high court on tsrtc strike

ఏం చెబుతుంది : ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ 

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆర్టీసీ సమ్మె పిటిషన్ పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. గత విచారణలో ప్రభుత్వ అధికారులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం, పూర్తి వివరాలను మరోసారి కోర్టుకు

ఆర్టీసీ సమ్మె పిటిషన్ పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. గత విచారణలో ప్రభుత్వ అధికారులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం, పూర్తి వివరాలను మరోసారి కోర్టుకు తెలపాలని, కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించినప్పటికీ.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆర్టీసీ సమ్మె వ్యవహారం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. మరోవైపు ప్రభుత్వ అధికారుల తీరును హైకోర్టు గత విచారణలో ఎండగట్టింది.

ఆర్టీసీపై కేంద్ర ప్రభుత్వంకు ఉన్న అధికారాలు, రాష్ట్రాల్లో ఆర్టీసీపై కేంద్ర ప్రభుత్వంకు ఉన్న వాటా పై గత విచారణలో కేంద్ర ప్రభుత్వం తరపు సొలిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. అస్సలు టీఎస్ ఆర్టీసీకి చట్టబద్ధత లేదని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సోమవారం(నవంబర్ 11,2019) కోర్టుకు ఎలాంటి వాదనలు వినిపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కోర్టులో వ్యవహరించే వ్యూహాలపై ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులు దిశానిర్దేశం చేశారు. 

కోర్ట్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ కార్పొరేషన్, జీహెచ్ఎంసీ సమర్పించిన అఫిడవిట్లపై గత విచారణలో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరుగా కోర్టుకు హాజరైన ఐదుగురు ఐఏఎస్ అధికారులను ఇచ్చిన నివేదికపై పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేసింది ధర్మాసనం. ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు, రైతుల సంక్షేమం కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు రూ.50 కోట్లు ఎందుకు ప్రభుత్వం ఇవ్వడం లేదని ప్రశ్నించింది. సోమవారం పూర్తి స్థాయి అఫిడవిట్ ను సమర్పించాలని ఆదేశించింది. 

ఇక సోమవారం హైకోర్టులో తెలంగాణ సర్కార్‌ మరో అఫిడవిట్ దాఖలు చేయనుంది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదికను కోర్టుకు సమర్పించనుంది. ఆర్టీసీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ప్రభుత్వం చెబుతోంది. ఆర్టీసీ మొత్తం బకాయిల 2వేల 209 కోట్లుగా ప్రభుత్వం లెక్కచూపుతోంది. అందులో పీఎఫ్ బకాయిలు 788.30కోట్లు, క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ బకాయిలు 500.95కోట్లు, మోటారు వెహికల్ యాక్ట్ ప్రకారం 2017 నుంచి 2019 వరకు 452.36కోట్లు బకాయిలు ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

లీవ్ ఎన్‌ క్యాష్‌మెంట్ 2014 నుంచి 2018 వరకు రూ.180 కోట్లు, రిటైర్డ్ ఎంప్లాయిస్ సెటిల్స్‌మెంట్‌ బకాయిలు రూ.52కోట్లు, హెచ్ఎస్డీ ఆయిల్ బిల్స్ రూ.34.45 కోట్లు, ప్రైవేట్ బస్సుల సంస్థల బకాయిలు రూ. 25 కోట్లు, ఆర్టీసీ బస్సు మరమ్మతుల బకాయిలు రూ.60 లక్షలు, హెచ్ వో, రీజియన్, జోన్ ఇతర బకాయిలు రూ.36.40 కోట్లు ఉన్నట్లు లెక్క తేల్చింది.

READ  కరోనా నుంచి కాపాడుకోండి: ఇంట్లోనే శానిటైజర్‌ చేసుకోవడం ఎలా?

ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వం పాత్ర తెరమీదకు రావడంతో ప్రభుత్వం ఏం చెయ్యాలనే ఆలోచనలో పడింది. ప్రభుత్వం తీరు, కార్మిక సంఘాల వైఖరిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఆర్టీసీ సమ్మెపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సమస్య పరిష్కారం లభించకపోతే తామే జోక్యం చేసుకుంటామన్న కోర్టు.. విచారణలో ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠ మారింది. 

Related Posts