High Court dissatisfaction with RTC MD's report

తప్పుడు లెక్కలు సమర్పిస్తారా : ఆర్టీసీ ఎండీ నివేదికపై హైకోర్టు అసంతృప్తి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆర్టీసీ ఎండీ ఇచ్చిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తప్పుడు లెక్కలు సమర్పించారని అసహనం వ్యక్తం చేసింది.

ఆర్టీసీ ఎండీ ఇచ్చిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తప్పుడు లెక్కలు సమర్పించారని అసహనం వ్యక్తం చేసింది. బస్సుల కోనుగోలుకు ఇచ్చిన రుణాన్ని రాయితీల బకాయిల చెల్లింపుగా ఎలా పేర్కొంటారని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ ఆర్టీసీకి డబ్బులు చెల్లించాలా లేదా అనేది తేల్చాలని తెలిపింది. 2017లో జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి బాగాలేక పోవచ్చు..ఇప్పుడు బాగానే ఉందికదా అని హైకోర్టు ప్రశ్నించింది. 

కార్మిక సంఘాలు, ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం చెబుతున్న మాటలకు చాలా వ్యత్యాసం ఉందని కోర్టు తెలిపింది. ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి నిజానికి ఎన్ని నిధులు రావాలి.. ఎన్ని నిధులు బకాయి ఉన్నాయని అడిగినట్టు కోర్టు తెలిపింది. కానీ యాజమాన్యం లెక్కలు కోర్టునే తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులపై యాజమాన్యం శుక్రవారం (నవంబర్ 1, 2019) అఫిడవిట్ దాఖలు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.644  కోట్లు విడుదల చేసినట్లు యాజమాన్యం తెలిపింది. హైదరాబాద్ లో బస్సులు నడుపుతున్నందుకు ఆర్టీసీకి జీహెచ్ఎంసీ రూ.1786.06 కోట్లు చెల్లించాల్సివుండగా 2015-17 మధ్య కాలంలో రూ.336 కోట్లు చెల్లించిందని, మిగతా సొమ్ము చెల్లించే స్థోమత లేదని జీహెచ్ ఎంసీ చెప్పినట్లు యాజమాన్యం తెలిపింది. ఆర్టీసీ నిర్వహణ, డీజిల్ భారం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. నష్టాలను భరించే స్థితిలో లేమని వెల్లడించింది. 

రాయితీ బకాయిలను డీజిల్ కొనుగోలు, జీతాల చెల్లింపులు, ఇతర అవసరాలకు వాడామని ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ తెలిపారు. 28 రోజుల నుంచి కార్మిక సంఘాలు చేపడుతున్న సమ్మె వల్ల రూ.82 కోట్లు నష్టం వాటిల్లిందని ఆర్టీసీ యాజమాన్యం చెబుతుంది. కార్మికులు లేవనెత్తిన 21 డిమాండ్లలో ప్రధానంగా నాలుగు ఆర్థిక పరమైన అంశాలకు రూ. 47 కోట్లు ఖర్చు అవుతాయని ఇప్పటికే యాజమాన్యం తెలిపింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ముగ్గురి వాదనలు విన్న హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 

Related Posts