడలన్నీ అందంగా తీర్చుదిద్దుతున్నారు. పాన్ షాపులను మూసివేస్తున్నారు. వీధికుక్కలను బోన్లలోకి తరలిస్తున్నారు. ఇదంతా ట్రంప్ కోసమేనా? అని అంటోంది అమెరికా మీడియా.. ట్రంప్ పర్యటన కోసం ఇంతా హడావుడి అవసరమా? అన్నట్టుగా వ్యంగ్యాస్త్రాలను సంధిస్తోంది.   

భారత పర్యటనకు ఇంకా కొన్ని రోజులే ఉంది.. ఇంతలోనే అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితా నుంచి భారత్‌ను తొలగించాలని ట్రంప్ నిర్ణయించారు. దీని అర్థం.. తలసరి ఆదాయం సుమారుగా  2వేల డాలర్లు మాత్రమే ఉన్నప్పటికీ,  12,375 డాలర్ల మార్కు కంటే తక్కువగా ఉన్నా కూడా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించాలని అధ్యక్షుడు ట్రంప్ కోరుకుంటున్నారేమో..  కానీ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన భారతదేశం ఆర్థికంగా స్థిరంగా లేదనే చెప్పాలి. క్షీణిస్తున్న భారతదేశపు  స్థూల జాతీయోత్పత్తి (GDP) ప్రపంచ ఆర్థిక మందగమనానికి ఒక కారణమని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) చెబుతోంది. 

ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సందర్శించనున్నారు. దేశంలోని పరిస్థితులు అంతా బాగానే ఉన్నాయని ట్రంప్ భావించేంతగా రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకే ట్రంప్ పర్యటించే గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో అభివృద్ధి పనులు ఎలా కొనసాగుతున్నాయో అమెరికా మీడియా హ్యాస్యాస్పదంగా పేర్కొంది. అహ్మదాబాద్ లో జరిగే హ్యాస్యాస్పదమైన విషయాల గురించి ఒక్కొక్కటి వర్ణిస్తూ వ్యంగ్యస్త్రాలను సంధిస్తోంది. నమస్తే ట్రంప్ (గతంలో కెమ్ చో ట్రంప్ అని పిలిచేవారు) అంటూ స్వాగతం పలికేందుకు భారత్ అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపింది. 

ట్రంప్ కంటపడొద్దని.. మురికి వాడలకు అడ్డంగా అందమైన గోడ : 
డొనాల్డ్ ట్రంప్ కు గోడలంటే బాగా ఇష్టమా? అంటే ఒక రకంగా అవుననే చెప్పాలి. ఎందుకంటే.. అమెరికా-మెక్సికో సరిహద్దులో ఒక పెద్ద గోడను నిర్మించాలని ట్రంప్ చేసిన ప్రయత్నాలు కొనసాగలేదు. ఇప్పడు అలాంటి పెద్దగోడను తలపించేలా భారత్ పర్యటనలో ట్రంప్ ను ఆకట్టుకునేలా ఉంది. అందుకే.. ట్రంప్ అహ్మదాబాద్ లో అడుగుపెట్టడానికి ముందే ఏడు అడుగుల 400 మీటర్ల పొడవైన గోడను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు.  స్టేడియానికి వెళ్లే మార్గంలో మురికి వాడలు ఉన్నాయి. అవి కనిపించకుండా ఉండేందుకు ఈ గోడను నిర్మించారా ఏంటి? అన్నట్టుగా అమెరికా మీడియా అంటోంది. 

READ  భారత్ ను కలవరపెడుతున్న కరోనా వైరస్

ఈ గోడల నిర్మాణానికి సుమారు రూ. 100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. మురికివాడలను దాచడానికి ప్రయత్నించే బదులు వాటిని అభివృద్ధి చేయడానికి అదే ఖర్చు చేస్తే బాగుండేదని యూఎస్ మీడియా వ్యంగ్యంగా పేర్కొంది. గోడల నిర్మాణం కోసం కోట్లు ఖర్చు పెట్టేది సరిపోకపోతే.. అధికారులు ఒక్క అడుగు ముందుకేసి రెండు దశాబ్దాలకు పైగా కొత్తగా నిర్మించిన మోటెరా స్టేటియం సమీపంలో నివసిస్తున్న మురికివాడల నివాసితులను తరిమివేస్తున్నారు. 45మందికి పైగా మురికివాడలను అక్కడి నుంచి ఖాళీ చేసేందుకు అనుమతినివ్వడంపై వ్యంగ్యంగా స్పందించింది.

పాన్ షాపుల మూసివేత :
ట్రంప్ వచ్చే మార్గంలోని పాన్ షాపులను అధికారులు మూసివేస్తున్నారు. ఎక్కడ పాన్ షాపు కనపడినా వెంటనే సీల్ వేసేస్తున్నారు. అంటే.. పాన్ పదార్థాలంటే ప్రభుత్వానికి అంతగా ఇష్టం లేకపోవడమేనా కారణం.. ఒకవేళ ట్రంప్ నమలడానికి కొంత పాన్ ఇవ్వడం మరొక ‘కోవ్‌పీ విపత్తు’కు దారితీస్తుందని ఆందోళన కాబోలు అంటూ వ్యంగ్యంగా పేర్కొంది. ట్రంప్ పర్యటనకు ముందే ఎయిర్ పోర్టుకు సమీపంలోని మూడు పాన్ షాపులను అధికారులు సీలు వేశారు. ఆయా ప్రాంతాల్లో గోడలపై రోడ్లపై పాన్ ఉమ్మిన మరకలు లేకుండా ఉంచవచ్చునని ఉద్దేశం కావొచ్చు. 

వీధి కుక్కలన్నీ బోనుల్లోకి :
గుజరాత్ వీధుల్లో కనిపించే వీధి కుక్కలు ట్రంప్ పర్యటన ముగిసేవరకు ఒక్కటి కనిపించే పరిస్థితి లేదు. వీధుల్లో తిరిగే కుక్కలను పట్టి తీసుకెళ్లి బోనుల్లోకి ఎక్కించారు. భద్రతా కారణాల దృష్ట్యా వీధి కుక్కలను లాక్ చేయాలనే ప్రణాళికను అధికారులు రూపొందించారు. అంటే.. మొరిగే కుక్కలు అరుదుగా కరుస్తాయనే విషయం వారు మరిచినట్టు ఉన్నారు. 

విమానాలు రీ షెడ్యూల్.. మళ్లీంపు : 
ట్రంప్ పర్యటనకు ముందుగానే.. కనీసం 60 అంతర్జాతీయ, దేశీయ విమానాలను రీ షెడ్యూల్ చేశారు అధికారులు.. అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడానికి వచ్చే ప్రముఖ వ్యక్తుల కోసం 10 బేసి విమానాలు మాత్రమే ఉన్నాయి. ఇతర విమానాలు సూరత్ లేదా బరోడాకు మళ్లించారు. 

ఖాళీ ఇళ్లలో పెట్రోలింగ్ :
ఖాళీగా ఉన్న ఇళ్లల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. మురికివాడలను ఖాళీ చేయించడమే కాకుండా కనీసం తాత్కాలిక పునరావాసం కల్పించే బదులు.. ఈ ఖాళీ గృహాలకు అత్యవసర పోలీసుల నిఘా అవసరమని అధికారులు నిర్ణయించారు. అందుకే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు మోటెరా, సర్దార్‌నగర్, వడాజ్ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నసుమారు 40 ప్లాట్లు, ఖాళీ గృహాలపై నిఘా పెట్టేందుకు భారీగా పోలీసులను మోహరిస్తున్నారు. అంటే.. ఈ ప్రాంతాల్లో నివాసితులందరూ అసౌకర్యానికి గురవుతున్నారని అర్థమే కదా..

READ  INDvNZ : ఆదివారం టీ20 ఫైనల్ ఫైట్

రూ.30 కోట్లకు పైగా ఖర్చు : 
గోడ నిర్మించడానికి డబ్బు సరిపోకపోతే, ట్రంప్ పర్యటించే 22 కిలోమీటర్ల రహదారి కోసం స్థానిక అధికార యంత్రాంగం రూ .30 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. ట్రంప్ వెళ్లే ఈ మార్గంలో ప్రతిచోట 28 దశలుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, లక్షలకు పైగా చెట్లు, ఫ్లవర్ బెడ్స్, స్టేడియం దగ్గరకు ప్రజలను తరలించేందుకు 2,200 కి పైగా బస్సులను పంపడం వంటివి విషయాలు ఉన్నాయి. అంతేకాదు.. ఫాగింగ్ యంత్రాలను కూడా ఇన్‌స్టాల్ చేస్తున్నారు. ఎందుకంటే.. వేడుకల్లో లోపాలను దాచిపెట్టడానికి ఇది బాగా పనిచేస్తుందని, అలా అయితే లోపాలను దాచడానికి గోడలను ఎందుకు నిర్మించాలి. ఈ ప్రక్రియలో కనీసం నగరానికి పచ్చదనం చాలా అవసరమని గుర్తించాలి కదా అనే విషయాన్ని గుర్తు చేస్తోంది.  

Related Posts