Hilarious Action Packed Jackpot Releasing on 21st November

తెలుగులో ‘జాక్‌పాట్’ – నవంబర్ 21 విడుదల

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సీనియర్ కథానాయికలు రేవతి, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘జాక్‌పాట్’ తెలుగులో నవంబర్ 21న విడుదల కానుంది..

తెలుగు, తమిళ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్న సీనియర్ కథానాయికలు రేవతి, జ్యోతిక… తమ సెకండ్ ఇన్నింగ్స్‌లో డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు. వీళ్లిద్దరూ కలిసి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ్ సినిమా.. ‘జాక్ పాట్’.. ‘గులేబకావళి’ (2018) ఫేమ్.. కళ్యాణ్ డైరెక్ట్ చెయ్యగా, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య నిర్మించారు.

ఈ సినిమా ఆగష్టు 2న తమిళనాట విడుదలైంది. తెలుగులో అదే పేరుతో సూర్య రిలీజ్ చేయనున్నాడు. ఇటీవల విడుదల చేసిన పోస్టర్స్ అండ్ ట్రైలర్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ‘నాన్ కడవుల్’ రాజేంద్రన్, ఆనంద్ రాజ్, మన్సూర్ అలీ, యోగిబాబు కీలక పాత్రలు పోషించగా, నటుడు, దర్శకుడు సముద్రఖని గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు.

ఈ సినిమా షూటింగ్ కేవలం 35 రోజుల్లో పూర్తి చెయ్యడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘జాక్‌‌పాట్’ నవంబర్ 21న రిలీజ్ కానుంది. సంగీతం : విశాల్ చంద్రశేఖర్, కెమెరా : ఆనంద్ కుమార్, కో-ప్రొడ్యూసర్ : రాజ్ శేఖర్, కర్పూర సుందర పాండియన్.

 

Related Posts