లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

కుర్రాళ్లైనా.. సీనియర్లైనా సై అంటున్నారు..

Published

on

Heroines busy: చిన్నా పెద్దా అనే తేడా లేదు, స్టార్, అప్‌కమింగ్ అన్న డౌట్ లేదు .. స్టోరీ నచ్చితే చాలు సినిమాలు కమిట్ అయిపోతున్నారు. అటు సీనియర్లనీ, ఇటు జూనియర్లనీ ఎట్ ఎ టైమ్ కవర్ చేస్తున్నారు.

స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలతో పాటు క్రేజ్ ఉన్న యంగ్ హీరోస్‌తో కూడా సినిమాలు కమిట్ అవుతూ కెరీర్‌ని ఇంట్రెస్టింగ్‌గా ప్లాన్ చేసుకుంటున్నారు హీరోయిన్లు. ఈ లిస్టులో ఎవరెవరున్నారో చూద్దాం..


పూజా హెగ్డే
బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా బిజీ అయిపోయిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే, యంగ్ హీరోల్ని కూడా కవర్ చేస్తోంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబులతో సినిమాలు చేసింది.

ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్’, సల్మాన్ ఖాన్‌తో ‘కభీ ఈద్ కభీ దివాళీ’ సినిమాలు చేస్తూనే యంగ్ హీరో అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ చేస్తోంది.


రష్మిక మందన్న
నిన్న కాక మొన్నొచ్చి తెలుగులో దూసుకుపోతున్న హీరోయిన్ రష్మిక మందన్న. సీనియర్లతో పాటు యంగ్ హీరోలతో కూడా సినిమాలు చేస్తోంది ఈ కన్నడ భామ. స్టార్ హీరో విజయ్ దేవరకొండ, మహేష్ బాబులతో హిట్ సినిమాలు చేసింది.

వీళ్లతో పాటు మిడిల్ రేంజ్ హీరోలైన నితిన్, శర్వానంద్ లాంటి హీరోల్ని కూడా కవర్ చేస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ లో నటిస్తోంది.కీర్తి సురేష్
కీర్తి సురేష్, పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ తో గట్టిగానే ఫేమ్ సంపాదించుకుంది. ‘మహానటి’ తో స్టార్ అయిపోయింది. ఇప్పుడు మహేష్ బాబుతో ‘సర్కార్ వారి పాట’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. అటు స్టార్లతో సినిమాలు చేస్తూ.. మరో వైపు నితిన్‌తో ‘రంగ్ దే’ సినిమాలోనూ కనిపించనుంది.కాజల్ అగర్వాల్
సీనియర్ స్టార్ హీరోయిన్ కాజల్ కూడా వచ్చిన అవకాశాల్నిఅందిపుచ్చుకుంటోంది. సౌత్‌లో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసేసిన కాజల్..

ఒక వైపు మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్‌తో ‘భారతీయుడు 2’ సినిమాలు చేస్తూనే.. మిడిల్ రేంజ్ హీరో మంచు విష్ణుతో ‘మోసగాళ్లు’ సినిమా చేస్తోంది.


తమన్నా
మరో స్టార్, మిల్కీ బ్యూటీ తమన్నా కూడా లాస్ట్ ఇయర్ చిరంజీవితో, ఈసంవత్సరం మహేష్ బాబుతో కనిపించింది. ఒక వైపు స్టార్ హీరోస్‌తో కనిపిస్తూనే మరో వైపు గోపీచంద్‌తో ‘సీటీ మార్’, యంగ్ హీరో సత్యదేవ్‌తో ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలు చేస్తోంది.

ఇలా ఈ హీరోయిన్లందరూ ఒక వైపు స్టార్ హీరోలతో, సీనియర్లతో స్క్రీన్ షేర్ చేసుకుంటూనే మరో వైపు యంగ్, మిడిల్ రేంజ్ హీరోలతో కూడా జతకడుతున్నారు.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *