higcourt warning for kcr govt

ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమస్యని పరిష్కరించండి.. లేదంటే : ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆర్టీసీ సమ్మె పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గురువారం(నవంబర్ 7,2019) హాట్ హాట్ గా విచారణ సాగింది. హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వంపై సీరియస్

ఆర్టీసీ సమ్మె పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గురువారం(నవంబర్ 7,2019) హాట్ హాట్ గా విచారణ సాగింది. హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. నవంబర్ 11వ తేదీ లోపు కార్మికులతో చర్చలు జరిపి సమస్యని పరిష్కరించాలని కేసీఆర్ ప్రభుత్వానికి చెప్పింది. సమస్య పరిష్కరించకపోతే తామే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. ప్రభుత్వాలకే కాదు.. కోర్టుకు కూడా అధికారాలు ఉంటాయి అంటూ హాట్ కామెంట్స్ చేసింది.

ఆర్టీసీ సమ్మె పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ అంశంలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఆశ్చర్యం కలిగిస్తోందని కామెంట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కేంద్రం కన్నా ఎక్కువగా ఇస్తోందని.. దేశంలోనే అద్భుతమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తోందని గుర్తు చేసింది. అలాంటి ప్రభుత్వం ఆర్టీసీ సమ్మె సమస్య తాత్కాలిక పరిష్కారం కోసం కనీసం రూ.47 కోట్లు ఇవ్వాలని కోరితే నిరాకరించడం విడ్డూరంగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.

నెల రోజులకుపైగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోర్టు వాపోయింది. ప్రభుత్వం మానవతా ధృక్పథంతో ఆలోచన చేయాలని కోరింది. ప్రజల కోసం ప్రభుత్వం తన స్టాండ్ మార్చుకోలేదా అని కోర్టు ప్రశ్నించింది. ఐఏఎస్ అధికారులు రాజ్యాంగాన్ని అనుసరించాలని సూచించింది. కోర్టు వేదన 48వేల మంది కార్మికుల గురించి కాదని.. కోట్ల మంది తెలంగాణ సమాజం కోసం అని స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మె పిటిషన్ పై విచారణను కోర్టు నవంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది.

Related Posts