Home » ఎస్ఈసీ కార్యాలయం వద్ద హైసెక్యూరిటీ…నిమ్మగడ్డకు భద్రత పెంపు
Published
4 weeks agoon
High security at the AP SEC office : ఏపీ ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద హైసెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు భద్రత పెంచారు. ఎస్ఈసీ కార్యాలయం వద్ద పోలీస్ డాగ్స్ తో సెర్చింగ్ చేస్తున్నారు. ఆఫీస్ వద్ద విస్తృత తనిఖీలు చేపట్టారు. అడుగడుగునా పోలీసులు నిఘా ఉంచారు. కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరిని తనఖీ చేస్తున్నారు. భద్రతా సిబ్బంది వాహనాలనూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏపీ పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ దూకుడు మీదున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు కావాల్సిన అన్ని హంగులను సమకూర్చుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ స్పెషల్ ఫోకస్ పెట్టారు.
ఇప్పటికే ఎన్నికలను రీ షెడ్యూల్ చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ.. పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్‌పై బదిలీ వేటు వేశారు. ఇద్దరు అధికారులను బదిలీ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించారు. మరోవైపు.. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను బదిలీ చేయాలని ప్రభుత్వానికి ఎస్ఈసీ లేఖ రాసింది. ఎస్ఈసీ లేఖతో ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసింది. గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు శామ్యూల్ ఆనంద్, నారాయణ్ భరత్ గుప్తాలను ప్రభుత్వం జీఏడీకి సరండర్ చేసింది.
ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లకు కలెక్టర్లుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డిని సాధారణ పరిపాలన శాఖకు అటాచ్ చేసిన ప్రభుత్వం… చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్‌కు తిరుపతి అర్బన్ ఎస్పీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సీరియస్‌గా తీసుకున్న ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ.. వేగంగా పావులు కదుపుతూ.. ఎన్నికల ప్రక్రియపై స్పెషల్ ఫోకస్ పెట్టారనే చెప్పుకోవాలి.
వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్, మెసేజ్‌లు పంపలేరు, మే 15 నుంచి అమలు
రైతుల రైల్ రోకో, భారీగా పోలీసుల బందోబస్తు
బలవంతంగా నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నవారికి మరో ఛాన్స్.. మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు
నిమ్మగడ్డకు ఏమైంది?..ఎందుకీ మౌనం?
జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట, రేషన్ డోర్ డెలివరీకి గ్రీన్ సిగ్నల్
మంత్రి కొడాలి నానిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశం