hero Sushant Singh Rajput last insta post becomes viral

ఆత్మహత్యకు కొన్నిరోజుల ముందు.. కన్నీరు పెట్టిస్తున్న హీరో సుశాంత్ చివరి పోస్టు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వార్త ఒక్క ఇండస్ట్రీనే కాదు అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది.

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వార్త ఒక్క ఇండస్ట్రీనే కాదు అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటన అందరిని ఎంతగానో బాధిస్తోంది. ఎంత పని చేశావ్ సుశాంత్ అని అభిమానులు విలపిస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి కారణమై ఏమై ఉంటుందా అని అంతా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ పోస్టు అందరిని కంటతడి పెట్టిస్తోంది. గుండెలు పిండేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో జూన్ 3న తన తల్లిని స్మరించుకుంటూ సుశాంత్ చేసిన పోస్ట్ ఇది.

మసకబారిన గతం.. కన్నీరుగా జారి ఆవిరవుతోంది:
ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే.. ”మసకబారిన గతం.. కన్నీరుగా జారి ఆవిరవుతోంది.. అనంతమైన కలలు చిరునవ్వును.. అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి.. ఆ రెండిటి మధ్య బతుకుతున్నానే అమ్మా..’’ అంటూ తనలో సాగిన అంతర్మథనాన్ని కవిత రూపంలో రాశాడు సుశాంత్. దాదాపు ఆరు నెలలుగా ఫేస్ బుక్, ట్విటర్ కు దూరంగా ఉంటున్న సుశాంత్.. తల్లిని తలుచుకుంటూ ఇన్‌స్టాలో రాసిన కవిత ఇది. 2002లో తనకు 16 ఏళ్లు ఉన్నప్పుడే చనిపోయిన తన తల్లిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగంతో సుశాంత్ ప్రేమతో పెట్టిన ఈ ఇన్‌స్టాగ్రామ్ ప్రస్తుతం అతడి ఆత్మహత్య నేపథ్యంలో వైరల్‌గా మారింది. నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది.

అమ్మ మరణంతో డిప్రెషన్ లోకి:
పలు టీవీ సీరియళ్లలో నటించిన సుశాంత్‌ సింగ్‌, 1986 జనవరి 21న పట్నాలో జన్మించాడు. 2013లో వచ్చిన ‘కై పో చే’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘ఎంఎస్‌ ధోని’ బయోపిక్‌తో ఫుల్‌ క్రేజ్‌ సాధించాడు. లైఫ్ హ్యాపీగా గడిచిపోయే టీనేజ్ లోనే అతను పెను విషాదాన్ని చూశాడు. 2002లో తల్లి మరణంతో సుశాంత్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. వాతావరణం మారితేనైనా అతనిలో మార్పు వస్తుందన్న ఆశతో ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం ఢిల్లీకి మకాం మార్చింది. ఢిల్లీకి వెళ్లాక క్రమంగా ఆటపాటల్లో రాణించి, సీరియళ్లలో రాణించిన సుశాంత్.. సినిమాల్లోనూ దశ తిరగడంతో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. పైకి సరదాగా, చాలా ఉల్లాసంగా కనిపించే సుశాంత్ అంతర్గతంలో ఆలోచనలన్నీ అమ్మ చుట్టూ తిరిగేవి. ఈ విషయాన్ని అతను కూడా ఏనాడూ దాచుకోడానికి ప్రయత్నించలేదు. గడిచిన 18 ఏళ్లలో తల్లిని తలుచుకుంటూ అతను ఎన్నెన్నో కవితలు, జ్ఞాపకాలు రాసుకుంటూ వచ్చాడు.

READ  గుంటూరులో మహిళా వాలంటీర్ ఆత్మహత్య

మేనేజర్ ఆత్మహత్య చేసుకున్న 5రోజులకే సుశాంత్ సూసైడ్:
బాంద్రాలోని తన ఇంట్లో సీలింగ్ కు వేలాడుతూ కనిపించిన సుశాంత్ ను మొదట పనివాళ్లు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రాథమిక విచారణలో.. సుశాంత్ డిప్రెషన్ కారణంగానే తనువు చాలించినట్లు నిర్ధారణ అయిందని, పోస్టుమార్టం తర్వాత మరిన్ని వివరాలు చెబుతామని ముంబై పోలీసులు వివరించారు. 34ఏళ్ల వయసులోనే సుశాంత్ బలవన్మరణానికి పాల్పడటం అందరిని దిగ్ర్భాంతికి గురిచేసింది. కాగా, సరిగ్గా నాలుగు రోజుల కింద జూన్ 9న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ సెలబ్రిటీస్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సుశాంత్ సింగ్‌తో సహా మరో నలుగురు స్టార్స్ దగ్గర కూడా ఈమె మేనేజర్‌గా పని చేసింది. ఈమె ముంబైలోని మలాడ్‌లో తాను ఉంటున్న అపార్ట్‌మెంట్స్‌లోనే 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోయిన 5 రోజులకు(జూన్ 14,2020) సుశాంత్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో ఈ రెండు మరణాలకు ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. అంత మంచి కెరీర్ ఉన్నపుడు ఎందుకు ఇలాంటి మూర్ఖపు నిర్ణయం తీసుకున్నాడు అనేది అంతుచిక్కని ప్రశ్న.

Related Posts