లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

ఆన్ లైన్‌లో ప్రపోజ్ చేస్తే చంపేస్తా : హీరోయిన్ సోనాక్షి సిన్హా

ఎవరైనా అభిమానులు తనకు సోషల్ మీడియా ద్వారా ప్రపోజ్‌ చేయాలని చూస్తే చంపేస్తానని బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా హెచ్చరించారు.

Published

on

Heroine Sonakshi Sinha warning to fans

ఎవరైనా అభిమానులు తనకు సోషల్ మీడియా ద్వారా ప్రపోజ్‌ చేయాలని చూస్తే చంపేస్తానని బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా హెచ్చరించారు.

ముంబయి : ఎవరైనా అభిమానులు తనకు సోషల్ మీడియా ద్వారా ప్రపోజ్‌ చేయాలని చూస్తే చంపేస్తానని బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా హెచ్చరించారు. సాధారణంగా హీరోయిన్స్ కు లక్షలాది మంది అభిమానులు ఉంటారు. వారిలో ఎక్కువ శాతం అబ్బాయిలే ఉంటారనడంలో సందేహం లేదు. హీరోయిన్లు ఏవైనా ఫొటోలు పోస్ట్ చేయగానే అభిమానులు తెగ పొగిడేస్తుంటారు. ‘ఐ లవ్యూ’ అంటూ కామెంట్లు పెడుతుంటారు.
Also Read : నా కొడుకు లోకేష్ మీద ఒట్టు : లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2

అంతటి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న సెలబ్రిటీలలో సోనాక్షి సిన్హా కూడా ఒకరు. ఇలా కామెంట్స్‌ బాక్స్‌లలో (ఆన్‌లైన్‌) ఐ లవ్యూ చెప్పే అభిమానులకు వార్నింగ్ ఇస్తున్నారు సోనాక్షి ‘అబ్బాయిలు ఎవరైనా సరే.. నాకు ఆన్‌లైన్‌లో ప్రపోజ్‌ చేస్తే చంపేస్తా. ఆన్‌లైన్‌ డేటింగ్‌కి నేను అస్సలు ఒప్పుకోను’ అని వెల్లడించారు సోనాక్షి. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత, సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ షోలో సోనాక్షి ఈ మాట అన్నారు.

‘కళంక్‌’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు సోనాక్షి సిన్హా. అభిషేక్‌ వర్మన్‌ తెరకెక్కిస్తున్న ఈ పీరియడ్‌ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో నటిస్తున్న ఆలియా భట్, వరుణ్‌ ధావన్‌, సంజయ్‌ దత్‌, ఆదిత్య రాయ్‌ కపూర్‌ల పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌లుక్స్‌ విడుదలైన విషయం తెలిసిందే.
Also Read : టాక్ ఆఫ్ ది టౌన్ : చిలుక పట్టి తెస్తే.. రూ.20 వేలు రివార్డు

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *