లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Business

హీరో ఎలక్ట్రిక్ పండుగ ఆఫర్.. ఈ-స్కూటర్లపై రూ.5వేలు క్యాష్ డిస్కౌంట్

Published

on

Hero Electric festive offers : ప్రముఖ వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ నవంబర్ 2న తమ కస్టమర్ల కోసం సరికొత్త పండుగ ఆఫర్లు ప్రకటించింది. ఈ-ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.5 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. పరిమిత కాలం వరకే ఈ పండుగ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.కస్టమర్లు ఏదైనా ద్విచక్ర వాహన ఎక్సేంజ్ చేసుకోవడం ద్వారా రూ .5 వేల వరకు అదనపు డిస్కౌంట్లు పొందవచ్చు. అంతేకాదు.. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రత్యేకించి వడ్డీ లేని ఫైనాన్స్ కూడా పొందవచ్చు అని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.


ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ, రేట్లు తగ్గుతాయా


లిథియం-అయాన్, లీడ్-యాసిడ్ శ్రేణిలో ఈ-స్కూటర్లపై పండుగ ఆఫర్ నవంబర్ 14 వరకు అందుబాటులో ఉండనుంది. దేశవ్యాప్తంగా 500కి పైగా డీలర్‌షిప్‌ల ద్వారా ఈ పండుగ ఆఫర్లను పొందవచ్చునని హీరో ఎలక్ట్రిక్ పేర్కొంది. ఈ పరిమిత కాల పండుగ ఆఫర్‌లో భాగంగా కస్టమర్లు లీడ్-యాసిడ్ మోడళ్ల కొనుగోలుపై రూ.3,000 ఎంపిక చేసిన మోడళ్లకు రూ .5 వేల ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు.హీరో ఎలక్ట్రిక్ రిఫెరల్ పథకం కింద కొనుగోలు చేసే కస్టమర్లు అదనంగా రూ .1,000 విలువైన బెనిఫిట్స్ పొందొచ్చు. మొత్తం 6,000 వరకు పొందవచ్చు. కొత్తగా లాంచ్ చేసిన Optima HX City Speed, Nyx HX City Speed వాహనాలు వరుసగా రూ. 57,560, రూ.63,990లను ఆఫర్ నుంచి మినహాయించినట్లు తెలిపింది.

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ తన అన్ని ఇ-బైక్‌లపై మూడు రోజుల రిటర్న్ పాలసీతో పాటు రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *