Home » హీరో మోటార్స్ చేతికి హార్లీ డేవిడ్సన్ బైకులు
Published
3 months agoon
By
subhnHarley-Davidson బైకులను ఇండియాలో డెవలప్ చేసి అమ్మకాలు జరిపేందుకు Hero MotoCorpతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్వయంగా ఆ కంపెనీనే వెల్లడించింది. ఇండియన్ మార్కెట్లో వాటి సర్వీసును, సేల్స్ ను చూసుకోనుంది హీరో. దేశంలో మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్, సేల్స్ నిలిపివేయనున్నట్లు హార్లీ డేవిడ్సన్ సెప్టెంబరులో ప్రకటించింది.
ప్రస్తుతం రెండు కంపెనీల మధ్య లైసెన్సింగ్ అగ్రిమెంట్ ప్రకారం.. హీరో మోటోకార్ప్ ప్రీమియం మోటార్ సైకిళ్లను హార్లీ డేవిడ్సన్ బ్రాండ్ పేరుతో రెడీ చేసి అమ్మనుంది. అంతేకాకుండా హార్లీ డేవిడ్సన్ విడి భాగాలను, పరికరాలను, రైడింగ్ గేర్ పార్ట్‌లను బ్రాండ్ ఎక్స్‌క్లూజివ్ హార్లీ డేవిడ్సన్ డీలర్స్, హీరో డీలర్షిప్ ల ద్వారా ఇండియాలో సర్వీసులు అందజేస్తారు.
ఈ ఒప్పందంపై ప్రస్తుతం పనులు జరుగుతుండగా అధికారిక స్టేట్మెంట్ మరికొద్ది రోజుల్లో వెలువడనుంది. ‘ఈ అరేంజ్మెంట్ ఇరు కంపెనీలకు, రైడర్లకు బెనిఫిట్ కానుంది. ఐకానిక్ హార్లీ డేవిడ్సన్ బ్రాండ్ స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెటివర్క్, హీరో మోటోకార్ప్ కస్టమర్ సర్వీస్ కలిస్తే అద్భుతంగా ఉంటుందని వరల్డ్ లార్జెస్ట్ మోటార్ సైకిల్స్, స్కూటర్స్ మేకర్ మీడియాకు స్టేట్మెంట్ ఇచ్చింది.
ఈ రెండు కంపెనీల మధ్య అగ్రిమెంట్‌కు చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ప్రీమియం మోటార్ సైకిల్ బ్రాండ్ అమ్మకాలు కంటిన్యూ చేయాలని.. ఇండియన్ మార్కెట్లో ఇంకా విస్తరించాలని అనేవి హార్లీ ప్లాన్స్.
2009లోనే ఇండియన్ మార్కెట్లోకి వచ్చింది హార్లీ డేవిడ్సన్. క్రమంగా పెరుగుతూ వచ్చిన ఈ ప్రీమియం బ్రాండ్ బైకులకు కొవిడ్-19 మహమ్మారి సమయంలో పెద్ద ఛాలెంజిలనే ఎదుర్కొంది. అమెరికా-ఇండియాల్లోనే 5శాతం అమ్మకాలు జరపడానికి ఇబ్బందులు ఎదుర్కొంది. వీలైన చోట్ల పెట్టుబడులు తగ్గించి.. నార్త్ అమెరికా, యూరోపియన్, ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో కొన్ని చోట్ల మాత్రమే డైరక్ట్ అమ్మకాలు జరపాలని ప్లాన్ చేస్తుంది.