లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

బాలీవుడ్ లోకి ’మహానటి’

Published

on

heroine keerthi suresh bollywood entry

దక్షిణాదిలో సక్సెస్ అయిన సినీ తారలు సాధారణంగా బాలీవుడ్ వైపు చూస్తారు. ముఖ్యంగా గ్లామర్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న కథానాయికలు బాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఈ లిస్టులో సక్సెస్ అయిన వాళ్లు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. తాజాగా మరో హీరోయిన్ ఈ లిస్టులో చేరేందుకు రెడీ అవుతోంది. 

తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోల సరసన వరుసగా సినిమాలు చేస్తోన్న కీర్తి సురేష్… బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. తెలుగులో కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమా పెద్ద హిట్ అయింది. సావిత్రి పాత్రలో ఆమె ఒదిగిపోయి నటించింది. అచ్చం సావిత్రిలాగా నటించారు. తెలుగు ప్రేక్షకులతో శభాష్ అనిపించుకుంది. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ ఇమేజ్ తారాస్థాయికి చేరింది. 

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోని కపూర్, అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ దాదాపుగా ఖరారు అయినట్లే. దక్షిణాదిలో సత్తా చాటిన మహానటి బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి మరి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *