అందరూ నవ్వుతారని తెలిసే జేమ్స్‌బాండ్‌గా పేరు మార్చుకున్నాడట

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చిన్నప్పుడు ఏదో సరదా కోసం ఫిక్షనల్ క్యారెక్టర్లను మన పేర్లుగా పెట్టేసుకుంటాం. వయస్సు, సమయం మారుతున్న కొద్దీ ఆ ఫీలింగ్స్ అన్నీ అటకెక్కుతాయి. కానీ, ఢిల్లీ వ్యక్తి మాత్రం తన పేరును హాలీవుడ్ సినిమా క్యారెక్టర్ జేమ్స్ బాండ్‌ అని అఫీషియల్ గా పెట్టేసుకున్నాడు. అతను డై హార్ట్ ఫ్యాన్ అని నిరూపించడానికి ఇదొక్కటి చాలదూ. ఇలా పేరు మార్చుకోవడానికి ఎలాంటి సమస్యలైనా ఎదిరించడానికి సిద్ధమైపోయాడు.

బ్రిటిష్ రచయిత అయాన్ ఫ్లెమింగ్ సృష్టించిన ఫిక్షన్ క్యారెక్టర్ జేమ్స్ బాండ్. ఈ సినిమాల్లో స్పై పలు క్యారెక్టర్లలో దూరిపోతాడు. సీన్ కానరీ, డేవిడ్ నీవెన్, జార్జ్ లాజెన్బై, రోజర్ మూరె, టిమోతీ డాల్టన్, పీర్స్ బ్రాసన్, డేనియల్ క్రెగ్ క్యారెక్టర్లు పోషిస్తుంటాడు.

33ఏళ్ల వికాస్ కర్దామ్ వెస్ట్ ఢిల్లీలో అతని భార్యతో పాటు మూడేళ్ల కూతురితో కలిసి ఉంటున్నాడు. ఏ మాత్రం సంకోచించకుండా అతని పేరును జేమ్స్ బాండ్ గా మార్చేసుకున్నాడు. చాలా మంది దీనిని జోక్ అనుకుంటారు కానీ కాదు. పేరు మార్చుకున్న తర్వాతి నుంచి అతని పట్ల చాలా అటెన్షన్ కనిపిస్తుంది. ఇంకా ఆ పేరును బాగా ఎంజాయ్ చేస్తున్నాడట వికాస్.

విషయం తెలిసినప్పటి నుంచి కోపగించుకున్న మహిళ.. అతనితో మాట్లాడటం కూడా మానేసింది. పేరు జేమ్స్ బాండ్ గా మార్చుకుంటే అంతా వెక్కిరిస్తారని.. అక్కర్లేని అటెన్షన్ వస్తుందని ఆమె ఉద్దేశ్యమట. ముందుగా అంటే సెప్టెంబరు 2019నే పేరు మార్చుకోవాలనుకున్నాడు వికాస్. అది ప్రోసెస్ లో ఉండి ఏప్రిల్ లో COVID లాక్ డౌన్ రావడంతో ఇప్పటికి కుదిరింది.

ఇప్పుడతను అందరికీ ఓ జోక్ లా అనిపించొచ్చు. దానికి తాను సిద్ధంగా ఉన్నానని, కనీసం కొంతమంది నవ్వుకు తాను కారణం అవుతున్నానని అతను చెప్తున్నాడు. ప్రస్తుత ప్రపంచంలో స్వచ్ఛంగా దొరికేది అదే అని తన ఉద్ధేశ్యమట.

Related Posts