లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

హైక్ మెసేజింగ్ యాప్ ఇక ఆగిపోయినట్లే..

Published

on

Hike Messaging App: ప్రపంచవ్యాప్తంగా ఇంటర్‌కనెక్టింగ్ గా ఉండటంతో ప్రతి ఒక్కరి స్మార్ ఫోన్లలో మెసేజింగ్ యాప్ లు తప్పనిసరి అయిపోయింది. అందుకే బోలెడు యాప్ లు పోటీపడుతున్నాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లు గ్రూపులుగా సెట్ అయి మాట్లాడుకుంటున్న మెసేజింగ్ యాప్ ల నుంచి హైక్ తప్పుకుంది. పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సప్ కే ప్రైవసీ పాలసీ అప్‌డేట్‌తో వెనక్కుపడిపోయింది.

2021లో లాంచ్ అయిన హైక్.. పబ్లిసిటీతో పాటు మంచి సర్వీసు అందించడంతో టాప్ పొజిషన్ కు చేరింది. అప్పుడే విదేశీ మెసేజింగ్ యాప్‌లు వాట్సప్ లాంటివి అందుబాటులోకి రావడంతో వెనకపడిపోయింది. అతిపెద్ద ఇండియన్ ఫ్రీవేర్, ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ కు యూజర్లు క్రమంగా తగ్గిపోయారు.

ఆగష్టు 2016న హైక్ 100మిలియన్ వరకూ రిజిష్టర్డ్ యూజర్లను సంపాదించుకుంది. ఇండియాలో ఉన్న 10రీజనల్ లాంగ్వేజ్ ల వరకూ సపోర్ట్ చేసేలా రూపొందించింది. అలాంటి హైక్ క్లోజ్ అయిపోతున్నట్లు రీసెంట్ గా దాని సీఈఓ కెవిన్ భారతీ మిట్టల్ ట్విట్టర్ వేదికగా జనవరి 6న ప్రకటించారు. ‘స్టిక్కర్ చాట్ యాప్ జనవరి 21తో అస్తమించనుంది. మాపై నమ్మకముంచినందుకు థ్యాంక్యూ. మీరంతా లేకపోతే మేమిక్కడ ఉండేవాళ్లం కాదు’ అని చెప్పారు.

వాట్సప్ కు ప్రత్యామ్నాయంగా బోలెడ్ మెసేజింగ్ యాప్ లు వస్తున్న సమయంలో హైక్ ఈ నిర్ణయం తీసుకోవడం శోచనీయంగా మారింది. హైక్ మెసేంజర్ యూజర్లు వారి సంభాషణలు, డేటాను యాప్ లోనే డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం కూడా ఉండేది. యాప్ క్లోజ్ అయిపోవడానికి కారణాలు ఒకటి కూడా చెపపలేదు. హైక్ మెసేంజర్ స్థానంలో వైబ్, రష్ యాప్ లు నిలిచాయి.

ఇవి యాండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫాంలలోనూ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అయితే హైక్ స్టిక్కర్లు, మోజీలు మొత్తం వైబ్, రష్ యాప్ లలో దొరుకుతున్నాయి. ఇక అవి దొరకవేమో అనే బాధకూడా అవసర్లేదు.

హైక్ యాప్ కు విదేశాల నుంచి కూడా భారీ మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి. ఫాక్స్‌కాన్, టెన్సెంట్ లాంటి సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టినా ఇండియన్ మార్కెట్ లో వాట్సప్ డామినేట్ చేయడంతో లాభం లేకుండాపోయింది. డిసెంబర్ 2019లో హైక్ కు 2మిలియన్ మంది యాక్టివ్ యూజర్లు మాత్రమే ఉన్నారు. సిగ్నల్ యాప్ కు ఈ ఒక్క నెలలోనే 30మిలియన్ ఇన్‌స్టాలేషన్స్ వచ్చేశాయి.