high court on tsrtc strike

ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని చెప్పలేం : హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సమ్మె చట్టవిరుద్ధమని చెప్పలేమని.. మాకూ కొన్ని పరిమితులుంటాయని స్పష్టం చేసింది హైకోర్టు. ఏ చట్టం ప్రకారం ఆర్టీసీ సమ్మెను ఇల్లీగల్ అని పరిగణించాలంటూ ప్రశ్నించింది.

సమ్మె చట్టవిరుద్ధమని చెప్పలేమని.. మాకూ కొన్ని పరిమితులుంటాయని స్పష్టం చేసింది హైకోర్టు. ఏ చట్టం ప్రకారం ఆర్టీసీ సమ్మెను ఇల్లీగల్ అని పరిగణించాలంటూ ప్రశ్నించింది. గంటల తరబడి ఒకే వాదన వినిపిస్తూ విసిగిస్తారేంటి అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై విచారణ జరిపిన న్యాయస్థానం.. విచారణను మంగళవారం(నవంబర్ 12,2019) వాయిదా వేసింది. 

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోమవారం(నవంబర్ 11,2019) వాదనలను కొనసాగించిన హైకోర్టు.. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని చెప్పలేమని కామెంట్ చేసింది. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది కృష్ణయ్య హైకోర్టులో వాదనలు వినిపించారు. చట్ట విరుద్ధంగా ఉన్న ఆర్టీసీ సమ్మెపై ఎస్మా ప్రయోగించేలా చర్యలు తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో.. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీని తప్పనిసరి సర్వీస్‌గా పేర్కొంటూ జారీ చేసిన జీవో చూపాలని ఆదేశించింది. ఆర్టీసీని పబ్లిక్‌ యుటిలిటీ సర్వీస్‌గా ప్రకటించినందున ఎస్మా పరిధిలోకి వస్తుందని కృష్ణయ్య వాదించగా.. ప్రజా ప్రయోజన సేవలన్నీ అత్యవసర సర్వీసులు కావని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టీసీని ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం జీవో ఇస్తేనే అత్యవసర సర్వీసుగా ఉంటుందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. 

రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ తీర్మానాన్ని న్యాయస్థానానికి ప్రభుత్వం సమర్పించింది. 18 అంశాలతో కూడిన అఫిడవిట్‌లో ఆర్టీసీపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. చర్చల ప్రక్రియ కొనసాగుతుండగానే కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లాయని నివేదికలో పేర్కొన్నారు. పారిశ్రామిక వివాదాల చట్టం కింద చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం కోర్టును కోరింది. కోర్టు సూచించినట్లుగా… రూ.47కోట్లు చెల్లించినప్పటికీ.. కార్మికుల సమస్యలు పరిష్కారం కాబోవని ప్రభుత్వం తెలిపింది. నాలుగు డిమాండ్ల పరిష్కారానికి 47 కోట్లు చెల్లించాలన్న హైకోర్టు సూచనను పరిశీలించి అధ్యయనం చేస్తే 2వేల 209 కోట్ల దాకా తప్పనిసరి చెల్లింపులు, రుణాలు, నష్టాలుండగా ఈ 47 కోట్లు ఏ మూలకూ సరిపోవని ప్రభుత్వం నివేదికలో వివరించింది. కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని అనేకసార్లు తాము కోరామని గుర్తుచేసింది.

మరోవైపు… ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు ఆసక్తికర కామెంట్స్ చేసింది. సమ్మె అక్రమమా.. కాదా.. అని ప్రకటించవచ్చో.. లేదో.. తామ పరిశీలిస్తామని పేర్కొంది. తమకూ కొన్ని పరిమితులు ఉంటాయని, ఇలాగే చేయాలని ఆదేశించలేమని హైకోర్టు పేర్కొంది. అంతేకాకుండా… సమ్మె ఇల్లీగల్ అని ఎవరు నిర్ణయిస్తారని కోర్టు ప్రశ్నించింది. గంటల తరబడి ఒకే వాదన వినిపిస్తున్నారంటూ మండిపడింది. ఇక.. రాష్ట్రంలోని పలు రూట్లను ప్రైవేటీకరిస్తూ రాష్ట్ర మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని విచారణ సందర్భంగా ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. దీనిపైనా విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. 

READ  ప్లాస్మా థెరపీతో ప్రాణానికే ప్రమాదం... బాంబు పేల్చిన కేంద్రం

హైకోర్టులో విచారణ నేపథ్యంలో… మంగళవారం తమ నిరసన షెడ్యూల్‌లో ఆర్టీసీ జేఏసీ స్వల్ప మార్పులు చేసింది. నిరవధిక దీక్షను వాయిదా వేసింది. అలాగే… చలో ట్యాంక్ బండ్ సందర్భంగా గాయపడిన మహిళను గవర్నర్ ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. 

ఆర్టీసీ సమ్మెపై సోమవారం కోర్టు ఏదో ఒకటి తేల్చేస్తుందనుకున్నా… మరోసారి వాయిదా పడింది. దీంతో… సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై ఎలాంటి వాదనలు వినిపించాలా అనే అంశంపై అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ జేఏసీ కసరత్తు చేస్తున్నాయి.

Related Posts