Home » జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు.. అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులు కొట్టేసిన హైకోర్టు
Published
1 month agoon
Insider Trading Cases: ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ దిశగా అడుగులేస్తున్న జగన్ సర్కారుకు అమరావతి భూములు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ ఆరోపణలు చేస్తుండగా.. ఈ విషయమై పెట్టిన కేసులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. అమరావతిలో భూముల కొనుగోలు వ్యవహారంపై తెల్ల రేషన్కార్డుదారులపై సీఐడీ కేసులు నమోదు చేసింది. మొత్తం 700మందికిపైగా తెల్ల రేషన్ కార్డుదారులపై కేసులు నమోదుచేశారు. ఇప్పుడు అవి నిరూపించేందుకు ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని కొట్టేసింది హైకోర్టు.
రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రభుత్వం పెట్టిన కేసులను కొట్టేసిన హైకోర్టు.. రాజధానిలో భూములు ముందుగానే కొని లబ్ధిపొందారని పేర్కొంది. భూములు అమ్మినవారు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ప్రభుత్వం కక్షసాధిస్తోందని కిలారు రాజేష్ అనే వ్యక్తి క్వాష్ పిటిషన్ వేయగా.. అమ్ముకున్నవారు ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా పెడతారని వాదించారు పిటిషనర్ తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు.
వాదనలు విన్న హైకోర్టు ఇన్సైడర్ ట్రేడింగ్ లేదని, ఇన్సైడర్ ట్రేడింగ్ ఐపీసీ సెక్షన్లకు వర్తించదని స్పష్టం చేసింది.
నిమ్మగడ్డకు ఎదురుదెబ్బ.. పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్ చెల్లదు
పంచాయతీ ఎన్నికలు : సుప్రీంకోర్టుకు వెళ్లనున్న ఏపీ ప్రభుత్వం!
ఏపీలో పంచాయితీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైకోర్టులో ప్రభుత్వానికి ఊరట, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దు
అమరావతి ఉద్యమంపై జగన్ సంచలన కామెంట్స్
రాజధాని రైతులకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు