లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Hyderabad

జీహెచ్ఎంసీ ఎన్నికల రద్దుకు ఆదేశాలు ఇవ్వలేము, హైకోర్టు

Published

on

high court ghmc elections: GHMC ఎన్నికలు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. మేయర్‌, కార్పొరేటర్ల రిజర్వేషన్లు సక్రమంగా లేవంటూ న్యాయవాది రచనా రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. పిటిషనర్‌ వాదనతో విభేదించింది. ఎన్నికల రద్దుకు ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

డిసెంబర్ 1న బ్యాలెట్ పద్ధతిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 4న ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 150 వార్డుల్లో మొత్తం 1122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార టీఆర్ఎస్ 150 స్థానాల్లోనూ తన అభ్యర్థులను నిలిపింది. నవాబ్‌సాహెబ్‌కుంట తప్ప మిగతా 149 స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగుతోంది.

కాంగ్రెస్‌ 146, ఎంఐఎం 51 చోట్ల పోటీ చేయగా.. టీడీపీ 106, సీపీఐ 17, సీపీఎం 12 చోట్ల తమ అభ్యర్థులను నిలిపింది. మొత్తం 415 మంది స్వతంత్ర అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అత్యధికంగా జంగమ్మెట్‌లో 20 మంది.. అత్యల్పంగా ఉప్పల్‌, బార్కాస్‌, నవాబ్‌సాహెబ్‌కుంట, టోలీచౌక్‌, జీడిమెట్ల వార్డుల్లో ముగ్గురు అభ్యర్థులు చొప్పున పోటీ చేస్తున్నారు.

గ్రేటర్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ, బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే


ఈ ఎన్నికల్లో బీజేపీకి జనసేన తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జనసేన అభ్యర్ధులు పోటీ నుండి తప్పుకున్నారు. బీజేపీ అభ్యర్ధుల తరపున ప్రచారం నిర్వహించాలని పవన్ కళ్యాణ్ ను బీజేపీ నేతలు కోరారు. బీజేపీ నేతల అభ్యర్ధనకు జనసేనాని సానుకూలంగా స్పందించారు.

హైదరాబాద్ లిమిట్స్‌లో పోలింగ్ కేంద్రాల సంఖ్య:
మొత్తం పోలింగ్ కేంద్రాలు 4వేల 936. వాటిలో 62 సైబరాబాద్ పరిధిలో ఉండగా… 105 సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఉన్నాయి. అవి కాకుండా 4వేల 979 హైదరాబాద్ లిమిట్స్‌లో ఉన్నట్లు లెక్క.

గ్రేటర్ పరిధిలో పోలింగ్ కేంద్రాల సంఖ్య:
9,248 పోలింగ్ కేంద్రాలు (1,439 సున్నితమైన, 1,004 సమస్యాత్మక, 257 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు.)

మొత్తం వార్డులు:
150 వార్డులు

మొత్తం పోలింగ్ లొకేషన్లు ఎన్ని?
1632

సున్నితమైన (సెన్సిటివ్) ప్రాంతాలెన్ని?
601 పోలింగ్ లొకేషన్లు, 1704 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవి.

హైపర్ సెన్సిటివ్ (అతి సున్నిత) ప్రదేశాలెన్ని?
307 పోలింగ్ లొకేషన్లు, 1085 పోలింగ్ కేంద్రాలు అతి సున్నితమైనవి.

హైదరాబాద్ లిమిట్స్‌లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయి?
15 ఉన్నాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *